Published : Mar 18, 2024, 08:57 PM ISTUpdated : Mar 18, 2024, 09:49 PM IST
టాలీవుడ్ నటీమణులు ప్రస్తుతం ఎంత ఫిట్ గా ఉంటున్నారో తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ సిక్స్ ప్యాక్ ను సాధించింది.
సినిమా పరిశ్రమలో ఎక్కువకాలం ఉండాలంటే హీరోలకు హిట్లు కావాలి... ఇక హీరోయిన్లు మాత్రం గ్లామర్ తో పాటు ఫిట్ నెస్ తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
26
టాప్ హీరోయిన్లను గమనిస్తే వారి డైలీ రోటీన్ లో జిమ్, వర్కౌట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు టాలీవుడ్ తారలు జిమ్ ల్లో శ్రమిస్తున్న విషయం మనకు తెలిసిందే.
36
సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), తమన్నా భాటియా, శ్రియా శరణ్ (Shriya Saran) తో పాటు మరికొందరు హీరోయిన్లు జిమ్ ల్లో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.
46
అయితే ఇప్పటి వరకు ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన హీరోయిన్లు, యంగ్ బ్యూటీలు నాజుగ్గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పర్ఫెక్ట్ ఏబీఎస్ (ABS)ను సాధించేందుకు కృషి చేస్తున్నారు.
56
కానీ, ఇప్పటి వరకు టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ను కలిగి ఉన్నది మాత్రం కేవలం తాప్సీ పన్ను (Taapsee Pannu) అని తెలుస్తోంది. అది కూడా గతేడాదే ఈ ముద్దుగుమ్మ తన సిక్స్ ప్యాక్ ను చూపించింది.
66
పర్ఫెక్ట్ ఏబీఎస్ తో తను ఫొటోలకు ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక టాలీవుడ్లో ఇంతలా ప్యాక్స్ చూపించిన హీరోయిన్ లేదనే అంటున్నారు. మరోవైపు ఇప్పుడున్న హీరోయిన్లు, యంగ్ బ్యూటీలు తమ ఫిట్ నెస్ తోనూ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.