సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై విడుదల కాలేదు:
సామాజిక అంశాలను చూపించే 'పంజాబ్ 95', 'టీస్', 'తడక్ 2' వంటి చిత్రాలు సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై విడుదల కాలేదని అనురాగ్ కశ్యప్ అన్నారు. కుల, ప్రాంత, జాతి వివక్ష చూపించే ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఇలాంటి సినిమాలు ఎన్ని నిషేధించబడ్డాయో తెలియదన్నారు.
సొంత ముఖం చూసుకోవడానికి సిగ్గుపడుతున్నారని, వాళ్లకు ఇబ్బంది కలిగించే సినిమా గురించి బహిరంగంగా మాట్లాడలేనంత పిరికివాళ్లు అని విమర్శించారు అనురాగ్ కశ్యప్.