Priyanka chopra
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ఉంది. ఈమె జీవితంలో అనేక వివాదాలు, సంచలనాలు ఉన్నాయి. ఇంతకీ ఆ పాప ఎవరంటే ప్రియాంక చోప్రా.
బీహార్ లో పుట్టిన ప్రియాంక చోప్రా మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి. 2002లో విడుదలైన తమిళ చిత్రం తమిజన్ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ చిత్ర హీరో విజయ్ కావడం విశేషం. ఆ వెంటనే ఆమె బాలీవుడ్ కి తరలిపోయింది. మరలా సౌత్ లో చిత్రం చేయలేదు.
హిందీలో ప్రియాంక చోప్రాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. టాప్ స్టార్స్ సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించింది. ఒక దశలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఆమె పరిశ్రమను ఏలింది. ప్రియాంక చోప్రా నటించిన ఒకే ఒక తెలుగు హీరో రామ్ చరణ్. జంజీర్ లో వీరు జతకట్టారు.
కెరీర్ పీక్స్ లో ఉండగా ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని వీడారు. ఆమె హాలీవుడ్ కి వెళ్లారు. అక్కడ ఒక కొత్త నటిగా ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రియాంక చోప్రా ఒక సందర్భంలో చెప్పారు. హాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రియాంక చోప్రా ఒక ప్రాజెక్ట్ కి రూ. 14 నుండి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
ఫోర్బ్స్, DNA వంటి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్స్ ఈ విషయాన్ని ధృవీకరించాయి. ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్ లో నటించినందుకు గానూ రూ. 40 కోట్లు తీసుకుందట. మొదటిసారి హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం ఆనందంగా ఉందని ఆమె ఓ సందర్భంలో అన్నారు.
ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో లెక్కకు మించిన ఎఫైర్స్ నడిపారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కపూర్, షాహిద్ కపూర్ వంటి స్టార్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. నేను ఎప్పుడూ ఒంటరిగా లేను. ఒక రిలేషన్ ఎండ్ అయితే వెంటనే మరొక రిలేషన్ పెట్టుకునేదాన్ని , అని ప్రియాంక చోప్రా గతంలో చెప్పారు.
ఇక బాలీవుడ్ తనను వెలివేసిందని పరోక్షంగా చెప్పింది ప్రియాంక చోప్రా. ఇక్కడ రాజకీయాలు ఎక్కువయ్యాయి. కొందరు నాకు ఆఫర్స్ రాకుండా చేశారు. వాళ్లతో నాకు గొడవలు అయ్యాయి. అందుకే బాలీవుడ్ లో ఉండలేకపోయానని... ప్రియాంక చోప్రా వెల్లడించారు. తన అసహనం వెళ్లగక్కింది.
హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప. ప్రియాంక చోప్రా సరోగసి పద్దతిలో కూతురిని కన్నది. నిక్ జోనాస్ వయసులో ప్రియాంక చోప్రా కంటే పదేళ్లు చిన్నవాడు కావడం విశేషం. అందుకు కూడా ప్రియాంక చోప్రా విమర్శలు ఎదుర్కొంది.