నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' రివ్యూ

First Published | Dec 8, 2023, 2:00 PM IST

నితిన్‌ హీరోగా నటించిన `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌` మూవీ  తాజాగా శుక్రవారం విడుదలైంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Extra Ordinary Man

నితిన్ కెరీర్ గత కొంతకాలంగా చాలా ఆర్డనరీగా నడుస్తోంది.   'భీష్మ' తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడటంలేదు. 'చెక్'  అన్నా  రంగ్ దే ఫలితం లేకుండా పోయింది. ఇక  'అంధాధూన్' రీమేక్‌గా తెరకెక్కిన 'మేస్ట్రో' ఓటీటీలో విడుదల అయ్యి ఓకే అనిపించుకుంది. 'మాచర్ల నియోజకవర్గం' లోనూ గెలవలేదు. హిట్ కోసం డెస్పరేట్ గా  ఎదురుచూస్తూ ఈ సినిమాతో  తనకు 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ  మలుపు తిప్పుతుందని ఆశిస్తూ చేసాడు. మరి ఈ  'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనుకున్న స్దాయిలో వర్కవుట్ అయ్యాడా,నితిన్ ని ఫ్లాఫ్ ల బారి నుంచి ఒడ్డున పడేసాడా చూద్దాం. 


స్టోరీ లైన్

జూనియర్ ఆర్టిస్ట్ అభి(నితిన్) కు పెద్ద స్టార్ అవ్వాలని కోరిక. సినిమాల్లో ట్రై చేయటం ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. తన ప్రయత్నాలు తాను చేస్తున్న టైమ్ లో తన తండ్రి  సోమశేఖర్ (రావు రమేష్)కి కాలు విరగడంతో తన లక్ష్యాన్ని ప్రక్కన పెట్టి ఉద్యోగంలో చేరతాడు. అయితే ఓ రోజు తనకు పరచయం ఉన్న ఓ అసెస్టెంట్ డైరక్టర్ వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తాను అని కథ చెప్తాడు. ఒరిస్సా సరిహద్దుల్లో జరిగే కథ అది అని, అందులో ఎస్సై పాత్ర అని ,విలన్స్ కు బుద్ది చెప్పటం కథ అని.  దాంతో పోయిన  ఉత్సాహం మొత్తం వెనక్కి తెచ్చుకున్న అభి  ఉద్యోగం, లవర్, ఫ్యామిలీ అన్నీ వదిలేసి తన లక్ష్యం అయిన నటుడుగా అవ్వాలని ఆ పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుంటాడు.  అయితే ఇక్కడే ట్విస్ట్ పడుతుంది.


అనుకోని విధంగా అభిని ప్రక్కన పెట్టి వేరే హీరోతో ఆ  సినిమా చెయ్యాలనుకుంటాడు ఆ డైరక్టర్. దాంతో తను మోసపోయిన ఫీలింగ్... ఏ చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో మందు కొట్టి బాధపడుతున్న టైమ్ లో విలన్  నీరో (సుదేవ్ నాయర్) తమ్ముడితో గొడవ అవుతుంది. అక్కడ నుంచి  కథ మరో మలుపు తిరిగుతుంది. అభి ఓ డెసిషన్ తీసుకుంటాడు.   తెరపై తనని వదిలేసిన ఆ పాత్రని నిజ జీవితంలో చేయాలనుకుంటాడు.  దాంతో విలన్  ఊరికి  ఎస్సై సాయినాథ్ (నితిన్)గా వెళ్తాడు. అక్కడికి వెళ్లి వేలకోట్ల వ్యాపారాలను డీల్ చేసే విలన్ని అక్కడున్న పెద్దపెద్ద రాజకీయ నాయకులను,  ఎదుర్కొని బుద్ది చెప్తాడు. ఈ క్రమంలో ఏమైంది...ఆ విషయం విలన్స్ కు ఎప్పుడు తెలిసింది..మరో ప్రక్క ఆ ఏరియా ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్)  ఏం చేశారు? ఇందులో లిఖిత (శ్రీ లీల) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

ఎనాలసిస్ ...

స్క్రిప్టులో రాసినివి నిజ జీవితంలో జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్టు వినటానికి ఆసక్తికరమే. అయితే దానంతట అది జరిగితే అది సస్పెన్స్..థ్రిల్లర్. తాను జరిపించింతే అది రేసుగుర్రం లో హీరో లాగ ఉంటుంది. ఉండాలి. అయితే రేసుగుర్రం ఆల్రెడీ చూసేసారు. ఇదే రైటర్ రాసిన కథే ఇది. అయితే అక్కడ విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాంతో కాంప్లిక్ట్స్ చాలా బలంగా ఉంటుంది. ఈ సినిమాకు వచ్చేసరికి కేవలం విలన్ ఇంట్రడక్షన్ మాత్రమే పవర్ ఫుల్ గా రాసుకున్నారు,మిగతాదంతా తేల్చేసారు. దాంతో హీరో పాత్ర చాలా ప్యాసివ్ గా మారింది.  


రచయితగా వక్కంతం వంశీ మంచి సక్సెస్ . 'ఊసరవెల్లి', 'ఎవడు', 'రేసు గుర్రం', 'టెంపర్' వంటి హిట్ సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించారు. అలాంటి తను డైరక్ట్ చేయటం కోసం రాసుకున్న కథ అంటే ఎలా ఉంటుంది..ఉండాలి. అయితే ఈ సినిమా అయితే ఆ స్దాయిలో ఉండదు. తన దగ్గర ఉన్న మంచి కథలు అన్నీ అమ్మేసి, మిగిలిన కథలను వదలటం ఎందుకు అని డైరక్షన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.  లేకపోతే ఈ సినిమా చూస్తూంటే అల్లరి నరేష్ అప్పట్లో చేసిన వరస కామెడీ సినిమాల స్దాయిలో ఉండటం ఏమిటి..అవి తక్కువ అని కాదు.. నితిన్ కు ఆ స్దాయి కథలు సరిపోవు. అలాగే ప్రేక్షకులు కూడా మారారు.  అఫ్ కోర్స్ స్పూఫ్ లు కూడా ఉంటాయి. నితిన్ కు  'భీష్మ' లాంటి హిట్ కోసం ఎదురుచూస్తూ ఇందులో కామెడీ ఉందని చేసినట్లున్నాడు. అంతేకానీ మరీ ఆ కామెడీ ఎటునుంచి ఎటు వెళ్తుందో చూసుకున్నట్లు లేరు. అలాగే రవితేజ కిక్ మాదిరిగా హీరోకు ఓ క్యారక్టరైజేషన్ ఇస్తే సరిపోతుందని అనుకున్నారు దర్శక,రచయిత వక్కంతం.  కథలో అల్లుకున్న కొన్ని  సీన్లు చూస్తే ద‌ర్శ‌కుడు బాగా రాసుకొన్నాడే అనిపిస్తుంది. కానీ కామెడీ ఏమిటంటే ఆ సీన్ల‌కూ… ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌లో ఉన్న ఎమోష‌న్‌కీ సంబంధం ఉండ‌దు. ఏ సీన్ కా సీన్ కామెడీ పండుతోందా, జోక్ లు, డైలాగులు పేలుతాయా లేవా చూసుకున్నారు కానీ ఓవరాల్ గా కంటెంట్ ఎలా ఉంటుదనే అంచనా కనపడదు. 

Extra Ordinary Man


ఎందుకంటే అప్పటికప్పుడు కొన్ని సీన్లకు నవ్వేసికున్నంత  మాత్రాన స‌రిపోదు. అస‌లు క‌థ‌తో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ ఉండాలి. అది లేక‌పోతే  సీన్స్ వరసపెట్టి వెళ్తూంటాయి. కానీ మనకేమీ అనిపించదు. అదే సెకండాఫ్ లో జరిగింది. అలాగే విలన్ ఉన్నాడంటే ఉన్నాడు. కానీ ఆ కాంప్లిక్ట్స్ బలంగా లేదు. ఓ బ‌ల‌మైన విల‌న్‌ని హీరో ఢీ కొన‌బోతున్నాడ‌న్న  భ‌యం మనలో క‌ల‌గ‌దు. కామెడీ కదా ఇంతకు మించి ఎందుకలే అనుకున్నారేమో.  ఇక ఇందులో ఓ చోట హీరో నితిన్.. తన తండ్రి చెప్పేది ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలాగా ఉంటుందని, ఏమీ అర్థం కాదని అంటాడు. నిజానికి ఈ దర్శకుడు సరదాకో, సీరియస్ గానో  ‘పొన్నియిన్ సెల్వన్’పై సెటైర్ వేసారనుకున్నారు కానీ ...ఈ సినిమా సెకండాఫ్ గురించే ఆ డైలాగు అనిపిస్తుంది. గందరగోళంగా ఉంటుంది. హీరో తెలివితేటలు మైండ్ గేమ్ అనుకున్నవి మనకు రొటీన్ ఫీలింగ్ తెస్తాయి.  ఏదైమైనా ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొద్దిపాటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా సెకండ్ హాఫ్ లో మిస్ అవ్వటం, క్లైమాక్స్ మరీ నీరసంగా ఉండటం చూసేవాళ్లకు ఇబ్బందిగా మారింది. పాయింట్ ఎంత లైటర్ వీన్ గా ఉంటే అంత స్ట్రాంగ్ ట్రీట్మెంట్ లేకపోతే ఇదే సమస్య.


టెక్నికల్ గా చూస్తే...

ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి. ఒకప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన హేరిష్ జైరాజ్ మ్యూజిక్ ఏమీ కలిసి రాలేదు. నేపధ్య సంగీతం కూడా  యావరేజ్. మాటలు కొన్ని బాగా పండాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.  డైరక్టర్ ఫన్ , ఎమోషన్ ని మిక్స్ చేసి తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఆ ఆలోచనని అంతే ఆసక్తికరంగా, ఉత్కంఠ రేకెత్తించేలా మాత్రం మలచలేకపోయారు. కెమెరా వర్క్ చాలా మంది చేసారు ఆర్డర్ సి విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్ ..ఇంతమంది కలిసినా విజువల్స్ గొప్పగా లేవు. చాలా రెగ్యులర్ లైటింగ్  సీన్స్ ని లాగించేశారు. ఎడిటర్ వీళ్లంతా ఇలా ఉన్నప్పుడు నేను చేసేదేముంది అనుకున్నారేమో..ఆయనా చాలా చోట్ల  పట్టు వదిలేసారు.  

Extra Ordinary Man


నటీనటుల్లో ...

అభి పాత్రలో నితిన్ ఎంత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నా అది కృతకంగానే అనిపిస్తుంటుంది. కొన్ని చోట్ల ఆ పాత్రని సీన్స్ లోకి అవసరం లేకపోయినా లాక్కొచ్చారే అనిపిస్తుంది.  అయితే అతని స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథలని ఎంచుకోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నితిన్ ...ఫస్టాఫ్ లో చేసినంత ఎనర్జీగా సెకండాఫ్ లో కనపడలేదు. చిత్రంగా ఆ వేరియేషన్ స్పష్టంగా కనపడింది. శ్రీలీలకు మాట్లాడుకునేటంత సీన్స్,సీన్ ఈ సినిమాలో ఇవ్వలేదు.  రావు రమేష్ కాస్త లౌడ్ అనిపించినా ఆ క్యారక్టరే బాగుంది. రోహిణి ఎప్పటిలాగే సినిమా తల్లిలా చేసుకుంటూ వెళ్లిపోయింది. డా. రాజశేఖర్ బాగా చేసారు,ఆయన వచ్చినప్పుడల్లా ఫన్ వర్కవుట్ అయ్యింది.  కానీ కథలో ఆయన ప్రత్యేకమైన ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. అయితే ఆయన ఉండబట్టే సెకండాఫ్ ఆ మాత్రం అయినా నడించింది అనిపించింది.  మిగతా పాత్రలన్నీ పరిదిమేర వున్నాయి.

Extra Ordinary Man


 బాగున్నవి

దిల్ రాజు తమిళ వాయిస్ డీజే
రాజశేఖర్ సీన్స్
ఫస్టాఫ్ లో కామెడీ 
నితిన్ కొత్తగా కనిపించటం


బాగోలేనివి

ఇంటర్వెల్ దాకా కథలోకి రాకపోవటం
సెకండాఫ్ కథ దారితప్పటం
మ్యూజిక్
ఫోర్స్ గా వచ్చే కామెడీ 

Extra Ordinary Man

ఫైనల్ థాట్

 రైటర్ గా సక్సెస్ అయ్యిన వక్కంతం మరో తడబాటు ఇది.ఆయన రాసే కమర్షియల్ కథలను వేరే డైరక్టర్ అయితేనే ఫెరఫెక్ట్ గా  పండించగలుగుతున్నట్లున్నారు.  అయితే కామెడీ సీన్స్ కోసం ఓ లుక్కేయవచ్చు.

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2.5  

Extra Ordinary Man

నటీనటులు: నితిన్, శ్రీ లీల, రాజశేఖర్, రావు రమేష్, రోహిణి, సుదేవ్ నాయర్, బ్రహ్మజీ, 'హైపర్' ఆది, సోనియా సింగ్, రవి వర్మ తదితరులు
ఛాయాగ్రహణం: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్
సంగీతం: హ్యారీస్ జయరాజ్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ
విడుదల తేదీ: డిసెంబర్ 8, 2023  

Latest Videos

click me!