‘ముంజ్యా’ OTT మూవీ రివ్యూ

First Published | Sep 25, 2024, 10:46 AM IST

30 కోట్లతో తెరకెక్కిన ముంజ్య సినిమా  బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. 

Horror Comedy , Munjya, Abhay Verma, Review

 హారర్ సినిమాలకు ఉండే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.    ఈ హారర్ సినిమాలకు కామెడీని సరైన పాళ్లలో  కలిపి కరెక్ట్ థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రన్ చేయగలిగితే ఆ కిక్కే వారు.  ఆ మూవీ సూపర్ హిట్టు.  ఇప్పుడు బాలీవుడ్ లో హారర్ కామెడీల టైమ్ నడుస్తోంది.

ఆ క్రమంలో రీసెంట్‌గా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ కామెడీ మూవీనే ముంజ్య.రూ. 30 కోట్లతో తెరకెక్కిన ముంజ్య సినిమా జూన్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ తో ఓటిటిలోకి వచ్చింది. సినిమా కాన్సెప్టు ఏమిటి, చూడదగ్గ సినిమాయేనా చూద్దాం. 
 

స్టోరీ లైన్

తల్లి పమ్మీ (మోనా సింగ్)తో కలిసి పార్లర్ రన్ చేస్తూంటాడు బిట్టు (అభయ్ వర్మ).  అయితే బిట్టు (అభయ్ వర్మ) కొద్దిగా భయస్దుడు.  కానీ  తల్లి పమ్మి (మోనా సింగ్)  అతిజాగ్రత్త తో అతన్ని ముందుకు వెళ్లనివ్వదు.  నచ్చినట్టుగా బ్రతకనివ్వదు.  తన తల్లి .. బామ్మ గీత (సుహాస్ జోషి)తో కలిసి ఉండే అతనికి  తన తండ్రి గురించి పెద్దగా ఏమీ తెలియదు.

ఆ  టాపిక్ వచ్చినప్పుడల్లా తన తల్లి .. బామ్మా దాటేస్తూంటారు. అలా ఎందుకు దాటవేస్తున్నారనే విషయం అతనికి అర్థం కాదు. ఇదిలా ఉంటే అతనికి అప్పుడప్పుడూ ఓ అడవిలో .. ఒక చెట్టుపై భయంకరమైన ఆకారం తనని పిలుస్తున్నట్టుగా అనిపిస్తూంటుంది. 


అలాగే తనతోపాటే పెరిగినా బేలా (శార్వరి వాఘ్)‌ను బిట్టు ప్రేమిస్తాడు. కానీ, తను మాత్రం ఇంకొకరిని లవ్ చేస్తుంది.  ఇక  ఓ రోజున అతను తన బాబాయ్ కూతురు రుక్కు (భాగ్యశ్రీ లిమాయే) ఎంగేజ్మెంట్  తన కుటుంబంతో కలిసి  కొంక‌ణ్ ప్రాంతంలోని సొంతఊరు వెళతాడు.

అక్కడ తనకి తరచు కళ్లలో కనపడే ప్రదేశాన్నీ .. పెద్ద మర్రిచెట్టును చూసి ఆశ్చర్యపోతారు. అలాగే  ఆ చెట్టు దగ్గరికి వెళ్లినప్పుడే తన తండ్రి చనిపోయాడని తెలిసి బాధపడతాడు. ఆ బాధలోనే అతను ఆ చెట్టు దగ్గరికి పరిగెడతాడు. అతని వెనకే బామ్మ కూడా  వెళ్తుంది. ఆ చెట్టుపై  ముంజ్య అనే ఒక పిల్ల ద‌య్యం (మంజ్యా) ఎంతోకాలంగా తన కోరికను తీర్చుకోవడానికి ఎదురుచూస్తుంటుంది. 

Munjya

  బిట్టు అనుకోకుండా ఆ పిల్ల ద‌య్యం ద‌గ్గ‌రికి వెళ్ల‌టంతో  అతడిని వ‌శ‌ప‌ర‌చుకుంటుంది ముంజ్య.  మంజ్యా బారి నుంచి బిట్టూను కాపాడటానికి వచ్చిన బామ్మను మంజ్యా చంపేస్తుంది. అక్కడ నుంచి మంజ్యా ..బిట్టుతో కలిసి పూనే వచ్చేస్తుంది. అతనికి తనకు మాత్రమే కనిపిస్తూ తనను టార్చర్ చేస్తుంటుంది.

అయితే అసలు ముంజ్య ఎవరు. బిట్టు వెన‌క మాత్రమే ఎందుకు ప‌డుతుంది. దాని కోరిక ఏమిటి, ఆ మంజ్యా బారి నుంచి బిట్టు ఎలా బయిటపడ్డాడు, బేలాతో అతని లవ్ స్టోరీ ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

ఎలా ఉందంటే...

ఇలాంటి కథలు బోలెడు విని ఉంటాం.  అయితే   సీరియస్ తీసుకుని దాన్ని ఏ కథగానో మలచాలి అనుకోము. కానీ ఆదిత్య సర్పోత్థార్‌ ఈ పాయింట్ చుట్టూ కథ అల్లి సినిమా చేయాలనుకున్నాడు. తమ ప్రాంతంలో పాపులరైన ఓ జానపద కథలాంటి ఓ దెయ్యం కథను తీసుకుని ,

దాన్ని ఇప్పుడు కాలమాన పరిస్దితులకు వర్తింప చేస్తూ నవ్విస్తూ, భయపెడుతూ సినిమా చేస్తే అదే 'ముంజ్యా' . కొంకణ్ తీర ప్రాంతంలో చాలా కాలంగా జనం చెప్పుకునే ఓ కాల్పనిక కథను తీసుకుని దాని చుట్టు సిట్యువేషన్స్ అల్లి తెరకెక్కించిన తీరు జనాలకి తెగ నచ్చేసింది.   

ఈ కథని రెగ్యులర్ ప్యాట్రన్ లో నడిపినా మంజ్యా దెయ్యానికు ఉన్న కోరిక దగ్గరే కథను లాక్ చేసాడు డైరక్టర్. చచ్చిపోయి దెయ్యం అయినా అది తను ఎప్పుడో ప్రేమించిన  మున్నీ ని పెళ్లి చేసుకుంటాను. మున్నీతో పెళ్లిచేయమని ఆ దెయ్యం ..హీరో వెనకపడి వేధించటమే కామెడీ.

అలాగే హీరో ప్రెండ్ ని  కూడా ఈ కథలో కి తీసుకొచ్చి నవ్వించారు. దెయ్యం కూడా భయపెట్టడం అనే దాని కన్నా గమ్మత్తుగా ఉండటం కలిసొచ్చింది. మనలో చాలా మంది ముఖ్యంగా విలేజ్ ల నుంచి వచ్చినవాళ్లు తమ ఊళ్లో మర్రి చెట్టు  పైనో మరో చోటే దెయ్యం ఉందని, దానికో కథ ఉందని వినే ఉంటారు. దాంతో ఈజీగా ఈ కథతో కనెక్టు అవుతారు.

 అయితే ఈ మంజ్యా దెయ్యం పెద్దగా భయపెట్టలేకపోయింది. కథ .. స్క్రీన్ ప్లే .. క్యారక్టర్ డిజైన్ ప్లస్ అయ్యింది. కొద్ది పాటి క్యారక్టర్స్ మధ్యే సినిమాని  నడిపారు.   ఈ కథలో మరో కీలకమైన పాత్ర దెయ్యాలు, భూతాలను వదిలించే  పద్రి (సత్యరాజ్)ది. ఆయన ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేసారు. ఇలా ఓ పిల్ల దెయ్యానికి, గమ్మత్తైన మిగతా పాత్రలను ముడిపెట్టి సినిమాని నడిపించటం, పిల్లలకు, పెద్దలకు నచ్చేసింది. బిట్టు...ఆ దెయ్యంతో పడే ఇబ్బందులు భయపెట్టవు సరికదా ఆకట్టుకుంటాయి.
 

ముంజ్య అంటే..


బ్రహ్మణుల్లో కౌమార దశలో ఉన్న అబ్బాయిలకు ఉపనయనం చేస్తారు. కొంకణ్ ప్రాంతంలో మరాఠీలో ఈ కార్యక్రమం జరిగిన పిల్లలను ముంజ్య అని పిలుస్తారు.
 

టెక్నికల్ గా...

 ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. పిల్ల దెయ్యాన్ని చూపించే విధానం, ఆ క్రమంలో వాడిన వీఎఫ్ ఎక్స్ మామూలుగా లేవు. అలాగే బోర్ కొట్టని విధంగా రోలర్ కోస్టర్ లా సినిమాని పరుగెత్తించారు. మొదట పావు గంట స్లో గా అనిపించినా తర్వాత సినిమా చివరి దాకా ఆపకుండా చూసేస్తాం.  '

జస్టిన్ వర్గీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సౌరభ్ గోస్వామి కెమెరా వర్క్  సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపించింది.  నటీనటుల్లో అందరూ బాగా చేసారు. సత్యరాజ్ , బిట్టుగా చేసిన అభయ్ వర్మ, బిట్టు ప్రెండ్ గా జచేసిన తరణ్ జోత్ సింగ్, అదరకొట్టారు. డైరక్టర్ ఆతిత్య సర్పోత్థార్ సినిమాని హారర్ కామెడీ ని కొత్తగా చేయాలనే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. 

చూడచ్చా

ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చూడవచ్చు, ఎక్కడా అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. మితిమీరిన హింస కూడా లేదు. ఒకటి రెండు భయపెట్టే సన్నివేశాలు ఉన్నా అవి పెద్ద పట్టించుకునేవి కాదు. 

నటీనటులు: శార్వరి వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్, సుహాస్ జోషి, మోనా సింగ్, భాగ్యశ్రీ లిమాయే, శృతి మరాఠే, అజయ్ పుర్కర్ తదితరులు

కథ: యోగేష్ చండేకర్, నిరేన్ భట్

దర్శకత్వం: ఆదిత్య సర్పోత్‌దార్

నిర్మాతలు: దినేష్ విజన్, అమర్ కౌశిక్,

సంగీతం: సచిన్ సంఘ్వి, జిగర్ సాయ్య, జస్టిన్ వర్గీస్

నిర్మాణ సంస్థ: నక్షత్ర్ ఫిల్మ్ ల్యాబ్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 

ఓటిటిలో తెలుగులో ఉంది

Latest Videos

click me!