‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్ మెంట్ కోసం దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే మూవీ గురించి గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ అందుతున్నాయి. అందులో ముఖ్యంగా ఇండియోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్ లో ఎంపికైనట్టు తెలుస్తోంది.
కొద్దిరోజలుగా ఈమె ఎంపికైనట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె ఎవరు? ఎలాంటి సినిమాలు చేశారు? ఎక్కడ పుట్టారు? ఆమె వయస్సు ఎంతనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అమెరికన్ - ఇండోనేషియా నటిగా ఈబ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్ 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్ ను అందుకుంది.
ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏజ్ విషయానికొస్తే... జూన్ 15, 1995లో న్యూయార్క్ లో పుట్టింది. ఇప్పటికీ ఇంకా ఈమెకు 28 ఏళ్లు మాత్రమే. మహేశ్ బాబుతో పోల్చితే 21 ఏళ్లు చిన్నదీ నటి. ఇంత చిన్న నటితో ఇంటర్నేషనల్ స్థాయిలో బాబు సినిమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ఇక మహేశ్ బాబు రీసెంట్ గా ‘గుంటూరుకారం’లో యంగ్ హీరోయిన్ శ్రీలీలతో నటించారు. ఈ ముద్దుగుమ్మకు 22 ఏళ్లే కావడం విశేషం. ఇప్పుడు ఇండోనేషియా నటి.. ఇలా మహేశ్ బాబు యంగ్ హీరోయిన్లతో కలిసి నటిస్తుండటం బిగ్ స్క్రీన్ పై ఫ్యాన్స్ కు ఫీస్ట్ గా మారుతోంది. ఇక SSMB29కు టాప్ టెక్నీషియన్లు ఫైనల్ అయ్యారని తెలుస్తోంది.