సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఉదయ్‌ కిరణ్‌ ఎవరిని ప్రేమించాడో తెలుసా? చిరంజీవి చేరదీయడం వెనుక ఇంత కథ ఉందా?

First Published | Nov 8, 2024, 6:23 PM IST

ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి లవ్‌ ఫెయిల్యూర్‌. సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఆయన ఎవరిని ప్రేమించాడో తెలుసా?
 

ఉదయ్‌ కిరణ్‌ లవర్‌ బాయ్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు ఉదయ్‌ కిరణ్‌. వరుసగా లవ్‌ స్టోరీస్‌ చేసి విజయాలు సాధించాడు. హ్యాట్రిక్‌ హిట్స్ తో అమ్మాయిల డ్రీమ్‌ బాయ్‌ అయిపోయాడు. దీంతో విశేషమైన గర్ల్స్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు.

అందంగా ఉండటం, ఇన్నోసెంట్‌గా ఉండటం, బాగా నటించడంతో అమ్మాయిలు ఆయన్ని బాగా ఇష్టపడ్డారు. అంతేకాదు యూత్‌లోనూ భారీ క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎలా అయితే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారో, అప్పుడు ఉదయ్‌ కిరణ్‌కి కూడా అదే స్థాయిలో అభిమానులు పిచ్చిగా ఇష్టపడేవారు. అభిమానాన్ని చాటుకునే వారు. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ పరంగా చేసిన కొన్ని తప్పులు, నిజ జీవితంలో చేసిన కొన్ని మిస్టేక్స్, కొన్ని నిర్ణయాలు ఆయన్ని జీవితాన్ని మార్చేశాయి. కెరీర్‌తోపాటు లైఫ్‌ని తలక్రిందులు చేశాయి. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్లింది. అయితే ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ డౌన్‌ కావడానికి చిరంజీవి కారణమని ఇప్పటికీ అంటుంటారు. కానీ ఆయనే ఉదయ్‌ కిరణ్‌ని చేరదీశారనేది నిజం.

వరుస హిట్లతో ఉన్న ఉదయ్‌కి సపోర్ట్ గా నిలిచాడు. అంతేకాదు కూతురు సుస్మితని ఇచ్చి పెళ్లి చేయాలని, వారితో రిలేషన్‌ కలుపుకోవాలని భావించారు. సుస్మితతో ఉదయ్‌ కిరణ్‌కి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ ఉదయ్‌ కిరణ్‌ ఆ తర్వాత తీసుకున్న నిర్ణయంతో వారి మధ్య రిలేషన్‌ నిలబడలేదు. మధ్యలోనే తునిగిపోయింది. 
 


ఇదిలా ఉంటే ఉదయ్‌ కిరణ్‌ సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందే ఓ లవ్‌ స్టోరీ ఉంది. ఆయన ఓ అమ్మాయిని ఎంతో సిన్సియర్‌గా ప్రేమించాడు. కానీ ఆమె హ్యాండిచ్చింది. పెళ్లి వరకు వెళ్లాలనుకున్నారు. కానీ మధ్యలోనే బ్రేకప్‌ చెప్పేసిందట. అయితే ఆమె ఓ లేడీ జర్నలిస్ట్ కావడం విశేషం. ఉదయ్‌ కిరణ్‌ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది.

ఆ ఇంటర్వ్యూ టైమ్‌లో బాగా ఇంప్రెస్‌ అయ్యాడట ఉదయ్‌. దీంతో ఇద్దరి మధ్య చాటింగ్‌ పెరిగింది. ఆ రిలేషన్‌ కూడా బలపడింది. అది ప్రేమగా మారిందట. కొంత కాలం ప్రేమించుకున్న ఈ ఇద్దరి మధ్య మనస్పర్థాలు పెరిగాయని, అది చిన్నగా పెరుగుతూ పెద్దదై బ్రేకప్‌ చెప్పుకునే వరకు వెళ్లిందట. అయితే ఉదయ్‌కి ఆమెనే బ్రేకప్‌ చెప్పిందని ఉదయ్‌ కిరణ్‌ అక్క శ్రీదేవి చెప్పడం విశేషం. 
 

ఆ లేడీ జర్నలిస్ట్ హ్యాండివ్వడంతో బాగా కుంగిపోయాడట ఉదయ్‌ కిరణ్‌. చాలా రోజులు ఆమె వెంటపడ్డా పట్టించుకోలేదని, దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడట. అది సినిమాలపై కూడా ప్రభావం చూపించేంత వరకు వెళ్లిందట. అయితే అప్పటికే వరుస హిట్లతో ఉన్న ఉదయ్‌ని చిరంజీవి కూడా సపోర్ట్ చేశారు. ఫ్రీగా మెలిగారు. దీంతో ఆయనతో ఉన్న చనువుతో ఉదయ్‌ కిరణ్‌.. తన లవ్‌ స్టోరీని చిరకి చెప్పారట.

చాలా సార్లు మెగాస్టార్‌ ముందు ఏడ్చినట్టు తెలిపింది ఉదయ్‌ కిరణ్‌ అక్క శ్రీదేవి. ఈ క్రమంలో అతన్ని ఆ బాధ నుంచి తప్పించేందుకు చిరంజీవి ఎంతో ఓదార్చాడట. కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాలని, మంచి కెరీర్‌ ఉందని, ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ చెప్పారట. దీంతో ఉదయ్‌ కిరణ్‌ ఆ బాధని మర్చిపోయి రెగ్యూలర్‌గా సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. విజయాలు కూడా అందుకున్నాడట. 
 

ఆ సమయంలోనే చిరంజీవి ఇలా తన కూతురు సుస్మిత పెళ్లి మ్యాటర్‌ తెలిపారట. ఉదయ్‌ కూడా కన్విన్స్ అయి పెళ్లికి ఒప్పుకున్నారట. వీరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఉదయ్‌ కిరణ్‌ నో చెప్పడం వల్ల చిరంజీవికి కోపం వచ్చిందని, దీంతో అవకాశాలు రాకుండా చేశాడనే ప్రచారం ఉంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌.. సాఫ్ట్ వేర్‌ అమ్మాయిని 2012లో మ్యారేజ్‌ చేసుకున్నారు. రెండేళ్లకే ఆయన ఆత్మహత్య  చేసుకున్న విషయం తెలిసిందే.  

Read more:`జాతర` సినిమా రివ్యూ, రేటింగ్.. మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Also read: 
 

Latest Videos

click me!