Indraja
ఇంద్రజ అందమైన నటి మాత్రమే కాదు, అద్భుతమైన నటనతోనూ మెప్పించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్. `యమలీల` మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆమెని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా తన హవా చూపించింది. అయితే ప్రారంభంలో కాస్త గ్లామర్ రోల్స్ చేసింది. ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. `హలో బ్రదర్`లో నటించి మెప్పించింది.
నాగార్జున, సోనియా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్? బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్
Indraja
మ్యారేజ్, పిల్లల కారణంగా కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంది ఇంద్రజ. ఇటీవల ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఫుల్ బిజీగా ఉంది ఇంద్రజ. మొన్నటి వరకు `జబర్దస్త్` షోకి జడ్జ్ గా వ్యవహరించింది. ఇప్పుడు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి జడ్జ్ గా ఉంది. సినిమాల్లో కంటే టీవీ ద్వారానే మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది ఇంద్రజ.
Indraja
ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె అసలు పేరు ప్రస్తావన వచ్చింది. ఇంద్రజగానే సౌత్ ఇండియన్ ఆడియెన్స్ ని మెప్పించింది. అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఆమె అసలు పేరు ఇంద్రజ కాదు. స్క్రీన్ నేమ్‌నే అసలు పేరుగా మార్చుకుంది. చాలా మంది ఆర్టిస్ట్ ల విషయంలో ఇదే జరుగుతుంటుంది. అసలు పేరుకి, స్క్రీన్ నేమ్‌కి సంబంధం ఉండదు. అలాంటి వారిలో ఇంద్రజ ఒకరు.
ఆమె అసలు పేరేంటో చెప్పింది ఇంద్రజ. మల్లెమాల చిట్ చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన అసలు పేరు రాజాతి అని వెల్లడించింది. మరి రాజాతి ఇంద్రజగా ఎలా మారడానికి కారణమేంటనేదానికి స్టోరీ చెప్పింది ఇంద్రజ. తాను బాలనటిగానే సినిమాల్లోకి వచ్చింది. `ఉజైప్పలి` అనే తమిళ చిత్రంలో హీరోయిన్ రోజాకి యంగర్ వెర్షన్‌లో నటించింది. దీంతోపాటు `పురుషా లక్షణం` అనే మరో సినిమా చేసింది. ఇందులో ఆమె సినిమా హీరోయిన్‌గా మెరవడం విశేషం.
ఈ క్రమంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. తొలుత ఇంద్రజ నాగార్జున `హలో బ్రదర్`లో స్పెషల్ సాంగ్ చేసింది. రచ్చ చేసింది. దీనికంటే ముందే ఆమె `జంతర్ మంతర్` అనే సినిమా చేసింది. తెలుగులో చేసిన మొదటి సినిమా ఇదే. ఇందులో బాబూమోహన్ హీరో. శ్రీకాంత్ ఓ పాటలో మెరిశారు.
ఇందులో ఇంద్రజ దేవకన్య పాత్రని పోషించింది. రాజాతి అంటే అందరికి అర్థమయ్యేలా లేదు. పలకడానికి కాస్త ఇబ్బందిగానే అనిపించింది. దీంతో తన పాత్ర పేరునే రియల్ నేమ్‌గా మార్చుకుంది ఇంద్రజ.
అయితే ఈ పేరుకి అప్పట్లో స్టార్ డైరెక్టర్‌గా రాణించిన ఎస్వీకృష్ణారెడ్డికి సంబంధం ఉంది. తెలుగులో ఇంద్రజ రెండో మూవీగా `యమలీల` చేసింది. దీనికి ఎస్వీకృష్ణారెడ్డి దర్శకుడు. హీరోయిన్‌గా ఇంద్రజని తీసుకున్నారు. రాజాతి అని చెబితే వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు.
పేరు అంత ఎఫెక్టీవ్‌గా లేదని భావించారు. ముందు చేసిన `జంతర్ మంతర్`లో ఇంద్రజ క్యారెక్టర్ నేమ్‌ని స్క్రీన్ నేమ్‌గా మార్చుకోవాలని సలహా ఇచ్చారట. ఇంద్రజ కూడా మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పారు. అలా ఎస్వీకృష్ణారెడ్డి కారణంగా రాజాతి కాస్త ఇంద్రజ గా మారిపోయింది.
అప్పటి నుంచి అదే తన అసలు పేరుగా ఫీలవుతుందట ఇంద్రజ. ఈ సందర్భంగా ఎస్వీకృష్ణారెడ్డి తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయన ఎప్పుడూ తనకు ప్రత్యేకమే అని తెలిపింది ఇంద్రజ.