Nayanthara: చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించింది నయనతార. ఇందులో చిరంజీవి సరసన శశిరేఖగా నటించిన ఆమె.. ఎప్పటిలానే తన నటనతో మెప్పించింది.
దక్షిణాదిన ఎంతగానో ఫేమస్ అయిన హీరోయిన్ నయనతార.. ఒక్క తమిళ చిత్రాల్లో మాత్రమే కాదు.. తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటోంది. టాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె.. ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకులను పలకరించింది.
25
బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అరంగేట్రం..
కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నయనతార.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' మూవీలో కనిపించింది. ఈ సినిమాకు దర్శకుడు అట్లీ కుమార్. అటు ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
35
టాలీవుడ్ సీనియర్ల సరసన..
ఇక నయనతార టాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే.. ఈమె చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ అగ్ర హీరోలతో అద్భుత విజయాలను కూడా అందుకుంది. కానీ ఈమె ఓ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన సంగతి మీకు తెలుసా.? ఆయన మరెవరో కాదు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ సరసన నయనతార నటించడానికి ఆసక్తి చూపించలేదట. పవన్ కళ్యాణ్ సినిమాకు ఈమెను మేకర్స్ సంప్రదించగా ఈమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్.. వారు చెల్లించలేకపోవడంతో.. ఈ హీరో సినిమాను చేసేందుకు ఆమె ఆసక్తి చూపించట్లేదట. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.? దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
55
వకీల్ సాబ్ మూవీ..
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అంజలి పాత్ర కోసం ముందుగా నయనతారను మేకర్స్ అప్రోచ్ అయ్యారట. కానీ రెమ్యూనరేషన్ విషయంలో కుదరకపోగా.. నయనతార ఈ సినిమా నుంచి తప్పుకుందని టాక్. అలాగే ఆ సమయంలో మరికొన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉండటంతో.. డేట్స్ అడ్జెస్ చేయలేక తప్పుకుందని కూడా ఓ వర్గానికి చెందినవారు చెబుతున్నారు.