మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ముంబైలోని వెర్సోవాలో తన కూతుళ్లతో కలిసి సముద్రానికి ఎదురుగా ఉన్న ఒక అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె అభిరుచికి, జీవనశైలికి అద్దం పట్టేలా ఈ ఇంటిని ఎంతో కళాత్మకంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు.
సుస్మితా సేన్ ఇంట్లో పాతకాలం నాటి అందం, ఆధునిక డిజైన్ చక్కగా కలిసిపోయాయి. ఖరీదైన చెక్క ఫర్నిచర్, ఎంపిక చేసిన కళాఖండాలు, జ్ఞాపకాలుగా దాచుకున్న వస్తువులు ప్రతి మూలకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ నాలుగు బెడ్‌రూమ్‌ల ఇల్లు సౌకర్యాన్ని, విలాసాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా డైనింగ్ ఏరియాలో పాతకాలం నాటి చెక్క క్యాబినెట్, అందమైన పింగాణీ వస్తువులు, క్రిస్టల్ షాండ్లియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆమె మిస్ యూనివర్స్ ప్రయాణాన్ని గుర్తుచేసే కళాఖండాలు ఈ ఇంటికి మరింత అందాన్ని తెచ్చాయి.
23
బాల్కనీ నుంచి సముద్రపు దృశ్యాలు
మాస్టర్ బెడ్‌రూమ్ ఆమెకు విశ్రాంతి తీసుకునే ప్రదేశం మాత్రమే కాదు, వెల్నెస్ స్పేస్ కూడా. చెక్కతో చేసిన ఫర్నిచర్, తెలుపు రంగు ఫోర్-పోస్టర్ బెడ్, అలంకరణ వస్తువులు గదికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ గదిలోనే వర్క్‌స్పేస్, వాక్-ఇన్ క్లోసెట్ కూడా ఉన్నాయి. సుస్మిత తన ఫిట్‌నెస్ కోసం ఈ గదిని కూడా ఉపయోగిస్తుంది. ఈ గదికి ఉన్న బాల్కనీ నుంచి సముద్రపు దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి.
33
లివింగ్ రూమ్
ఈ ఇంటిలో అత్యంత ఆకట్టుకునే ప్రదేశం లివింగ్ రూమ్. పెద్ద గాజు కిటికీల నుంచి సముద్రం మొత్తం కనిపిస్తుంది. కళాఖండాలు, శిల్పాలు, కుటుంబ ఫోటోలతో ఈ గదిని అలంకరించారు. విశాలమైన టెర్రస్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, స్టైలిష్ సీటింగ్, బార్ ఏరియాతో ఇది సాయంత్రాలు గడపడానికి, పార్టీలకు సరైన ప్రదేశం. పచ్చదనం మధ్య స్నేహితులు, కుటుంబ సభ్యులతో సేద తీరడానికి ఇది ఒక అద్భుతమైన చోటు.