అవును మధుబాల బాలీవుడ్ కు ఒక ఐకాన్. తరాలు మారినా గుర్తు పెట్టుకోగలిగే పేరు మధుబాల. ఆమె జీవితం తలుచుకుని, ఇప్పటికీ చెమగిళ్లే అభిమానులు కళ్ళు చాలా ఉన్నాయి. ఆమెను తలుచుకుని మనసు బరువెక్కే హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఆమె జీవితం ఒడిదుడుకులకు, ఎత్తు పల్లాలకు, చేదుతీపికి ఉదాహరణ. మధుబాల 1950ల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. దాదాపు 20 ఏళ్ల పాటు బాలీవుడ్‌ను ఏలింది. 70 సినిమాల్లో నటించి మెప్పించింది.