Prathinidhi 2 Review
ఎలక్షన్ ను టార్గెట్ చేస్తూ మే నెలలో నారా రోహిత్ హీరోగా రూపొంది విడుదలైన చిత్రం ‘ప్రతినిధి 2’ . జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ ‘ప్రతినిధి’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. రాజకీయాలను ప్రశ్నించే జర్నలిస్టుగా రోహిత్ ఇందులో నటించారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. తాజాగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
Prathinidhi 2 Review
‘ప్రతినిధి’సినిమా ఇప్పటికి చాలా మందికి గుర్తు ఉంది. ఈ సినిమా కు సీక్వెల్ గా రెండో పార్ట్ వస్తోందంటే ఆసక్తి కలిగింది. అందుకు తగ్గట్లు మూర్తి దర్శకుడు కావటం కూడా ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చింది. నారా రోహిత్ కు రీఎంట్రీ లాంటి సినిమా. ఇన్ని ప్లస్ లు ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజువారి రాజకీయంలో జరుగుతున్న సంఘటనలు చుట్టూ ఈ సినిమా రాసుకున్నారు. అయితే సీన్స్, డైలాగులు వెళ్లిపోతూంటాయి కానీ కథలో సరైన కాంప్లిక్ట్ పడక పరుగు అందుకోదు. ఫస్టాఫ్ అలా డైలాగులు, లైవ్ లో జరుగుతున్న సీన్స్ తో నడిచిపోతుంది. సెకండాఫ్ కు వచ్చేసరికి క్రైమ్ ఇన్విస్టిగేషన్ మోడ్ లోకి సినిమా వెళ్లిపోయింది.
Prathinidhi 2 Review
మేలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 (Prathinidhi 2 OTT Release) నుంచి ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ కానుంది. ‘ప్రశ్నించేందుకు ప్రతినిధి వస్తున్నాడు’ అంటూ సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించింది.
Prathinidhi 2
కథేమిటంటే...
ఈ కాలంలో మనకు అరుదుగా కనపడే నిఖార్సయిన నిక్కచ్చైన జర్నలిస్ట్ చేతన్ (నారా రోహిత్) అలియాస్ 'చే' . దేనికి, ఎవరికి భయపడడు. జర్నలిజంలో సాహసాలు చే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా చేస్తూంటాడు. ఇక మరో జర్నలిస్ట్ ఉదయభాను (ఉదయభాను) ప్రతిఫలం ఆశించకుండా.. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో NNC ఛానల్‌ని ప్రారంభిస్తుంది. ఆ ఛానల్‌కి చేని సీఈవో గా చే ని చేస్తుంది. అక్కడ నుంచి తన సెన్సేషనల్ స్టోరీలతో రాజకీయ నాయకులకు కునుకు లేకుండా చేస్తుంటాడు చే. శంకర్ ఒక్కడు సీన్ గుర్తు చేసేలా ..ఫైనాన్సి మినిస్టర్ గజేంద్ర(అజయ్ ఘోష్ )ని ఓ ఇంటర్వూలో ప్రశ్నలతో ఇరుకున పెడతాడు.
Prathinidhi 2
సరిగ్గా అదే సమయంలో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పేదల పెన్నిదిగా చెప్పబడే ప్రజాపతి (సచిన్ ఖేడేకర్). ఆయన ఓ రాత్రి క్యాంప్ ఆఫీస్ లో పని చేస్తుండగా ఎవరో దుండగులు చేసిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోతాడు . తండ్రి మరణంతో కొడుకు విశ్వ ('ప్లే బ్యాక్' ఫేమ్ దినేష్ తేజ్) ముఖ్యమంత్రిగా సీన్ లోకి వస్తాడు. విశ్వం (దినేష్ తేజ్) తదుపరి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సభ్యులు కోరుకుంటారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతాడు.
ఆ సమయంలో ముఖ్యమంత్రి బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని,కుట్రను బయటపెడతాడు చే. అయితే అనుకోని విధంగా అసలు నేరస్తుడు చే అనే ఆరోపణపై అరెస్ట్ అవుతాడు. అప్పుడు సీబీఐ స్పెషల్ ఆఫీసర్ (జిషు సేన్ గుప్తా) ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఈ క్రమంలో అనేక షాకింగ్ నిజాలు బయిటకు వస్తాయి. అసలు ఇంతకీ ముఖ్యమంత్రిని చంపాలనుకున్నదెవరు? చేకి ఆ బాంబ్ బ్లాస్ట్‌కి సంబంధం ఏంటి?మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? చివరగా ఆ కేసును ఎలా ఛేదించారు అనేదే ‘ప్రతినిధి 2’ మిగిలిన కథ.
డైలాగులు విషయానికి వస్తే.. పొలిటికల్ సెటైర్లు ఉన్నా ఎక్కువ శాతం .. సెన్సార్ బీప్‌ల్లో కలిసిపోయాయి. ఇక ‘పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్.. మనల్ని ఎవడేం చేస్తాడు’, ఇక ‘నాన్నగారు చనిపోయి రోజులు కూడా కాలేదు.. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేశారా?’, ‘సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్‌లు వేసేశాం.. ఇంకా చెప్పడానికి వాళ్లు వినడానికి మిగిలిందేం లేదు’, ‘దేశాన్ని కాపాడటానికి సైనికుడు, కడుపు నింపడానికి రైతు ఎంత ముఖ్యమో, సమాజానికి జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం’వంటి డైలాగులకు జనం బాగానే రెస్పాండ్ అయ్యారు.