అభిమాన తారలు ఏంచేస్తున్నారా అని ఎప్పుడు సోషల్ మీడియా నుంచి తొంగి చూడడమే కొంత మంది ప్యాన్స్ పనిగా పెట్టుకుంటారు. స్టార్స్ ఏదైనా స్పెషల్ గా చేస్తే.. దాన్ని నెట్టింట వైరల్ చేయడమే వారి పని. స్టార్స్ ఏదైనా కాస్ట్లీ వస్తువు కొన్నా, విచిత్రంగా ఏదైనా తిన్నా.. సెలబ్రిటీలకు చెందిన ఏదైనా వైరల్ అవ్వాల్సిందే. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఈ పద్దతి విపరీతంగా పెరిగిపోయింది. అయితే తాజాగా బాలయ్య బాబు కొత్త కారు కొన్నాడు.. అదెలాగో ఫ్యాన్స్ ఇప్పటికే వైరల్ చేసేశారు. కాని అందులో మరో విశేషం ఉంది. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. బాలయ్య బాబు కారు నెంబర్ ప్లేట్. అందులో ఏముంది విచిత్రం అనుకోకండి... ఆ నెంబర్ ప్లేట్ కోసం లక్షలు ఖర్చు పెట్టాడు బాలకృష్ణ. ఇంతకీ ఆ కారు నెంబర్ ప్లేట్ కోసం బాలకృష్ణ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
Also Read: 14 ఏళ్లకే హీరోయిన్, 36 ఏళ్ళకు మరణం, భర్త స్టార్ సింగర్, 70 సినిమాలు చేసిన స్టార్ నటి ఎవరో తెలుసా?
బాలయ్య బాబు లేటెస్ట్ గానే ఒక BMW కారుని కొన్నారు. ఈ కారు నెంబర్ కోసం ఆయన వేలంపాటలో పాల్గొన్నాడు. ఆయనకు TG 09 0001 అనే ఫ్యాన్సీ నెంబర్ బాగా నచ్చింది. బాలయ్యతో పాటు మరికొంత మందికి కూడా ఈనెంబర్ నచ్చడంతో వేలం పాట నిర్వహించారు. అందులో లో పాల్గొన్న బాలయ్య బాబు 7 లక్షల 70 వేల రూపాయలకు ఆ నెంబర్ ప్లేట్ ని దక్కించుకున్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: 400 మిలియన్ రికార్డ్ సాధించిన రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ, అక్కడ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా?
Balayya
ఖైతారాబాద్ పరిధి లో ఉన్న ఈ RTO ఆఫీస్ లో ఈ వేలం జరిగింది. సినీ సెలబ్రిటీలతో కేవలం బాలకృష్ణ మాత్రమే కాదు, ప్రతీ హీరో కూడా తమ కార్ నెంబర్స్ ఫ్యాన్సీ గా ఉండేలా చూసుకుంటారు. ఎన్టీఆర్ కి 9999 నెంబర్ చాలా ఇష్టం, అలాగే చాలామంది స్టార్స్ తమ కార్ రిజిస్టేషన్ కోసంగతంలో ఖైరతాబాద్ ఆఫీస్ కు రావడం అందరికి తెలిసిందే.
Balayyas Daaku Maharaaj monday collection report out
ఇక ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ 2 తరువాత కూడా మరికొన్ని సినిమాలు లైన్ అప్ చేసుకున్నాడు బాలయ్య. అంతే కాదు అటు ఎమ్మెల్యేగా.. ఇటు హీరోగా రెండు వైపులా బ్యాలన్స్ చేస్తూ.. దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ.