రీతూ చౌదరీ పెళ్లై విడాకులు తీసుకుంది, ఇంకా చిన్నపిల్లేంటి? వాళ్లమ్మ ఇంట్లో కూర్చొని ఏడుస్తోంది

Published : Nov 04, 2025, 02:45 PM IST

Rithu Chowdary: రీతూ చౌదరీ ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లో డీమాన్‌ పవన్‌తో కలిసి పులిహోర కలుపుతుంది. అయితే రీతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించి దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

PREV
15
సోషల్‌ మీడియాని షేక్‌ చేసిన రీతూ చౌదరీ

రీతూ చౌదరీ సోషల్‌ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. సీరియల్స్ ద్వారా కెరీర్‌ని ప్రారంభించి, టీవీ షోస్‌ చేస్తూ రాణించింది. యాంకర్‌గానూ మారింది. మరోవైపు జబర్దస్త్ కమెడియన్‌గా మెప్పించింది. ఇంకోవైపు ఓ సింగర్‌ని లైవ్‌లో స్టేజ్‌పై హగ్ చేసుకుని హాట్‌ టాపిక్ గా మారింది. దీనితో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిపోయింది. మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.

25
లవర్స్ గా రాణిస్తున్న రీతూ, డీమాన్‌ పవన్‌

ప్రస్తుతం రీతూ చౌదరీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో క్రేజీ కంటెస్టెంట్‌గా ఉంది. నిత్యం ఏదో రకంగా అరుస్తూ కెమెరాలో హైలైట్‌ అవుతుంది. దీనికితోడు డీమాన్‌ పవన్‌తో పులిహోర కలుపుతూ మరింతగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు రియల్‌ లైఫ్‌ లవర్స్ గా చెలామణి అవుతుండటం విశేషం. ఒకరికొకరు ఫుడ్‌ తినిపించుకోవడం, హగ్‌లు చేసుకుంటూ, తిట్టుకుంటూ, అలుగుతూ కంటెంట్‌ ఇస్తున్నారు. దీంతో ఇదే వీరిని హౌజ్‌లో సేవ్‌ చేస్తుందని చెప్పొచ్చు. అయితే వీరి రిలేషన్‌పై తాజాగా దువ్వాడ మాధురి స్పందించింది. హాట్‌ కామెంట్‌ చేసింది.

35
రీతూ చౌదరీ బండారం బయటపెట్టిన దివ్వెల మాధురి

రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌లది ఫేక్‌ రిలేషన్‌ అని తెలిపింది దివ్వెల మాధురి. వాళ్లు కంటెంట్‌ కోసం, ఓటింగ్‌ కోసం అలా నటిస్తున్నారని, క్యూట్‌ క్యూట్‌గా బిహేవ్‌ చేస్తున్నారని, వాళ్ల మధ్య బాండింగ్‌ ఫేక్‌ అని స్పష్టం చేసింది. అంతేకాదు రీతూ గురించి పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది మాధురి. రీతూ చిన్న పిల్ల కాదని, ఆమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందని చెప్పింది. డైవర్స్ తర్వాత మరో వ్యక్తితో ఉంటుందని తెలిపింది. అంతగా కథ నడిపినా ఆమె చిన్న పిల్లనా అంటూ జర్నలిస్ట్ జాఫర్‌ కి కౌంటర్‌ ఇచ్చింది. ఆయనతో తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది మాధురి.

45
రీతూ వాళ్లమ్మ ఇంట్లో ఏడుస్తోంది

అయితే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో రీతూ చేసే పనులు, ఆ అబ్బాయితో ఉంటున్న తీరుచూసి వాళ్ల అమ్మ చాలా బాధపడుతుందని, ఇంట్లో కూర్చొని ఏడుస్తుందని తెలిపింది దివ్వెల మాధురి. నాకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని రీతూకి చెప్పమని, బాత్‌ రూమ్‌లోకి తీసుకొని వెళ్లి అయినా చెప్పు అమ్మ అని బ్రతిమాలిందని, కానీ తాను చెప్పే ప్రయత్నం చేసినా, ఆమె వినే పరిస్థితుల్లో లేదని వెల్లడించింది. ఇప్పటికైనా ఆమె గురించి అందరికి తెలియాలి అని చెబుతున్నట్టుగా వెల్లడించింది దివ్వెల మాధురి.

55
దువ్వాడ శ్రీనివాస్‌ కోసం నేను ఏ త్యాగం అయినా చేస్తా

ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్‌తో తమ రిలేషన్‌ గురించి జాఫర్‌ అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ, రీతూ, డీమాన్‌ పవన్‌ కేవలం ఓటింగ్‌ కోసం, కంటెంట్‌ కోసమే అలా చేస్తున్నారని, కానీ కప్‌ తీసుకోవాల్సి వస్తే, ఫైనల్‌కి వెళితే వాళ్లు త్యాగం చేయరని, అసలు రూపం అప్పుడు బయటపడుతుందన్నారు. కానీ తాము అలా కాదని, శ్రీనివాస్‌ కోసం తాను ఏదైనా వదులుకోవడానికి రెడీ అని తెలిపింది. అదే సమయంలో తనకోసం మాధురి చాలా త్యాగం చేసిందని దువ్వాడ శ్రీనివాస్‌ తెలిపారు. ఇది అసలైన రిలేషన్‌ అని, ఇది నిజమైన బాండింగ్‌ అని, వారిది ఫేక్‌ అని శ్రీనివాస్‌ కూడా చెప్పడం విశేషం. ప్రస్తుతం వీరి కామెంట్స్ వైరల్‌గా మారాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories