పిల్లలు కావాలంటే పెళ్లితో పనేంటి అని రీసెంట్ గా హీరోయిన్ నిత్య మీనన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సెలబ్రిటీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.
ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ ఇండస్ట్రీ వరకే తెలుసు. కానీ బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర చేసినప్పటి నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు సత్యరాజ్. స్వతహాగా నాస్తికుడైన సత్యరాజ్ సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక ఆయన మాత్రమే కాదు ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ కూడా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. న్యూట్రిషనిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమె, తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
24
పెళ్లిపై నమ్మకంలేదన్న దివ్యసత్యరాజ్..
వివాహం, కుటుంబ వ్యవస్థపై దివ్య సత్యరాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ, ''సంప్రదాయంగా పాటించే తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాలు బంధాన్ని బలపరుస్తాయని నేను నమ్మను. ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించడానికి పెళ్లి అనే అధికారిక ముద్ర అవసరం లేదు. '' అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
34
పిల్లలు కావాలంటే పెళ్లీతో పనేంటి?
దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ.. '' పిల్లలను కనాలంటే తప్పనిసరిగా పెళ్లి కావాలనే సామాజిక నిబంధనకు కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. వివాహం చేసుకోకుండానే తల్లిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అని దివ్య అన్నారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియాలో కొంత మంది ఆమెకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇక తన వ్యక్తిగత నేపథ్యం గురించి కూడా దివ్య మాట్లాడారు. తన తండ్రి నాస్తికుడు కావడంతో తనకు జాతకం రాయించలేదని, గ్రహాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని తాను నమ్మడం లేదని తెలిపారు. తన జీవిత నిర్ణయాల్లో జ్యోతిష్యాన్ని ఆధారంగా తీసుకోనని ఆమె అన్నారు. తాను పెళ్లి చేసుకున్నా..చేయకపోయినా తన సంతోషమే తన తండ్రికి ముఖ్యమని దివ్య సత్యరాజ్ చెప్పారు. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛపై తాను గర్వపడుతున్నానని కూడా వెల్లడించారు.