Bigg Boss Telugu 7: మైండ్ బ్లాక్ చేస్తున్న రతిక రెమ్యూనరేషన్... 9 వారాలకు అన్ని లక్షలా!

Published : Nov 27, 2023, 10:16 AM IST

బిగ్ బాస్ సీజన్ 7లో రతిక రోజ్ ప్రయాణం ముగిసింది. ఆదివారం ఆమె ఎలిమినేట్ అయ్యింది. రీ ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉండగా... ఆమె రెమ్యూనరేషన్ ఎంతో చూద్దాం...   

PREV
16
Bigg Boss Telugu 7: మైండ్ బ్లాక్ చేస్తున్న రతిక రెమ్యూనరేషన్... 9 వారాలకు అన్ని లక్షలా!

రతిక రోజ్ 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ తెలుగు 7లో అడుగు పెట్టింది. మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. బయట ఆమె కోసం పని చేసే పీఆర్ టీమ్స్ ఉన్నాయి. పక్కా ప్లానింగ్ తో వెళ్ళింది. పల్లవి ప్రశాంత్ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది. 
 

26

అలాగే రతిక రోజ్ గేమ్ లో నిజాయితీ లేదని తెలిసిపోయింది. సింపతీ కోసం రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమ వ్యవహారం తెరపైకి తెచ్చింది. రతిక తీరుపై రాహుల్ మండిపడ్డాడు. పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు సెటైర్స్ వేశాడు. విమర్శలు చేశాడు. 

 

36

దీంతో రతిక రోజ్ 4వ వారం ఎలిమినేట్ అయ్యింది. వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడంతో ఆమెకు సెకండ్ ఛాన్స్ దక్కింది. నిజానికి శుభశ్రీ లేదా దామిని రీ ఎంట్రీ ఇవ్వాల్సింది. బిగ్ బాస్ ఉల్టా ఫుల్టా నిర్ణయం కారణంగా రతిక రోజ్ కి ఛాన్స్ దక్కింది. 

46

బయట పరిస్థితులు, హౌస్లో ఎవరు టాప్ లో ఉన్నారో తెలుసుకున్న రతిక గేమ్ మార్చింది. అదే సమయంలో కన్ఫ్యూషన్ లో పడింది. అగ్రెసివ్ గా ఆడితే ప్రమాదం అనుకుని తగ్గింది. ఏది ఏమైనా రీఎంట్రీ తర్వాత అం గేమ్ మరింత చప్పగా సాగింది. మరో ఐదు వారాలు ఎలాగొలా లాగించింది. 

56

12వ వారం తప్పలేదు. డబుల్ ఎలిమినేషన్ లో రతిక ఇంటి బాట పట్టింది. అశ్విని శనివారం ఎలిమినేట్ కాగా... ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యింది. అర్జున్-రతిక డేంజర్ జోన్లోకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఈ ఇద్దరిలో ఎవరికీ పాస్ వాడేందుకు ఆసక్తి చూపలేదు. 

 

66
Bigg Boss Telugu 7

నాగార్జున రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మొత్తంగా రతిక రోజ్ 9 వరాలు హౌస్లో ఉంది. రతిక వారానికి రూ. 2 లక్షల ఒప్పందం మీద హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన రూ. 18 లక్షలు రెమ్యూనరేషన్ రూపంలో అందుకుంది. బిగ్ బాస్ షో వలన ఆమెకు ఫేమ్ తో పాటు నెగిటివిటీ కూడా వచ్చింది. 

Read more Photos on
click me!

Recommended Stories