30 కోట్ల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ కు పడిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

First Published Jun 25, 2024, 2:50 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో గెటుపోటములు సహజం. కాని ఓటముల కారణంగా ఎంత పెద్ద స్టార్ అయినా.. తమ స్థాయితో పాటు.. రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఈక్రమంలోనే ఓ యంగ్ హీరో.. తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించుకోవల్సి వచ్చిందట. 
 

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. ఒక్కోసారి వరుస విజయాలతో తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతారు... వరుస ఫెయిల్యూర్స్ వస్తేమాత్రం.. గట్టిగా కిందకు తోసేసిట్టు పాతాళానికి పడిపోతుంటారు. వాళ్ల క్రేజ్ తో పాటు.. రెమ్యూనరేషన్ కూడా డౌన్ అవుతుంటుంది. అలాంటి పరిస్థితే వచ్చింది ఓ బాలీవుడ్ యంగ్ హీరోకు. హ్యాండ్సమ్ .. క్రేజీ.. రొమాంటిక్ హీరో భారీగా తన రెమ్యునరేషన్ తగ్గించుకోవలసి వచ్చింది. 

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ యంగ్ స్టార్.. టైగర్ ష్రాఫ్.  జాకీ ష్రాఫ్ వారసత్వంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో.. టోన్డ్ బాడీతో అమ్మాయిల మనసుల్లో.. అలా నాటుకుపోయాడు.. సిక్స్ ప్యాక్ బాడీతో  తిరుగులేని ఇమేజ్ ను సాధించాడు. టైగర్ అంటే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. కాని అతని సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయియాయి. 
 

బాలీవుడ్ లో డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్‌లకు టైగర్ ష్రాఫ్ పెట్టంది పేరు. అదే ఆయన్ను బాలీవుడ్ లో నిలబెట్టింది. మరీ ముఖ్యంగా తెలుగులో ప్రభాస్ చేసిన వర్షం సినిమాను టైగర్ ష్రాఫ్ హీరోగా హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ పాత్రను హిందీతో మన తెలుగు స్టార్ సుధీర్ బాబు చేశారు.  బాఘీ టైటిల్ తో రిలీజ్ అయిన ఈమూవీ వర్షం సినిమా తెలుగులో సాధించిన విజయం కంటే డబుల్ సాధించింది.  కాని టైగర్ ష్రాఫ్ కు హీరో మంచి పేరు తీసుకవచ్చింది మూవీ.

బాఘీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. మంచి కలెక్షన్స్ సాధించడంతో టైగర్ కు వరుసగా ఆపర్లు వచ్చాయి.. అంతే కాదు ఆ తర్వాత బాఘీ2, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, వార్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో నార్త్ లో మంచి మార్కెట్‌ కూడా క్రియేట్ అయ్యింది యంగ్ హీరోకు.  కానీ గత కొంత కాలంగా టైగర్ ష్రాఫ్ హిట్టు కోసం నానా తంటాలు పడుతున్నాడు.

వరుసగా యావరేజ్ సినిమాలు.. డిజాస్టర్లతో టైగర్ ష్రాఫ్ కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. దాంతో అతను తన రెమ్యూనరేషనర్ కూడా తగ్గించుకోవల్సి వచ్చిందట. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సిిమాకు 30 కోట్ల వరకూ వసూలు చేసిన యంగ్ హీరో.. ఇప్పుడు రేటు తగ్గించురకుని 10 కోట్లకే పరిమితం అయ్యాడన్న న్యూస్.. బాలీవుడ్ లో స్పీడ్ గా వ్యాపించింది. 

Photo Courtesy: Instagram

మరీ ముఖ్యంగా వార్ తర్వాత ఇప్పటివరకు టైగర్ ష్రాఫ్‌కు సాలిడ్ హిట్టు లేదు. ఆ తర్వాత చేసిన బాఘీ 3 యావరేజ్ హిట్టు కాగా.. హీరోపంతి 2, గణపత్, బడే మియాన్ చోటే మియన్ సినిమాలు డిజాస్టర్‌లుగా నిలిచాయి. డిజాస్టర్‌లంటే మళ్లీ మాములు డిజాస్టర్‌లు కాదు.. కనీసం బడ్జెట్‌లో పావువంతు కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. మరి ముందు ముందు అయినా ఈ యంగ్ హీరోకు.. తన గోల్డెన్ డేస్ తిరిగి వస్తాయేమో చూడాలి. 

Latest Videos

click me!