“కల్కి” 11 రోజుల కలెక్షన్స్ (ఏరియా వైజ్)

First Published Jul 8, 2024, 5:12 PM IST

   తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.  ఆంధ్ర, సీడెడ్ లలో డ్రాప్ కనిపిస్తోంది. 

kALKI


ఆకాశాన్ని అంటే అంచనాలతో  పది రోజుల క్రితం రిలీజ్ అయిన “కల్కి 2898 ఎడి” వరల్డ్ వైడ్ గా దుమ్ము దులుపుతోంది.ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు సరైన కథ పడితే చాలు...భాక్సాఫీస్ బ్రద్దలైపోతుందనే మాట నిజమైంది.  ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898ఏడీ  10 రోజులు దాటినా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకులు  బ్రహ్మరథం పడుతున్నారు.  

భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. ఫస్ట్ వీకెండ్ అయ్యాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే స్లో అయ్యింది. మిగతా చోట్ల స్ట్రాంగ్  గానే ఉంది.   తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.  ఆంధ్ర, సీడెడ్ లలో డ్రాప్ కనిపిస్తోంది.    ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తోంటే... మిగిలిన చోట్ల కొంచం డ్రాప్ కనపడుతోంది. టోటల్ గా చూస్తే  11 వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.   
 

Latest Videos



 11 రోజులు (  GST తో కలిపి)

తెలంగాణా  - 80.67cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 65.00cr )

రాయల సీమ - 18.63cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 27.00cr )

నెల్లూరు - 05.27cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 07.00cr )

గుంటూరు - 09.92cr
(బ్రేక్ ఈవెన్ షేర్ - 12.00cr )

కృష్ణా - 10.04cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 12.00cr )

వెస్ట్ గోదావరి  - 08.16cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 11.00cr )


ఈస్ట్ గోదావరి  - 10.99cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 14.00cr )

ఉత్తరాంధ్ర - 18.89cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 21.00cr )

ఫిక్సెడ్ హైర్స్  - 01.70cr

తెలుగు రాష్ట్రాలు  11 రోజులు 
టోటల్ థియేటర్ గ్రాస్  - 251.70cr

తెలుగు రాష్ట్రాలు  11 రోజులు 
టోటల్ థియేటర్ షేర్  - 162.58cr

Kalki 2898 AD


కర్ణాటక - 29.20cr
( బ్రేక్ ఈవెన్ షేర్- 25.00cr ) 

కేరళ  - 09.80cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 06.00cr )

తమిళనాడు  - 18.05cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 16.00cr )

హిందీ  +  భారత్ లో మిగతా భాగాలు  - 109.90cr
( బ్రేక్ ఈవెన్ షేర్ - 85.00cr )

ఓవర్ సీస్  - 106.10cr
(అన్ని భాషలు కలిపి )
( బ్రేక్ ఈవెన్ షేర్ - 70.00cr )

వరల్డ్ వైడ్  11 రోజులు 
టోటల్ థియేటర్ గ్రాస్   - 839.05cr

వరల్డ్ వైడ్  11 రోజులు 
టోటల్ థియేటర్ షేర్   - 435.63cr

వరల్డ్ వైడ్  థియేటర్ బ్రేక్ ఈవెన్  షేర్ - 375.00cr

జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. థియేటర్‌లో మరో వారం పాటు ‘కల్కి’ హవా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బుక్‌ మై షోలో 10మిలియన్‌ టికెట్లకు పైగా విక్రయమైన చిత్రంగా నిలిచింది. అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ 10 మిలియన్‌ టికెట్లు విక్రయమైన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది.

‘కల్కి’ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడారు. ‘‘నాగ్‌అశ్విన్‌ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఏ పాత్ర నుంచి ఏం కోరుకుంటున్నారు? అది ఎలా ప్రవర్తిస్తుంది? చాలా వివరణాత్మకంగా చెప్పారు. అమితాబ్‌గారికి సంభాషణలు రాసే అవకాశం నాకు లభించింది. ఆయన నోటి వెంట నేను రాసిన మాటలు వస్తుంటే, నా ఒళ్లు గగుర్పొడిచింది. ప్రభాస్‌, కమల్‌హాసన్‌లకు తొలిసారి మాటలు రాశా.

prabhas movie Kalki 2898 AD

‘జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి’ అని కమల్‌ ఎందుకు అన్నారంటూ చాలా మంది ప్రశ్నించారు. భగవంతుడు వస్తున్నాడని దానర్థం. సుమతి పాత్ర ఆ భగవంతుడిని మోసుకొస్తున్న రథం. ‘నేను వెళ్లి ఆ రథ చక్రాన్ని ఆపేస్తా. భూకంపం పుట్టిస్తా.. భూ మార్గం పట్టిస్తా’ అర్థంలో యాస్కిన్‌ పాత్ర చెబుతుంది. కలియుగంలో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికైనా మార్పు వస్తుంది. ఎవరివల్ల అయితే కాలం మారిందో అతడే భగవత్‌ స్వరూపుడు’’ అని సాయిమాధవ్‌ చెప్పుకొచ్చారు.

click me!