Mahesh Babu
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. నటుడిగా చాలా ప్రొఫేషనల్. దేని లెక్క దానిదే అనేలా ఉంటారు. అయితే టాలీవుడ్‌లో యాడ్స్ పరంగా అత్యధిక కమర్షియల్స్ చేసే హీరోగా మహేష్ నిలుస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన చేతిలో పదికిపైగా యాడ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, సోప్స్, రియల్ ఎస్టేట్, యాప్స్, కిచెన్ ప్రొడక్షన్స్ ఇలా అన్నిరకాల యాడ్స్ చేస్తుంటారు మహేష్.
mahesh babu
మరి మహేష్ బాబు ఒక్కో యాడ్‌కి ఎంత తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయనకు ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కి సంబంధించిన కేసులో మహేష్ బాబుకి కూడా సమన్లు జారీ చేసింది ఈడీ. ఎందుకంటే ఈ కంపెనీలను మహేష్ ప్రమోట్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో మహేష్‌కి పారితోషికం ఎలా ముట్టిందనేది ఆసక్తికరంగా మారింది.
Mahesh Babu
ఈ కంపెనీల యాడ్స్ చేసినందుకు మహేష్‌కి సుమారు ఆరు కోట్లు(5.9 కోట్లు) పారితోషికం తీసుకున్నారట. ఇందులో 3.5కోట్ల నగదు రూపంలో మిగిలిన అమౌంట్ చెక్ రూపంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో హవాలా రూపంలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపై ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీనిపై ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని మహేష్‌కి ఈడీ వెల్లడించింది.
mahesh babu
ఈ క్రమంలో మహేష్ ఒక యాడ్‌కి ఎంత పారితోషికం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కమర్షియల్ రేంజ్ బట్టి తీసుకుంటాడట. యాడ్ వ్యాల్యూ ఎక్కువ అయితే సెకన్‌కి కోటీ రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ఆ మధ్య ఫోన్ పే యాడ్ చేస్తే ఐదు సెకన్ల యాడ్‌కి ఐదు కోట్లు తీసుకున్నారట.
ఈ లెక్కన అది సెకన్‌కి కోటీలాగా తీసుకున్నారట. అంతకు ముందు మౌటేన్ డ్యూ యాడ్‌కి ఏకంగా రూ.12కోట్లు తీసుకున్నారట. ఇలా దాని రేంజ్ ని బట్టి, కమర్షియల్ వ్యాల్యూని బట్టి మహేష్ పారితోషికం ఉంటుందని, అదే సమయంలో యాడ్ డ్యూరేషన్ బట్టి ఉంటుందని తెలుస్తుంది. మెయిన్‌గా రూ.5కోట్ల నుంచి పది కోట్ల వరకు ఒక్కో యాడ్‌కి తీసుకుంటాడని తెలుస్తుంది.