తండ్రి పవన్‌ కళ్యాణ్ ని అకీరా ఏ విషయంలో ఫాలో అవుతున్నాడో తెలుసా? నిజంగా గ్రేట్‌ క్వాలిటీ

First Published | Sep 23, 2024, 7:32 PM IST

తండ్రి పోలికలు, తండ్రి లక్షణాలు పిల్లల్లో కనిపించడం కామన్‌. మరి పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అకీరాలో ఆయన తండ్రి క్వాలిటీస్‌ ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఓపెన్‌గా చెప్పేసింది. 
 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఓ వైపు డిప్యూటీ సీఎం(ఏపీ)గా బిజీగా ఉన్నారు. మరోవైపు నేటి నుంచి తిరిగి ఆయన షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తాడా? లేదా అనేది చూడాలి. మళ్లీ ఆయన వెండితెరపై రచ్చ చేసేందుకు వస్తుండటం విశేషం. ఇది ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. చేయాల్సిన సినిమాలు కంప్లీట్‌ చేస్తే వచ్చే ఏడాది ఆల్మోస్ట్ ఆయన్నుంచి మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ప్రస్తుతం వారసుల ఎంట్రీ ఊపందుకుంటుంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి పెద్ద కొడుకు రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఎంట్రీని ప్రకటించారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమా ఉండబోతుంది. ఇంకోవైపు హరికృష్ణ మనవడు, జానకీరామ్‌ కొడుకు ఎన్టీఆర్‌ కూడా హీరోా ఎంట్రీ ఇవ్వనున్నారు. వైవీఎస్‌ చౌదరీ దీనికి దర్శకుడు కావడం విశేషం. 
 


Pawan Kalyan and Akira Nandan

ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్‌ బాబు కొడుకు, పవన్‌ కళ్యాణ్‌ కొడుకులకు సంబంధించిన టాపిక్‌ కూడా వస్తుంది. ఇటీవల అకీరా నందన్‌ బాగా కనిపించారు. ఏపీలో ఎమ్మెల్యేగా పవన్‌ కళ్యాణ్‌ గెలిచిన సమయంలో తండ్రి వెంటే తిరిగాడు అకీరా. చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు, అలాగే ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసినప్పుడు కూడా అకీరా ఉన్నాడు.

జనసేన పార్టీ వందశాతం గెలుపు సాధించడంతో ఆ సెలబ్రేషన్‌ని తండ్రితోపాటు ఎంజాయ్‌చేశారు అకీరా నందన్‌. దీంతో సినిమాల్లోకి రాబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. పవన్‌ కావాలనే కొడుకుని పరిచయం చేస్తున్నారనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. 
 

అకీరా సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనేది సినీ వర్గాల్లో క్యూరియాసిటీని కలగజేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య మదర్‌ రేణు దేశాయ్‌ స్పందిస్తూ ఇప్పట్లో సినిమాల్లోకి రావడం లేదని తెలిపింది. ప్రస్తుతం అకీరా ఫోకస్‌ స్టడీస్‌, మ్యూజిక్‌ పై ఉందని, ఎక్కువగా మ్యూజిక్‌ తను ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిపింది.

భవిష్యత్‌లో హీరో అవుతాడేమో ఇప్పుడే చెప్పలేనని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అకీరాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ విషయాలను బయటపెట్టింది రేణు దేశాయ్‌. పవన్‌ నుంచి అకీరాలో వచ్చిన క్వాలిటీస్‌ ఏంటనే ప్రశ్న ఎదురు కాగా, అసలు విషయం చెప్పింది.
 

Renu Desai

అకీరాకి ప్రకృతి అంటే ఇష్టమట. పవన్‌ లాగానే ప్రకృతిని ఇష్టపడతాడని, నేచురల్‌ గా వచ్చే ఫుడ్‌నే తీసుకుంటాడని, తను వెజిటేరియన్‌ అని తెలిపింది రేణు దేశాయ్‌. మధ్య మధ్యలో పన్నీరు తీసుకుంటాడట. హెల్త్ పై దృష్టి ఎక్కువగా ఉంటుందని, ఫిట్‌గా ఉండాలని తపిస్తుంటాడని, అందుకు యోగా, ప్రాణాయామం, మార్షల్‌ ఆర్ట్స్ చేస్తాడట.

పవన్‌ కూడా మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకున్న విషయం తెలిసిందే. దాన్ని అకీరా నందన్‌ కూడా ఫాలో అవుతాడట. తనలో చాలా వరకు పవన్‌ లక్షణాలు ఉంటాయని తెలిపింది రేణు దేశాయ్‌. ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పిందామే. 
 

 `బద్రి` సినిమాతో పవన్‌, రేణు దేశాయ్‌ ప్రేమించుకున్నారు. కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. పెళ్లికి ముందే అకీరాకి జన్మనిచ్చారు. అనంతరం 2009లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కూతురు ఆద్యకి జన్మనిచ్చారు. 2012లో ఈ ఇద్దరు విడిపోయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత పవన్‌ రష్యా నటి లెజినోవాని మ్యారేజ్‌ చేసుకోగా, రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉంటుంది. పిల్లలు అకీరా, ఆధ్యాల బాగోగులు చూసుకుంటున్నారు. వాళ్లు ఇంకాస్త పెద్దగయ్యాక తాను రెండోపెళ్లి చేసుకుంటానని వెల్లడించిన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!