Keerthy Suresh : నిర్మాత కూతురు, నేషనల్ అవార్డు గ్రహీత.. కీర్తి సురేష్ గురించి ఈ విషయాలు తెలుసా?

First Published | Nov 27, 2023, 11:53 AM IST

మహానటి కీర్తి సురేష్ మళ్లీ కెరీర్ లో జోష్ మీద ఉంది. ఈ సందర్భంగా  కీర్తికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఆమె సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఆ విషయాలేంటో తెలుసుకుందాం. 

తమిళ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy  Suresh)  ప్రస్తుతం కెరీర్ లో జోష్ కనబరుస్తోంది. చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా కనిపిస్తోంది. మరోవైపు ఇతర అంశంలోనూ వార్తలుగా నిలుస్తోంది. ఈ క్రమంలో కీర్తి సురేష్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను తెలుసుకుందాం.

కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 10న చెన్నైలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ నిర్మాత కూతురు కావడం విశేషం. మలయాళ చిత్రాల ఫిల్మ్ మేకర్ జీ సురేష్ కుమార్ కుతూరే ఈమె. ఆమె తల్లి మేనక తమిళ ఇండస్ట్రీలో నటిగా అలరించింది. దీంతో కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.


బాలనటిగానే కీర్తి సురేష్ తన కెరీర్ ను ప్రారంభించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాల్లో నటించింది. మలయాళంలో వచ్చిన ‘పైలట్స్’, ‘అచనేయనేనికిష్టం’, ‘కుబేరన్’ వంటి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. మలయాళంలోనే హీరోయిన్ గా లాంచ్ అయ్యింది. ‘గీతాంజలి’, ‘రింగ్ మాస్టర్’ అనే చిత్రాలతో మాలీవుడ్ లో సందడి చేసింది. 

కేవలం మలయాళంలోనే ఆగిపోలేదు కీర్తి. తమిళం, తెలుగులోనూ సినిమాలు చేస్తూ వచ్చింది. మల్టీటాలెంట్ అని కూడా ప్రూవ్ చేసుకుంది. తెలుగులో నటించిన ‘మహానటి’ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కడం గొప్ప విషయం. ప్రస్తుతం బాలీవుడ్ లోకి కూడా దూసుకుపోతోంది. రీసెంట్ గానే ఇండస్ట్రీలో 10 ఏళ్ల  కెరీర్ ను కూడా పూర్తి చేసుకుంది. 

కీర్తి సురేష్ కు ఓ చెల్లి ఉంది. పేరు రేవతీ సురేష్. వృత్తిరీత్యా  వీఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ అని సమాచారం. ఆమె సారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్’ లో వర్క్ చేసింది. అప్పడప్పుడు ఆమె సోషల్ మీడియాలోనూ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. 

ఇక కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో సరిగ్గా తెలుగు రాదు. ఆమె సినిమాలకు అక్షయ అనే ఫీమేల్ వాయిస్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పేవారు. ‘మహానటి’కి తొలిసారిగా కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పుకుంది. ఆ తర్వాత నుంచి మోస్టీ తన గొంతునే వినిపిస్తోంది. 
 

చిన్నప్పటి నుంచే కీర్తి సురేష్ స్విమింగ్ లో మంచి నైపుణ్యం కలిగి ఉంది. అప్పట్లో ఓ స్థాయి వరకు శిక్షణ పొందింది. స్కూల్ డేస్ లోనే అద్భుతమైన ప్రతిభ కనబర్చింది. ఇక ఫ్యాషన్ లోనూ తన మార్క్ చూపిస్తుంటుంది. బ్యాండ్ వేగన్ లో కొన్ని కోర్సులు కూడా పూర్తి చేసుకుంది. 

ఎంతో అందంగా వెండితెరపై మెరిసే కీర్తి సురేష్ తన గ్లామర్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమె పూర్తిగా వెజిటేరియన్. ఇంటి భోజనం తినేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటుంది. ప్రతిరోజూ వర్కౌట్, యోగా చేస్తుంది. ఇలా అందాన్ని కూడా కాపాడుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కీర్తి ‘రివాల్వర్ రీటా’, ‘సైరెన్’ వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల కేరళ క్రికెట్ అసోసియేషన్ కు గుడ్ విల్ అంబాసిడర్ గానూ ఎంపికైంది. 

Latest Videos

click me!