Anasuya: `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సినిమా చూసి ఆమె రియాక్షన్‌ ఇదే

Published : Dec 30, 2025, 07:38 AM IST

జబర్దస్త్ యాంకర్‌గా చేస్తోన్న సమయంలో అనసూయకి `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్ర బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. అయితే ఈ ఛాన్స్ ఆమెకి ఈ స్టార్‌ హీరోయిన్‌ రిజెక్ట్ చేయడం వల్లే వచ్చింది. ఆమె ఎవరంటే? 

PREV
16
శివాజీ విషయంల వివాదంలో అనసూయ

యాంకర్, నటి అనసూయ ఇప్పుడు సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది.  వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. గతేడాది వరకు విజయ్‌ దేవరకొండ విషయంలో వివాదంలో నిలిచింది. అంతకు ముందు ఆంటీ అని పిలిచిన అభిమానులను ఆటకట్టించే విషయంలో వివాదంలో నిలిచింది. ఇటీవల కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ శివాజీ విషయంలో వివాదంలో నిలుస్తోంది. హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ చేసిన కామెంట్లకి కౌంటర్‌ ఇస్తూ ఆమె సరికొత్త రచ్చకి తెరలేపింది. 

26
రంగమ్మత్త పాత్రతో బ్రేక్‌ అందుకున్న అనసూయ

అనసూయ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. శివాజీతోపాటు ఆమె చుట్టూ గట్టిగానే చర్చ నడుస్తోన్న నేపథ్యంలో తాజాగా అనసూయకి సంబంధించిన మరో విషయం ఆసక్తికరంగా మారింది. అనసూయ నటిగా బ్రేక్‌ రావడానికి కారణం ఓ స్టార్‌ హీరోయిన్‌ అట. ఆమె నో చెప్పడంలో వల్లే అనసూయ `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్ర చేయాల్సి వచ్చింది, ఈ పాత్రతోనే అనసూయ బిగ్‌ బ్రేక్‌ అందుకున్న విషయం తెలిసిందే.

36
రంగమ్మత్త పాత్రలో ఇరగదీసిన అనసూయ

రామ్‌ చరణ్‌, సమంత కలిసి నటించిన `రంగస్థలం` చిత్రానికి సుకుమార్‌ దర్శకుడు. ఇందులో అనసూయ రంగమ్మత్త పాత్రని పోషించింది. ఈమెని చరణ్‌ అత్త అని పిలుస్తుంటాడు. ఈమె భర్త విదేశాలకు వెళితే ఒంటరిగా ఉంటుంది. అదే సమయంలో చరణ్‌కి సపోర్ట్ గా ఉంటుంది. ఈ పాత్రలో అనసూయ ఇరగదీసింది. తన కెరీర్‌లోనే బెస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. గెటప్‌, ఆమె స్లాంగ్‌ బాగా కుదిరాయి. చాలా నేచురల్‌గా చేసి మెప్పించింది అనసూయ. అయితే ఈ పాత్రకి దర్శకుడు సుకుమార్‌ మొదట అనుకున్నది అనసూయ కాదు.

46
రంగమ్మత్త పాత్రకి ఫస్ట్ ఛాయిస్‌ రాశి

`రంగస్థలం` సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం మొదట దర్శకుడు సుకుమార్‌ అనుకున్నది స్టార్‌ హీరోయిన్‌ రాశిని. ఆమె ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేసింది. బాల నటి నుంచి కెరీర్‌ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి, బిగ్‌ స్టార్స్ తో సినిమాలు చేసి విజయాలు అందుకుంది. మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చింది. పెళ్లి తర్వాత పిల్లల కోసం ఆమె గ్యాప్‌ తీసుకుంది. ఈ మధ్య మళ్లీ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు టీవీ సీరియల్స్ లోనూ నటిస్తోంది. తెలుగులో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. అవకాశాల కోసం వెయిట్‌ చేస్తోంది.

56
అందుకే రంగమ్మత్త పాత్ర వదిలేశా- రాశి

ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ లేడీ కమెడియన్‌ వర్ష నిర్వహిస్తున్న `కిసిక్‌ టాక్స్` లో   రాశి మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకుంది. `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని మొదట తననే అడిగారని తెలిపింది రాశి. కానీ ఆ పాత్ర తనకు సెట్‌ కాదని వదిలేసిందట. తన ఇమేజ్‌కి సూట్‌ అయ్యే పాత్ర కాదని, అలాంటి పాత్ర చేస్తే ఇబ్బందిగా ఉంటుందని భావించి నో చెప్పిందట. దీంతో ఈ పాత్ర అనసూయకి వెళ్లింది. ఆ తర్వాత సినిమా చూశానని, అనసూయ బాగా చేసిందని తెలిపింది రాశి. అయితే ఈ పాత్రని మిస్‌ చేసుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని, తనకు సెట్‌ కాదనే వదిలేసుకున్నా, అందులో రిగ్రెట్‌ ఏం లేదని చెప్పింది రాశి. ప్రస్తుతం ఈ విషయంలో వైరల్‌గా మారింది.

66
అనసూయ చేతిలో ఒక్క సినిమానేనా?

అనసూయకి ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. గతంలో నటించిన రెండు సినిమాలు విడుదలకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో తెలియదు, ఇటీవలే కొత్త సినిమా స్టార్ట్ చేసింది. ఇందులో రేణు దేశాయ్‌ కూడా నటిస్తుండటం విశేషం. మరోవైపు అడపాదపా పలు టీవీ షోస్‌లో మెరుస్తోంది అనసూయ. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories