ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024: ఉత్తమ నటుడు నాని, ఉత్తమ చిత్రం బలగం.. మిగతా లిస్ట్

Published : Aug 04, 2024, 06:35 AM IST

దక్షిణాది చిత్రాలకు సంబంధించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ఈవెంట్  ఘనంగా జరిగింది.

PREV
17
  ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024: ఉత్తమ నటుడు నాని, ఉత్తమ చిత్రం బలగం.. మిగతా లిస్ట్
Filmfare Awards South

తెలుగు సినీపరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ 2024(Filmfare Awards 2024) పురస్కారాల వేడక ఘనంగా జరిగింది.   2023కు గాను తెలుగులో బ‌లగం సినిమాతో పాటు నాని న‌టించిన ద‌స‌రా, హాయ్ నాన్న సినిమాలు అత్యధికంగా 8 విభాగాల్లో నామినేట్ అయ్యాయి.  ఉత్తమ చిత్రం కేట‌గిరీలో బ‌ల‌గంతో పాటు బేబీ, దసరా, హాయ్ నాన్నా, మిస్ శెట్టి, MR. పోలిశెట్టి, సమజవరగమన, సలార్: పార్ట్ 1 చిత్రాలు నామినేట్ అయ్యాయి. నామినేట్ అయ్యిన చిత్రాల్లో ఏవి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు గెలుగుచుకున్నాయో చూద్దాం.

27
Filmfare Awards South (Kannada) 2023

 69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్ -2024  వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో  గ్రాండ్ గా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన హీరో, హీరోయిన్స్ చాలా మంది ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. పలువురు సినీ ఆర్టిస్ట్ లు  తమ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. 

37

సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ హోస్ట్ లుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో రాశీఖన్నా, అపర్ణ బాలకమురళీ, సానియా ఇయాపాన్‌, గాయత్రీ భరద్వాజ్‌ తదితరుల ప్రదర్శనలు ఇచ్చారు. నామినేషన్స్‌ జాబితాలో ఉన్న వారిలో విజేతలను  ప్రకటిస్తున్న సమయంలో వేడుక మొత్తం విజిల్స్‌ చప్పట్లతో మార్మోగిపోయింది.
 

47

అవార్డ్ ల వివరాల్లోకి వస్తే.. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ (Balagam) ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా వేణు (Venu Yeldandi) అవార్డు అందుకున్నారు. 

57
filmfare awards south

‘దసరా’లో (Dasaara) నటనకు గానూ నాని (Nani), కీర్తి సురేష్‌(Keerthy suresh)లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును ఇద్దరు అందుకున్నారు. శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న) ఇద్దరి సినిమాల్లోనూ నాని హీరోగా నటించడం మరో విశేషం. ‘బేబీ’ చిత్రానికి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.

67
Filmfare Awards South-

  69 శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 తెలుగు విజేతలు వీళ్లే..
    ఉత్తమ చిత్రం: బలగం
    ఉత్తమ నటుడు: నాని (దసరా)
    ఉత్తమ నటి: కీర్తి సురేష్‌ (దసరా)
    ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
    ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌నాన్న)
    ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): సాయి రాజేష్‌ (బేబీ)
    ఉత్తమ నటి (క్రిటిక్స్‌): వైష్ణవి చైతన్య (బేబీ)
    ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)
    ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)

77

 ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
    ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
    ఉత్తమ గాయని: శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌)
    ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
    ఉత్తమ సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ (బేబీ)
    ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూరన్‌ (దసరా)
    ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కొల్లా అవినాష్‌ (దసరా)
    ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా)

Read more Photos on
click me!

Recommended Stories