చిరంజీవి కారణంగా ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున... తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడిన జూనియర్!

First Published Jul 8, 2024, 5:31 PM IST

జూనియర్ ఎన్టీఆర్ కి లైవ్ లో వార్నింగ్ ఇచ్చాడు హీరో నాగార్జున. అందుకు కారణం చిరంజీవి. మెగాస్టార్ కేంద్రంగా ఎన్టీఆర్-నాగార్జున మధ్య నెలకొన్న ఆ వివాదం ఏమిటో చూద్దాం.. 
 

junior ntr

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికి వయసు 18 ఏళ్ళు లోపే. ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని 2001లో విడుదలైంది. అదే ఏడాది స్టూడెంట్ నెంబర్ వన్, సుబ్బు చిత్రాల్లో ఎన్టీఆర్ నటించాడు. రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. సుబ్బు మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. తన డాన్సులతో ఎన్టీఆర్ ప్రేక్షకుల అటెన్షన్ పొందాడు. 

2002లో విడుదలైన ఆది మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇరవై ఏళ్ళు నిండకుండానే ఎన్టీఆర్ మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక సింహాద్రి మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ పీక్స్ కి చేరింది. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ ని స్టార్ హీరోల సరసన చేర్చింది. ఈ మూవీ విడుదల తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వివాదాస్పదం అయ్యింది. 
 

Latest Videos


లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ని చిరంజీవి గురించి యాంకర్ అడిగారు. టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏమిటంటే.. చిరంజీవి ఎవరు? నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాతయ్య మాత్రమే అన్నాడు. అది లైవ్ షో కావడంతో నేరుగా ఎన్టీఆర్ కామెంట్స్ ప్రసారం అయ్యాయి. సక్సెస్ కిక్ లో ఉన్న ఎన్టీఆర్ అలా మాట్లాడటం వివాదాస్పదం అయ్యింది. 
 

వెంటనే ఎన్టీఆర్ కి నాగార్జున నుండి కాల్ వచ్చిందట. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? నీ కంటే పెద్దవాళ్ళ గురించి అంతేనా మాట్లాడేది అని నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఆ వయసులో ఎన్టీఆర్ కి తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు. అయితే తర్వాత ఆయన పశ్చాత్తాపానికి గురయ్యాడు. తెలియని ప్రాయంలో చేసిన అనాలోచిత కామెంట్స్ ని ఆయన ఒప్పుకున్నారు. 
 

NTR

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రావాలా డిజాస్టర్ అయ్యింది. సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ... ఒక్క చిత్రం కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. రంగంలోకి దిగిన రాజమౌళి యమదొంగ మూవీతో ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చాడు.

కాలక్రమేణా ఎన్టీఆర్ లో గొప్ప మెచ్యూరిటీ వచ్చింది. ఆయన మాట తీరు మారిపోయింది. ఎన్టీఆర్ మాటలు చాలా పరిపక్వతతో కూడి ఉంటాయి. ఎలాంటి కాంట్రవర్సీకి తావు లేకుండా అర్ధవంతంగా మాట్లాడతారు. సినిమా వేదికల్లో కూడా ఎన్టీఆర్ స్పీచ్ లు అద్భుతంగా ఉంటాయి. తడబడకుండా అనర్గళంగా మాట్లాడతాడు. అనుభవాల నుండి ఎన్టీఆర్ అలా పాఠాలు నేర్చుకున్నాడు... 

click me!