Brahmamudi
BrahmaMudi 15th February Episode:రాజ్ కి దూరం కావాలని కావ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పుడే ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తుంది. భర్త ఆదరణ దొరకలేదని దూరం అవ్వాలని అనుకుంటున్నావా అని అంటుంది. అమ్మమ్మగారు అని కావ్య అంటే... ఆ రోజు నువ్వు నీ స్నేహితురాలి కథ అని చెప్పి..నీ కథ చెప్పావని ఆరోజే అర్థమైందని ఇందిరాదేవి అంటుంది. ప్రతి విషయంలోనూ అలాంటి నిర్ణయం తీసుకోకూడదని, చాలా మంది సర్దుకుపోతూ ఉంటారు అని ఇందిరాదేవి నచ్చచెప్పబోతోంది.
Brahmamudi
అయితే.. ఆయనకు నేనంటే ఇష్టం లేదని, అసలు తాను అక్కర లేదని కావ్య అంటుంది. అక్కరలేకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాడు అని ఇందిరాదేవి అంటే.. ఇంట్లో పరిస్థితులు ఆయనను ఆపుతున్నాయి కానీ.. నాతో కలిసి ఉండాలని ఏరోజూ అనుకోలేదని కావ్య ఏడుస్తూ చెబుతుంది. అయితే.. ఇలా కూడా కలిసి ఉండే దంపతులు చాలా మంది ఉన్నారని ఆమె చెబుతుంది. అలా అని నీ వ్యక్తిత్వాన్ని చంపుకోమని తాను చెప్పడం లేదని అంటుంది. దాని అర్థం అదే కదా అని కావ్య అంటుంది.
Brahmamudi
అప్పుడు ఇందిరాదేవి.. నిన్ను కొట్టాడా? ఇంట్లో వాళ్లు నిన్ను మాటలు అంటుంటే ఊరుకున్నాడా? నీ పుట్టింటికి కష్టం వస్తే ఆదుకోలేదా? అని అడుగుతుంది. వీటికీ, మనసులో ప్రేమకు తేడా ఉంది కదా అని అంటుంది. ప్రేమ లేకుండానే ఇవన్నీ చేస్తున్నాడా..? నిన్ను ఇంటి దగ్గర తానే దింపాడు కదా.. నీ మానానా నిన్ను వదిలేశాడా లేదు కదా అని అడుగుతుంది. వాడు నీకోసం భోజనం కలిపి తీసుకురావడం నేను చూశాను. అదే రోజు నీకు ఒంట్లో బాలేదు అని తెలిసే సరికి.. తినే భోజనం మానేసి నీ దగ్గరకు వచ్చాడు అని చెబుతుంది. తన భర్త దేవుడు అనే అని కాకపోతే రాయిలా ఎందుకు ఉండాలి? నేనేం వరాలు కోరలేదని.. తనకు మాత్రం శాపాలు ఎందుకు అని అంటుంది. అయితే.. దేవుడి ని నమ్ముకున్నవారికి ఎలాంటి అన్యాయం జరగదు అని ఇందిరాదేవి అంటుంది.
Brahmamudi
అసలు.. వాడికి నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు అనుకుంటున్నావ్ అని అడుగుతంది. ఉందని ఎలా అనుకోవాలి అమ్మమ్మ.. నన్ను వదిలించుకోవడానికి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్లు నటిస్తున్నారు అని అంటుంది. నటిస్తున్నాడు కానీ నిజంగా సంబంధం పెట్టుకోలేదు కదా అని ఇందిరాదేవి అంటుంది. కానీ.. నేను ఎందుకు వద్దు అమ్మమ్మ, నాకేం తక్కువ..? దుగ్గిరాల ఇంట్లో కోడలిని అయ్యే అర్హత నాకు లేదా అని అంటుంది. నీ తప్పేమీ లేదని ఆమె అంటే.. అందుకే తాను తప్పుకుందాం అనుకుంటున్నానని.. ఆయన ప్రశాంతంగా ఉంటారు అని అంటుంది.
అయితే... నువ్వు లేకుండా రాజ్ సంతోషంగా ఉండలేని.. నువ్వు బాధపడితేనే చూడలేడని.. నువ్వు లేకపోతే పిచ్చివాడు అయిపోతాడు అని చెబుతుంది. అయితే.. రాజ్ కి తనలో నీ పై ప్రేమ ఉంది అనే విషయం గుర్తించడం లేదని చెబుతుంది. ఆ ప్రేమను బయటకు తీసుకురావాలని చెబుతుంది.
Brahmamudi
అయితే.. ఏం చేయమంటారు అని మూర్తి అడుగుతాడు. అయితే సహనంగా ఉండాలని.. రాజ్ పై ప్రేమను బయటకు వచ్చే వరకు ఎదురుచూడాలి అని చెబుతుంది. అప్పుడే.. ఓ మాస్టర్ ప్లాన్ చెబుతుంది. కావ్య.. రాజ్ కి దూరమైపోతుందని భయం కలిగిస్తే.. అప్పుడే ప్రేమ బయటపడుతుందని ఇందిరాదేవి అంటుంది. అంటే.. నీ జీవితంలో కూడా మరో అబ్బాయి ఉన్నాడని రాజ్ కి అనుమానం కలిగిస్తే.. అప్పుడు వాడిలో ప్రేమ బయటపడుతుందని చెబుతుంది.
అయితే.. వేరే వ్యక్తి అయితే.. కావ్య జీవితం నాశనం చేసే అవకాశం ఉందేమో అని కనకం భయపడితే.. తన మేనల్లుడు ఉన్నాడని.. వాడు అయితే ప్రమాదం ఉండదని.. ఈరోజే ఊరి నుంచి వస్తున్నాడు అని చెబుతాడు. ఒక తండ్రిగా అలా చెప్పకూడదు కానీ.. ఈ ఒక్కసారికి కావ్య దూరమైపోతుందనే భయం అల్లుడుగారిలో కలిగిస్తే చాలు అని అంటుంది. బావ అవుతాడు కాబట్టి భయం లేదని ఇందిరాదేవి కూడా ప్లాన్ ఒకే చేద్దాం అని అనుకుంటుంది,
Brahmamudi
కావ్య ఏదైనా జరిగిపోతుందేమో, అనుమానాలు వస్తాయేమో అని భయపడుతుంది. అయితే.. ఏదైనా ప్రాబ్లం వస్తే..నేను చూసుకుంటాను అని చెబుతుంది. చాలా విషయాలు, కథలు చెప్పి... కావ్య మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇక.. అవన్నీ విన్న తర్వాత కావ్య కూడా అంగీకరిస్తుంది.
Brahmamudi
ఇక.. సీన్ కట్ చేస్తే కావ్య ఎప్పుడు ఇంటికి వస్తుందా అని ధాన్యలక్ష్మి, అనామిక, రుద్రాణి ఎదురుచూస్తూ ఉంటారు. కావ్య , ఇందిరాదేవి ఇంటికి వస్తారు. రావడం రావడమే..కావ్య పై కౌంటర్లు వేయడం మొదలుపెడతారు. అసలు విషయం ఏంటి అని ఇందిరాదేవి అడిగితే.. ఇంట్లో రెండు లక్షలు పోయిన విషయం బయటపెడతారు. కావ్య ఆ డబ్బు తీసిందని అంటారు. ఆ విషయం తెలియని కావ్య షాకై నిలపడుతుంది.
Brahmamudi
అపర్ణ కూడా కావ్యదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతుంది. వీళ్లందరికీ మాట అనే ఛాన్స్ ఎందుకు ఇచ్చావ్ అని, డబ్బు తీసుకున్నందుకు కాదు.. చెప్పి తీసుకోవచ్చు కదా అని మాట్లాడుతుంది. అందరూ తలా ఒక మాట అంటూనే ఉంటారు. వెంటనే స్వప్న ఎంట్రీ ఇస్తుంది. అందరి నోళ్లు మూయిస్తుంది.
Brahmamudi
తన చెల్లి కావ్యకు తాళాలు ఇచ్చింది అపర్ణ అత్తయ్య కాబట్టి.. ఆమెకు మాత్రమే తాను సమాధానం చెబుతాను అంటుంది. ఆ తర్వాత.. కావ్య డబ్బులు తనకు ఇచ్చిందని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి.. కావ్యను స్వప్న ఎలా కాపాడుతుందో చూడాలి.