చిరంజీవికి, పవన్ కు ఉన్న అనుబంధం విషయానికి రామ,లక్ష్మణులే గుర్తుకు వస్తారు అందరికీ. చిరంజీవి మీద చిన్న మాట పడనివ్వరు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూంటారు చిరంజీవి. పవన్ గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవి కళ్ళలో ప్రత్యేకమైన ప్రేమ, ఆర్ద్రత కనపడుతూంటాయి.
రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎలాగైతే ఆ కళ్లల్లో మెరుపు కనిపిస్తుందే అదే విధంగా పవన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జరుగుతుందని చూసిన వాళ్లు చెప్తూంటారు. అలాగే నాగబాబు ఉన్నా కూడా పవన్ విషయమే ఎక్కువగా చెప్తూంటారు చిరంజీవి.