ఎపిసోడ్ ప్రారంభంలో కొడుకుని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇస్తుంది అనసూయ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. లాస్య కి విడాకులు ఇద్దామనుకుంటున్నాను అంటాడు నందు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు పరంధామయ్య.