విజయ్‌తో మళ్ళీ పనిచేయడం పట్ల కంగనా మాట్లాడుతూ, `ప్రియమైన విజయ్ సర్, `తలైవి` వంటి అద్భుతమైన అనుభవం తర్వాత మళ్ళీ మీ కీర్తిలో మునిగిపోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ బృందంలో ఉండటానికి, మీ ఆదేశాలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ధన్యవాదాలు సర్` అని పేర్కొంది.
గత సంవత్సరం ఫిబ్రవరిలో, కంగనా మాధవన్‌తో సెల్ఫీని కూడా షేర్ చేసింది. ఆమె అతన్ని తన అభిమాన సహనటుడు అని పిలిచి, "మరొక అద్భుతమైన స్క్రిప్ట్ కోసం నా అభిమాన @actormaddy తో తిరిగి వచ్చాను` అని పేర్కొంది. మాధవన్, కంగనా గతంలో `తను వెడ్స్ మను`, `తను వెడ్స్ మను రిటర్న్స్` చిత్రాలలో కలిసి నటించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. హిందీ, తమిళంలో ద్విభాషా చిత్రంగా విడుదల కానుంది. ఇంతలో,