ముస్లిం హీరోల ను పెళ్లాడిన హిందూ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

First Published | Jun 25, 2024, 3:50 PM IST

సినిమా తారల్లో ఎక్కువగా మాతాంతర వివాహాలు పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా హిందూ హీరోయిన్లు.. ఎక్కువగా ముస్లీం హీరోల ప్రేమలో పడిపోతున్నారు. ఈ ఆచారం బాలీవుడ్ లో గట్టిగా నడుస్తోంది. రీసెంట్  గా హీరోయిన్ సోనాక్షి ముస్లీం హీరోను పెళ్ళాడింది. ఇక బాలీవుడ్ లో ఇలా మతాంతర వివాహం చేసుకున్నవారెవరో చూద్దాం. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో మతాంతర వివాహాలు మన దేశంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ, ముస్లిం వివాహాలు వార్తల్లో నిలుస్తున్నాయి, అయితే చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఈ మతం గురించి పట్టించుకోకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. మతాంతర వివాహాలు పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం ద్వారా సామరస్యపూర్వకంగా జీవించడానికి నిదర్శనంగా ఈ ప్రేమ వివాహాలు జరుగుతన్నాయి. మరి బాలీవుడ్ లో ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్నవారు ఎవరో తెలుసా..? 

 బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరియు నటుడు జహీర్ ఇక్బాల్ జూన్ 23 న హిందూ లేదా ముస్లిం సంప్రదాయాలు లేకుండా వివాహం చేసుకున్నారు. స్పెషల్ వెడ్డింగ్ ప్లాన్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత తమ సినీ స్నేహితులకు రిసెప్షన్ మరియు పార్టీని ఏర్పాటు చేసింది.
 


బాలీవుడ్ నటి కరీనా కపూర్ 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. కరీనా సైఫ్ రెండో భార్య. సైఫ్ తన కంటే 12 ఏళ్లు పెద్దదైన అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే అంతకు ముందే  సైఫ్ అలీ ఖాన్ ను నటి అమృతా సింగ్ 1991లో వివాహం చేసుకున్నారు. సైఫ్ అలీఖాన్ అమృత కంటే 12 ఏళ్లు చిన్నవాడు. 2004లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆతరువాత కరీనాను సైఫ్ పెళ్ళాడాడు. 
 

బాలీవుడ్ కింగ్ లా వెలుగు వెలుగుతున్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా గా కొనసాగుతున్న హీరో షారుఖ్ ఖాన్ ను ఇండియన్ మోడల్, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన గౌరీ పెళ్ళి చేసుకుని..   గౌరీ ఖాన్ గా మారారు. వీరిద్దరి ప్రేమ  వివాహం 1991 లో జరిగింది. 

బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగిన మరో హీరో ఆమీర్ ఖాన్. ఈ ముస్లీమ్ హీరోను కూడా నటి కిరణ్ రావు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కిరణ్ రావు ప్రముఖ రచయిత, నిర్మాత. ఆమె 2005 లో ఆమీర్ నుపెళ్ళాడారు.. 2021 లో వీరు విడాకుల తీసుకుని వేరు అయ్యారు. 

Swara Bhaskar -Fahad Ahmed after marriage photos

నటి స్వర భాస్కర్ 16 ఫిబ్రవరి 2023న సమాజ్ వాదీ యువజన సభ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు.  మాతాంతర వివాహం చేసుకున్నా.. ఎక్కడా ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. మాజీ మిస్ ఇండియా మరియు నటి సంగీతా బిజలానీ 1996లో క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత వారి వివాహం 2010లో ముగిసింది. అంతకు ముందు సంగీతా సల్మాన్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. పెళ్లి చేసుకుందామనుకుంటున్న తరుణంలో సల్మాన్ మరో అమ్మాయితో పట్టుబడ్డాడు.
 

బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్ 2016లో కాశ్మీరీ వ్యాపారవేత్త మరియు మోడల్ మొహ్సిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకున్నారు. అంతే కాదు ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మరియు నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని 1968లో వివాహం చేసుకున్నారు. షర్మిల కూడా ఇస్లాంలోకి మారారు. మన్సూర్‌ని పెళ్లి చేసుకోవడానికి ఆమె తన పేరును బేగం అయేషా సుల్తానాగా మార్చుకుంది.
 

Ratna Pathak Shah

చలనచిత్రాలు, టెలివిజన్, OTT మరియు థియేటర్లలో తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్న అత్యంత నిష్ణాతులైన నటీమణులలో రత్న పాఠక్ షా కూడా ఒకరు. ఆమె 1982లో నటుడు నసీరుద్దీన్ షాను వివాహం చేసుకుంది. నసీరుద్ధీన్ గురించి అందరికి  తెలిసిందే.. ద దర్టీ పిక్చర్ లో ఆయన నటన అద్భుతమని చెప్పాలి. 

Latest Videos

click me!