అందుకు సంతోషించిన అంజలి మా పెళ్లిని కూడా యాక్సెప్ట్ చేసినట్లే కదా అని అడుగుతుంది. అవునన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. మరోవైపు కొత్త దంపతులతో పాటు ఇంటికి వస్తారు శారదమ్మ, జెండే. నీరజ్ వాళ్ళని బయట ఉండమని పనిమనిషితో హారతి తీసుకు రమ్మని చెప్తుంది శారదమ్మ. హారతి పళ్ళాన్ని నేలకేసి కొడుతుంది మాన్సీ. ఏం చేస్తున్నావ్, ఇది ఆశీర్వదించిన పెళ్లి అంటూ కోప్పడుతుంది శారదమ్మ. మీ ఇంటి కోడలు నేను బ్రతికుండగా నా భర్త ఎవరినో పెళ్లి చేసుకుని తీసుకువస్తే ఎలా ఊరుకుంటాను అంటుంది మాన్సీ.