మెగా డాటర్ నిహారిక.. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో సినిమా..? దాదాపు 25 కోట్ల భారీ బడ్జెట్ తో ఆమూవీ తెరకెక్కబోతోందా? ఈ విషయంలో నిజం ఎంత? నిహారిక స్వయంగా ఏమని ప్రకటించింది?
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న టెలివిజన్ స్టార్ సుడిగాలి సుధీర్. వెండితెరపై హీరోగాకొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అయితే బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ‘జబర్దస్త్’ కామెడీ షో లో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, టీమ్ లీడర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. ఆతరువాత యాంకర్ గా మారి రష్మీ,ప్రదీప్ తో కలిసి పలు షోలు హోస్ట్ చేశాడు. దాంతో సుధీర్ ఇమేజ్ మరింతగాపెరిగిపోయింది.
26
వెండితెరపై కనిపించని ప్రభావం..
బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన సుధీర్.. ఆతరువాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. టాలీవుడ్ లో హీరోగా కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. సుధీర్ నటించిన ‘గాలోడు’ చిత్రం కమర్షియల్‌గా మంచి కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘ఆపరేషన్ సహస్ర’ సినిమాకి మాత్రం యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయన చేసిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమా ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం సుధీర్ ‘హైలెస్సో’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
36
హోస్ట్ గా బిజీ అయిపోయిన సుడిగాలి సుధీర్..
సినిమాల కంటే కూడా సుధీర్ కి టెలివిజన్ లోనే అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఓటీటీ షోలలో కూడా యాంకర్‌గా బిజీగా ఉన్నాడు సుధీర్. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆట డ్యాన్స్ షో జీ తెలుగులో మంచి స్పందన రాబట్టింది. సుధీర్ అభిమానులు మిస్ అవ్వకుండా చూడటంతో.. ఈ షోకు మంచి టీఆర్పీలు వచ్చినట్టు తెలుస్తోంది. . ఈ షో మొదటి సీజన్ త్వరలో గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది.
నిరిహారిక - సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో సినిమా?
ఇక జబర్ధస్త్ టైమ్ నుంచి నాగబాబు.. ఆయన కూతురు నిరిహారికతో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు సుడిగాలి సుధీర్. నిహారికతో కొన్ని షోలు కూడా చేశాడు. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ షోలో నిహారిక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఈ మధ్య సుధీర్ హోస్ట్ చేస్తున్న షోకి సబంధించిన ఒక ఎపిసోడ్‌లో రాధిక శరత్ కుమార్ కూడా పాల్గొన్నారు. సుధీర్, నిహారిక కొణిదెల, సీనియర్ నటి రాధికా మధ్య జరిగిన సంభాషణ ఆడియన్స్ ను అలరించింది.
56
సుధీర్ పై 25 కోట్ల బడ్జెట్ సాధ్యమేనా?
నిహారిక సుధీర్‌ను హీరోగా పెట్టి రూ.25 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తానని ప్రకటించింది. అదే సమయంలో రాధికా కూడా సుధీర్ తో సినిమా చేస్తానని అన్నారు. సుధీర్ మాత్రం రాధికతో సినిమా ఇప్పుడప్పుడే చేయలేను.. చాలా బీజీగా ఉన్నాను, అందుకే నిహారిక సినిమాకు మాత్రమే డేట్స్ ఇస్తానని అన్నాడు. అయితే ఇదంతా నిజం కాదని.. ఆడియన్స్ కు ఆతరువాత అర్ధం అయ్యింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఈముగ్గురు స్టార్స్ ఓ సరదా స్కిట్ చేసినట్టు తెలుస్తోంది.
66
నిహారిక నిజంగానే సినిమా చేయబోతోందా?
అయితే ఈ స్కిట్ కేవలం వినోదం కోసమే అయినప్పటికీ... సుధీర్‌ను హీరోగా తీసుకుని సినిమా చేయాలని నిహారిక కొణిదెల ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిర్మాతగా నిహారిక ఈ మధ్య వరుస హిట్లు కొడుతోంది. దాంతో ఆమె నిర్మించిన ‘రాకాస’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు మానస శర్మ తో.. సుధీర్ హీరోగా ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ భారీగా కాకపోయినా, సుధీర్‌కు సరిపోయే మంచి కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘