Intinti Gruhalakshmi: అతి తెలివి ప్రదర్శించిన రాజ్యలక్ష్మి.. అత్తకి చుక్కలు చూపించిన దివ్య!

Published : May 26, 2023, 08:57 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కష్టాలలో ఉన్న మాజీ భర్తకి తోడుగా నిలబడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
111
Intinti Gruhalakshmi: అతి తెలివి ప్రదర్శించిన రాజ్యలక్ష్మి.. అత్తకి చుక్కలు చూపించిన దివ్య!

 ఎపిసోడ్ ప్రారంభంలో సాక్ష్యం చెప్పిన నందు కొలీగ్స్ గురించి మాట్లాడుతూ వీళ్ళు ఇంతకుముందు చీటింగ్ కేసులో పట్టుబడిన వాళ్లు. వీళ్ళ మాటలు చెల్లవు అంటాడు లాస్య తరపు లాయర్. అలాంటి వాళ్ళ సాక్షాలు పరిగణలోకి తీసుకోము అంటారు జడ్జి. మీ తరఫున ఏమైనా సాక్ష్యం ఉందా అని లాస్య లాయర్ ని అడుగుతాడు జడ్జి. మాకు కాస్త గడువు కావాలి అని అడుగుతాడులాయర్.

211

కేస్ ని ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను అంటాడు జడ్జి. బయటికి వచ్చిన తర్వాత తన దగ్గర బలమైన సాక్ష్యం ఉన్నా ఎందుకు లాస్య ప్రొడ్యూస్ చేయలేదు అంటుంది తులసి. ఏ కారణమూ లేకుండా లాస్య ఏ పని చేయదు అంటుంది దివ్య. అంతలోనే లాస్య వచ్చి ఏంటి నా గురించే తెగ ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు అంటుంది.
 

311

నువ్వు సాక్ష్యాన్ని అని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు అని అనుకున్న మాట వాస్తవమే కానీ నువ్వు ఏం చేస్తే మాకెందుకు ఇలా ప్రతిసారి వచ్చి గిచ్చి వెళ్లొద్దు అంటుంది దివ్య. ఏమీ లేదమ్మా మరో రెండు రోజులు నా చుట్టూ తిరిగి కాంప్రమైజ్ కోసం చూస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడుతాడు నందు. నాతో పెట్టుకోవద్దు చాలా కోల్పోవాల్సి ఉంటుంది అంటుంది లాస్య.
 

411

 నువ్వు ఇప్పటికే మా నాన్న ప్రేమని, నమ్మకాన్ని కోల్పోయావు మా నాన్న వెనకాల మేమందరం మేము ఉన్నాము అంటుంది దివ్య. నీ డ్యూటీ నీ కూతురికి అప్పచెప్పావా లోడలోడా వాగుతుంది అని తులసి తో అంటుంది లాస్య. ఈరోజు నా మాటలు వాగుడులాగే ఉంటుంది కానీ రేపు మా నాన్న కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నా సంగతి అంటుంది దివ్య.
 

511

కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య. మరోవైపు రాజ్యలక్ష్మి, సంజయ్ కారులో మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య పెళ్లికి ముందు వరకు నీకు ఎదురులేకుండా పోయింది కానీ దివ్య వచ్చిన తరువాత నీ ఆటలు సాగవేమో అనిపిస్తుంది త్వరగా తనని వదిలించుకోవాలి అంటాడు సంజయ్. తనని కోరి కోడలు చేసుకుంది వదిలించుకోవడానికి కాదు నీకు ఇంకా మీ అమ్మ సంగతి తెలియదు అంటుంది రాజ్యలక్ష్మి.
 

611

 ఇంతలో లాస్య ఫోన్ చేసి నీ కొడుకు నీ కోడల్ని కాస్త అదుపులో పెట్టు వాళ్ళు నా కాళ్ళకి అడ్డం తగులుతున్నారు. వాళ్లు మీ వాళ్ళని వూరుకుంటున్నాను అంటుంది లాస్య. అక్కడ నా అనే వాళ్ళు లేరు కాళ్ళకి అడ్డం తగిలిన వాళ్ళని అడ్డుతప్పించుకొని వెళ్ళిపోవటమే మన పని అంటూ ఫోన్ పెట్టేస్తుంది రాజ్యలక్ష్మి. ముందు విక్రమ్ని ఇల్లు కదలకుండా చేస్తే అప్పుడు దివ్య కూడా ఇల్లు కదలదు.
 

711

నాకు యాక్సిడెంట్ అయితే విక్రమ్ ఇల్లు కదలడు అంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పటికిప్పుడు నీకు యాక్సిడెంట్ ఎలా అవుతుంది అంటాడు సంజయ్. నవ్వుతూ సంజయ్ ని ఒక్కసారిగా నెడుతుంది. కంగారులో కారుని పక్కకి తిప్పేస్తాడు సంజయ్. మరోవైపు కోర్టు నుంచి బయలుదేరుతూ ఉంటారు నందు వాళ్లు. మీకు ఎలాంటి అవసరం వచ్చిన నాకు ఫోన్ చేయండి మీకు నేనున్నాను అంటాడు విక్రమ్.
 

811

 అంతలోనే తల్లికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావటంతో కంగారు పడతాడు. మేము కూడా మీతో వస్తాము అంటూ నందు వాళ్లు కూడా విక్రమ్ వాళ్ళతో వెళ్తారు. కాబట్టి కాలికి కట్టు కట్టి మంచం మీద పడుకోబెడతారు ఇంట్లో వాళ్ళు. పేషెంట్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది డాక్టర్. నేను దివ్య చూసుకుంటాము అంటాడు విక్రమ్. తనకి ఇబ్బందేమో అంటుంది రాజ్యలక్ష్మి.

911

అలా ఎందుకు అనుకుంటుంది అది తన బాధ్యత అంటుంది తులసి. సీన్ కట్ చేస్తే లాస్య తులసికి ఫోన్ చేసి నువ్వు నా కన్నా షార్ప్ గా ఆలోచిస్తున్నావు మీ దగ్గర ఏకలవ్య శిష్యరికం చేయాలి అంటుంది. నీది కమిషన్ వ్యవహారం నాది కోట్లలో వ్యవహారం ఈ మాత్రం షార్ప్నెస్ ఉండాలి అంటుంది రాజ్యలక్ష్మి. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని లాస్యని అడుగుతుంది. నందుని కేఫ్ కి దూరం చేయాలనుకుంటున్నాను.

1011

అది లేకపోతే తను బ్రతకలేడు అంటుంది లాస్య. ఆనందంగా ఫోన్ పెట్టేస్తుంది రాజ్యలక్ష్మి. అప్పుడే దివ్య మీ జిగిని దోస్త్ ఏమంటుంది అంటూ లోపలికి వస్తుంది. నన్ను ఇంట్లోంచి కదలనివ్వకుండా మంచి ప్లానే వేశారు అంటుంది. అయితే ఏంటి ఇప్పుడు ఇదంతా మీ అమ్మకు చెప్తావా తను తట్టుకోగలదా అంటుంది రాజ్యలక్ష్మి. ఎడం కాలికి దెబ్బ తగిలిందని చెప్పి కుడి కాలికి కట్టు కట్టారు.

1111

ఈ విషయం మీ కొడుకు చెప్తే తట్టుకోగలడా అని అడుగుతుంది దివ్య. ఒక్కసారిగా షాక్ అవుతుంది రాజ్యలక్ష్మి. అప్పుడే ఈ విషయాన్ని మీ అబ్బాయి వరకు తీసుకువెళ్లను దానికి ఇంకా టైం ఉంది అప్పటివరకు ఎంజాయ్ చేయండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది దివ్య. తరువాయి భాగంలో డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో నందుని అన్  పాపులర్ చేయిస్తుంది లాస్య.

click me!

Recommended Stories