`యానిమల్‌`లో తృప్తి పాత్రని మిస్ చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?.. నిజంగా బ్యాడ్ లక్కే

Published : Dec 08, 2023, 02:55 PM ISTUpdated : Dec 08, 2023, 02:56 PM IST

`యానిమల్‌` మూవీ బోల్డ్ కంటెంట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇండియాని ఊపేస్తుంది. ఇందులో బెడ్‌ సీన్లు చేసిన తృప్తి డిమ్రి సైతం ఇండియాని షేక్‌ చేస్తుంది. మరి ఆ అవకాశం మొదట ఎవరికి వచ్చిందో తెలుసా.. 

PREV
17
`యానిమల్‌`లో తృప్తి పాత్రని మిస్ చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?.. నిజంగా బ్యాడ్ లక్కే

`యానిమల్‌` మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇందులో ఉన్న ప్రధాన పాత్రలు నేషనల్‌ వైడ్‌గా సెన్సేషనల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా, తృప్తి ఇండియా దాటి క్రేజ్‌ని తెచ్చుకున్నారు. అయితే ఇందులో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. హాట్‌ సెన్సేషన్‌గా మారిన తృప్తి పాత్రకి సంబంధించిన ఓ సీక్రెట్ బయటకు వచ్చింది. తృప్తి పాత్రని మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలిసింది.  
 

27

`యానిమల్‌` మూవీలో రష్మిక మందన్నా కంటే తృప్తి డిమ్రి పాపులర్‌ అయ్యింది. ఒక్కసారిగా ఆమె హాట్‌ సెన్సేషన్‌ అయ్యింది. నేషనల్‌ క్రష్‌గా మారింది. ఆమె గురించే గూగుల్స్ సెర్చింగ్‌ చేస్తున్నారు. ఆమె కోసం ఫోటోలు, ఆమె బయోగ్రఫీ, ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా అకౌంట్లని సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఆమె ఎవరు అనేది హాట్‌ టాపిక్అయ్యిందని చెప్పొచ్చు. అంతేకాదు ఒక్కసారిగా ఆమె స్టార్‌ అయిపోయింది. 

37

మరి అంతటి క్రేజ్‌ని మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌. సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు. మొదట `యానిమల్‌`లో నటించే ఆఫర్‌ని దక్కించుకుంది. అంతేకాదు ఆడిషన్‌ కి కూడా వెళ్లిందట. ఇందులో పార్ట్ కావాలని చాలా ఉత్సాహాన్ని చూపించిందట. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. 
 

47

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. సారా అలీ ఖాన్‌ని ఆడిషన్‌ చేసిన తర్వాత బోల్డ్ సీన్లలో, న్యూడ్‌గా ఆమె అయితే సెట్‌ కాదని భావించాడు. దీంతో అతనే సారాని రిజెక్ట్ చేశారట. అలా సారా అలీ ఖాన్‌ `యానిమల్‌`లో నటించే ఆఫర్ ని మిస్‌ చేసుకుంది. నిజంగా ఆమెకి బ్యాడ్‌ లక్కే. ఒకవేళ ఆమె ఎంపిక అయి ఉంటే నేషనల్ క్రష్‌ అయ్యేది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యేది. సారా కెరీరే మారిపోయేది. కానీ ఆ ఛాన్స్ తృప్తి కొట్టింది.ఇప్పుడు నేషనల్‌ వైడ్‌గా సెన్సేషనల్‌గా మారింది. 
 

57

సారా అలీ ఖాన్‌.. `కేదార్నాథ్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `సింబా` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. `లవ్‌ ఆజ్‌ కల్‌`, `కూలీ నెం 1`, `అట్రాంగి రే` చిత్రాలతో ఆకట్టుకుంది. కానీ సక్సెస్‌లు పడలేదు. `గ్యాస్‌ లైట్‌`, `జార హట్కే జరా బచ్కే`, `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్రాల్లో చేసింది. ఇప్పుడు ఆమె చేతిలో నాలుగైదు బాలీవుడ్‌ ప్రాజెక్ట్ లున్నాయి. నటిగా బిజీగా ఉంది. 

67
Tripti Dimri

`యానిమల్‌` చిత్రంలో  తృప్తి డిమ్రి  రణబీర్ కపూర్ తో కలసి ఆమె న్యూడ్ సన్నివేశంలో రెచ్చిపోయింది.  29 ఏళ్ల వయసున్న ఈ యంగ్ బ్యూటీ ఒక్క న్యూడ్ సీన్ తో కుర్రాళ్ళ హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. త్రిప్తి దిమ్రి 2017లో శ్రీదేవి నటించిన `మామ్` చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలతో దుమారం రేపుతుంది. `యానిమల్‌` తర్వాత ఆమె ఫాలోయింగ్‌ దూసుకుపోతుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ కేక్‌లా మారింది. 
 

77

ఇక రణ్‌బీర్ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `యానిమల్‌` చిత్రంలో త్రిప్తి డిమ్రి మరో హీరోయిన్‌గా బోల్డ్ సీన్లలో మెరవగా, బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై సంచలనం క్రియేట్‌ చేస్తుంది. ఇప్పటికే ఇది ఐదు వందల కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద మరింత దూకుడు చూపిస్తుంది. వారం రోజుల్లో ఈ మూవీ 563 కోట్ల కలెక్షన్లు సాధించిందని టీమ్‌ ప్రకటించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories