Intinti Gruhalakshmi: జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతున్న నందు.. ఢిల్లీకి బయలుదేరిన దివ్య?

First Published Jan 30, 2023, 9:49 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో తులసి,తన ఫ్యామిలీ మొత్తం జరిగింది తలచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు తులసి పదేపదే నందు అన్న మాటలు నందు ప్రవర్తనను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నందు, దూరం నుంచి తులసిని చూసి బాధపడుతూ ఉండగా అది లాస్య చూస్తూ ఉంటుంది. అప్పుడు నందు కంపెనీలో ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటాడు. తులసి, నందు తో పాటు ఇంట్లో ఉన్న వారందరూ కూడా జరిగిన విషయాలు తెలుసుకుని డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ పరంధామయ్య అనసూయ, ప్రేమ్ దంపతులు అభి ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి సంతోషంగా నవ్వుతూ వచ్చి ఏమీ తెలియనట్టుగా ఏమీ జరిగినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది.
 

ఎందుకు అందరూ అలాగే ఉన్నారు ఏదైనా సంతాప సభ పెట్టారా అని అంటుంది తులసి. అప్పుడు అనసూయ వాడు ఎదిగిన వాడు కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాను అదే చిన్నపిల్లలుగా అయితే అట్లకాడ కాల్చి నోటిమీద కాల్చే దాన్ని అని అంటుంది. ఆయన అరిచింది నన్ను కోప్పడితే నేను కోప్పడాలి గాని మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు అంటుంది తులసి. ఇలా ఎన్నాళ్ళని మాట పడతారు ఆంటీ అని శృతి అడగగా ఇంట్లో ఉన్నన్ని రోజులు అనడంతో వెంటనే అనసూయ అంటే జీవితాంతం మాటలు పడుతూనే ఉంటావా అని అనడంతో వెంటనే తులసి సరే చెప్పండి మనం అందరూ ఇల్లు విడిచి వెళ్లి పోదామా అనడంతో అందరూ ఒకేసారిగా షాక్ అవుతారు. లేదా వాళ్ళని వెళ్లిపోమందామా అనడంతో అందరూ ఆలోచనలో పడతారు.

నా పిల్లలకు తండ్రిని దూరం చేయడం నాకు ఇష్టం లేదు ఆయన నన్ను మాజీ భార్యగా అనుకుంటే వెళ్ళిపోమని చెబుతాను నా కుటుంబ సంతోషం కోసం అయితే నేనే నా కుటుంబాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అంటుంది తులసి. ఒకప్పుడు ఇంటిని విడిచి బయటికి వెళ్లిపోయిన నేనే ఈరోజు తప్పని పరిస్థితులలో మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. మీ అందరికీ నేను ఒకటే చెబుతాను ఈ విషయం గురించి మీరు ఏమి ఆలోచించొద్దండి అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని అంటుంది. దివ్య ఢిల్లీకి వెళ్తోంది ముందు దాని సంగతి చూడాలి అంటుంది తులసి. మరోవైపు దివ్య ఢిల్లీకి వెళ్లడానికి బాధపడుతూ ఉండగా అంకిత, ప్రేమ్ శృతి వాళ్ళు అక్కడికి వెళ్లి దివ్యని ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఉంటారు.
 

 అప్పుడు దివ్య బాధపడుతూ నేను ఢిల్లీకి వెళ్ళను అని అంటుంది. నువ్వు ఎవరికోసమైతే వెళ్ళను అంటున్నావు నువ్వు వెళ్లకపోతే వాళ్లే బాధపడతారు అని ప్రేమ్ దివ్యకి నచ్చ చెబుతాడు. అప్పుడు అభి అంకిత శృతి ప్రేమ్ వాళ్ళు దివ్యకి నచ్చజెప్పి దివ్య అని ఢిల్లీకి వెళ్ళడానికి ఒప్పిస్తారు.  అప్పుడు ప్రేమ్ దివ్య పై జోకులు వేయడంతో అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు నందు బాధపడుతుండగా అప్పుడు లాస్య ఇప్పుడు అర్థమయిందా నందు, నాకూ తులసికి మధ్య తేడా ఏంటో నేను ఏదైనా ఉంటే ముఖం మీద చూపిస్తాను. కానీ తులసి అలా కాదు లోపల దాచుకుంటూ ఉంటుంది అనే తులసి గురించి మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది లాస్య. 

అందరి ముందు దొంగ నాటకాలు వాడుతూ తను చేయాలనుకున్నది చేసి అందరిని బురిడీ కొట్టిస్తూ ఉంటుంది అని అంటుంది లాస్య. అప్పుడు ఆమెను ఉత్తమ ఇల్లాలు అనుకుంటావు అసలు ఆ తులసిని తలచుకుంటేనే అని అంటుండగా ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. అసలే చిరాకులో ఉన్నాము ఏం మాట్లాడించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనడంతో అప్పుడు తులసి దూరం నుంచి మాట్లాడిస్తాను అని అంటుంది. అప్పుడు తులసి నీ కొంగుని ఇలా ముడి వేసి పట్టుకో అనగా లాస్య అలా చేస్తుంది. అప్పుడు ఆ ముడి తీసి నోట్లో పెట్టుకోరు అని చెప్పి మాట్లాడకుండా మౌనంగా ఉండు అని అనడంతో లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు నేను ఆయనతో పది నిమిషాలు మాట్లాడాలి అనడంతో నాకు మాట్లాడే ఓపిక లేదు అనగా నాకు అంతకంటే లేదు అని అంటుంది తులసి.
 

 అక్కడ దివ్య బయలుదేరుతుంది నా మీద కోపం ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి దివ్యని నవ్వుతూ సాగనంపండి అని అంటుంది తులసి. అప్పుడు తులసి లాస్య న్ని పక్కకు పిలుచుకొని వెటకారంగా మాట్లాడిస్తుంది. అప్పుడు లాస్య సరే మేమిద్దరం వస్తాము ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. ఆ తర్వాత అందరూ దివ్య వెళ్తుండగా బాధపడుతూ ఉంటారు. దివ్య కూడా అందరిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరేం బాధపడకండి తాతయ్య నేను ప్రతిరోజు మీకు వీడియో కాల్ చేసి మీ అందరితో మాట్లాడతాను అని అంటుంది దివ్య. ఆ తర్వాత దివ్య నందు దగ్గరికి వెళుతుంది. అప్పుడు నందుని హత్తుకొని ఎమోషనల్ అవ్వగా దివ్యకి నందు వాచ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టం డాడ్ అనడంతో నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అపుడు కోపంలో ఏదో నీ మీద అరిచేశాను కానీ తర్వాత చాలా బాధపడ్డాను అంటాడు నందు.
 

ఇప్పుడు దివ్య నందుని మాట అడుగుతూ ఇంకెప్పుడూ మామ్ మీద అరవాలని చెప్పండి నాకు మాట ఇవ్వండి డాడీ ఇక్కడి నుంచి మనశ్శాంతిగా వెళ్తాను అనడంతో సరే అని దివ్య కి మాట ఇస్తాడు నందు. అప్పుడు నందు వాచ్ తీసి దివ్య చేతికి వేస్తాడు. అప్పుడు దివ్య తులసి దగ్గరికి వెళ్లి హత్తుకొని గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు తులసి కూడా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు చెప్పినట్టే వింటాను నువ్వు గీసిన గీతను దాటను మామ్ అని అంటుంది. నా గురించి ఎక్కువ ఆలోచించకు దిగులు చెందకు ప్రశాంతంగా ఉండు మామ్ అని అంటుంది.

click me!