యంగ్ బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను ‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో పలకరించింది. తన తొలిచిత్రం కూడా ఇదే. బుచ్చిబాబు (Buchi Babu) - పంజా వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో బేబమ్మ నటన ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.
తొలి సినిమాతోనే వంద కోట్లు కలెక్షన్లు సాధించిన హీరోయిన్ గా కృతి శెట్టి టాలీవుడ్ లో రికార్డు క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే వరుసగా మూడు చిత్రాలతో సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా నిలిచింది.
కానీ ఆ తర్వాత కథలను ఎంచుకోవడంలో కాస్తా పొరపాట్లు చేస్తూ వచ్చింది. ఫలితంగా డిజాస్టర్లు అందుకుని తెలుగులో ఆఫర్లకు దూరమైంది. కానీ కోలీవుడ్ లో మాత్రం బేబమ్మ దుమ్ములేపుతోంది. అక్కడ ఈ ముద్దుగుమ్మ జోరు మాములుగా లేదు.
ఇదిలా ఉంటే.. కృతి శెట్టి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకుందాం. కృతి శెట్టి అసలు పేరు ఏంటనేది ఎవరికీ తెలియదు. తను ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తన రియల్ నేమ్ ను కృతి శెట్టిగా మార్చుకుందంట.
ఇంతకీ కృతి శెట్టి అసలు పేరు.. అధ్వైత (Advaitha). అయితే తన పేరును అందరూ సరిగా పలకకపోవడంతో న్యూమరాలాజీ ప్రకారం.. కృతి శెట్టిగా మార్చుకుందంట. దీంతో జాతకాలను ఈ ముద్దుగుమ్మ కూడా ఫాలో అవుతుందనేది అర్థమవుతోంది.
ప్రస్తుతం తమిళంలో కృతి శెట్టి ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, Vaa Vaathiyaare, జీనీ Genie వంటి సినిమాల్లో నటిస్తోంది. మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో శర్వానంద్ (Sharwanand) సరసన Sharwa35లో ఆడిపాడుతోంది.