Kara 2 Days Collections: కర మూవీకి క్రేజీ కలెక్షన్లు.. ధనుష్‌ సినిమా హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

Published : May 02, 2026, 11:37 AM IST

ధనుష్‌ హీరోగా నటించిన `కర` మూవీ ఈ గురువారం ఆడియెన్స్ వచ్చింది. దీనికి డీసెంట్‌గానే వసూళ్లు వస్తున్నాయి. మరి రెండు రోజుల్లో ఈ చిత్రానికి ఎంత వచ్చాయి? హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే? 

PREV
14
కర మూవీ రిజల్ట్

ధనుష్‌ హీరోగా రూపొందిన మూవీ `కర`. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్‌ రాజా దర్శకత్వం వహించారు. రైతు సమస్యలు, ముఖ్యంగా లోన్ల విషయంలో జరిగే మోసాలను ప్రధానంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ధనుష్‌ ఒక దొంగగా నటించడం విశేషం. గురువారం విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కమర్షియల్‌ యాంగిల్‌లో కొన్ని లోపాలున్నా, క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. సామాజిక అంశాలను చర్చించే మంచి మూవీగా నిలిచిందని చెప్పొచ్చు.

24
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు

ఇక కమర్షియల్‌ యాంగిల్‌లో మిశ్రమ స్పందనతో ఆడుతున్న ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. మంచి వసూళ్ల దిశగా వెళ్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. ధనుష్‌ గత సినిమాలతో పోల్చితే కాస్త డల్‌గానే ఉన్నా, ఇప్పుడున్నపరిస్థితుల్లో దీనికి బెటర్‌గానే వసూళ్లు రావడం విశేషం. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పెరగడం మరో విశేషం.

34
కర మూవీ రెండు రోజుల వసూళ్లు

కర మూవీకి మొదటి రోజు ఇండియాలో రూ.6.25కోట్ల నెట్‌ వస్తే, రెండో రోజు రూ.6.95కోట్లు వచ్చాయి. ఓవరాల్‌గా ఇండియాలో దీనికి రూ.15.30కోట్ల గ్రాస్‌ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా `కర` మూవీ రెండు రోజుల్లో సుమారు ఇరవై కోట్లు రాబట్టింది. దీన్ని బట్టి ఈ సినిమా మంచి హోల్డ్ లో ఉందని చెప్పొచ్చు. శనివారం ఇప్పటికే సుమారు పది లక్షలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చింది. శనివారం, ఆదివారం మంచి వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉంది. కాకపోతే సోమవారం నుంచి అసలు గేమ్‌స్టార్ట్ కానుంది.

44
కర మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`కర` సినిమాకి అయిన బిజినెస్‌ రూ.40కోట్లు అని సమాచారం. ఈ లెక్కన సినిమా హిట్‌ కావాలంటే రూ.41కోట్ల  వరకు షేర్‌ రాబట్టాలి. అంటే సుమారు ఎనభై కోట్ల గ్రాస్‌ రావాలి. ఇప్పుడు అందులో పావు వంతు మాత్రమే వచ్చింది. ఈ వీకెండ్‌ సగం కలెక్షన్లు రాబడితే కొంత సేఫ్‌లోకి వెళ్తారు. లేదంటే స్ట్రగుల్స్ తప్పవు. ప్రస్తుతం అదిరిపోయే కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఫైనల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందా అనేది ప్రశ్న. ఏం జరుగుతుందో, ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ధనుష్‌కి ఇటీవల కమర్షియల్‌ హిట్‌ లేదు. `కుబేర` కూడా కొంత నష్టాలనే మిగిల్చింది. ఆ తర్వాత వచ్చిన `ఇడ్లీకొట్టు` కూడా మెప్పించలేకపోయింది. ఇప్పుడు `కర` రిజల్ట్ ఏంటనేది తేలాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories