టాలీవుడ్ నెంబర్ వన్ హీరొయిన్ ఎవరో తెలుసా? లేటెస్ట్ సర్వే బయటపెట్టిన సంచలన నిజం! టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్!

Published : Jul 19, 2024, 11:31 AM ISTUpdated : Jul 19, 2024, 12:19 PM IST

టాప్ 10 హీరోయిన్స్ కి సంబంధించిన లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ నమోదు అయ్యాయి. ఫుల్ ఫార్మ్ లో ఉన్న రష్మిక మందాన టాప్ 5లో కూడా లేదు. మరి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..   

PREV
111
టాలీవుడ్ నెంబర్ వన్ హీరొయిన్ ఎవరో తెలుసా? లేటెస్ట్ సర్వే బయటపెట్టిన సంచలన నిజం! టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్!
Tollywood top 10 Heroines


క్లాస్ లో, రేస్ లో, బిజినెస్ లో... రంగం ఏదైనా నెంబర్ వన్ దే ఆధిపత్యం. ఆ అగ్రస్థానం అందుకున్న వారికి దక్కే గౌరవం వేరు. చిత్ర పరిశ్రమలో ఈ నెంబర్స్ గేమ్ కి మరింత ప్రాధాన్యత ఉంటుంది. కాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరనే చర్చ నడుస్తుండగా... లేటెస్ట్ సర్వే తేల్చేసింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ జూన్ 2024 వరకు చేసిన సర్వే ప్రకారం... టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ వీరే. 

211
Natasaarvabhowma Anupama Parameswaran

టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆడియన్స్ ఆమెకు 10వ స్థానం కట్టబెట్టారు. ఆ మధ్య ఆఫర్స్ లేక ఇబ్బంది పడ్డ అనుపమ మరలా బిజీ అవుతుంది. 

 

311

వరుస విజయాలతో టాలీవుడ్ లో సత్తా చాటిన పూజా హెగ్డే  9వ స్థానానికి పడిపోవడం అనూహ్య పరిణామం. 2022 తర్వాత పూజ హెగ్డే కెరీర్ గ్రాఫ్ వేగంగా పడిపోయింది. ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు. 

411

దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో స్టార్ లేడీగా వెలుగొందింది తమన్నా. ప్రస్తుతం ఆమె ఫేడ్ అవుట్ దశలో ఉంది. ప్రేక్షకులు ఆమెకు 8వ స్థానం ఇచ్చారు. 
 

511

సూపర్ హిట్ చిత్రాలు పడినప్పటికీ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకోలేక పోయింది. ఈ మధ్య బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ టెన్ హీరోయిన్స్ లిస్ట్ లో 7వ స్థానం పొందింది. 

 

611

ఇక 6వ స్థానం రష్మిక మందానకు దక్కింది. నిజానికి రష్మిక ఫుల్ ఫార్మ్ లో ఉంది. గత ఏడాది యానిమల్ తో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. పుష్ప 2 వంటి భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుంది. అయినప్పటికీ ఆమెకు టాప్ 5లో కూడా చోటు దక్కలేదు. 

711

యంగ్ బ్యూటీ శ్రీలీలను ఆడియన్స్ 5వ స్థానంలో నిలబెట్టారు. ఒకేసారి అరడజనుకు పైగా చిత్రాలకు సైన్ చేసిన శ్రీలీల రికార్డు నెలకొల్పింది. అయితే మెజారిటీ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ శ్రీలీలకు టాప్ 5లో చోటు దక్కింది. 


 

811

నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఆడియన్స్ 4వ స్థానం ఇచ్చారు. సాయి పల్లవి తెలుగులో మూవీ చేసి చాలా కాలం అవుతుంది. నెక్స్ట్ ఆమె తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. నాగ చైతన్య హీరో. రన్బీర్ కపూర్ కి జంటగా రామాయణం మూవీ చేస్తుంది. 

911
Anushka Shetty

అడపాదడపా చిత్రాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలవడం విశేషం. సినిమాలు చేయకపోయినా అనుష్క శెట్టి ఫేమ్ చెక్కు చెదరలేదని తెలుస్తుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. 

1011

వివాహం చేసుకున్నప్పటికీ కాజల్ అగర్వాల్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. మూవీ లవర్స్ ఆమెకు 2వ స్థానం కట్టబెట్టారు. కాజల్ చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ లేవు. 

 

1111
Samantha

అందరూ ఎదురుచూస్తున్న నెంబర్ వన్ పొజిషన్ సమంతకు దక్కింది. చెప్పాలంటే ఏడాది కాలంగా సమంత సినిమాలు చేయలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బ్రేక్ తీసుకున్నారు. ఇవేమీ ఆమెను అగ్రస్థానం నుండి దూరం చేయలేకపోయాయి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత అవతరించింది. 

Read more Photos on
click me!

Recommended Stories