బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎనిమిదవ వారంలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం దివ్వెల మాధురి, సంజనా, పవన్, రీతూ చౌదరీ, కళ్యాణ్, రాము రాథోడ్, తనూజ, గౌరవ్‌లు నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఎవరు ఈ వారం హౌజ్‌ని వీడబోతున్నారనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో కొందరు బిగ్ బాస్ ఫాలోవర్స్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో క్రేజీ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.
25
డేంజర్ జోన్‌లో దివ్వెల మాధురి
ఆన్ లైన్ ఓటింగ్ ప్రకారం గురువారం పోల్ అయిన ఓట్లని బట్టి చూస్తే ఫైర్ బ్రాండ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. దివ్వెల మాధురికి అతి తక్కువగా ఓట్లు నమోదయ్యాయి. ఆమెతోపాటు గౌరవ్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం పాయింట్లలోనే ఉంది. శుక్రవారం పోల్ అయ్యే ఓట్ల ప్రకారం ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే చాలా వరకు దివ్వెల మాధురికీ ఛాన్స్ ఉందంటున్నారు. ఆమె ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.
35
గౌరవ్ మీద ఎలిమినేషన్ కత్తి
కాకపోతే ఓట్ల తేడా చాలా మైన్యూర్‌గా ఉండటంతో గౌరవ్‌ని పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను డల్‌గా ఉంటున్నాడు. ఎలాంటి కంటెంట్ ఇవ్వడం లేదు. అటో ఇటో మాధురి ఏదో ఒకటి మాట్లాడుతూ కనిపిస్తుంది. అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆమెని ఉంచి, గౌరవ్‌ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ఏం చేస్తారో చూడాలి. అయితే శుక్రవారం పోల్ అయ్యే ఓట్లని బట్టి ఈ నిర్ణయం ఉండబోతుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే తాను ఫైర్ బ్రాండ్ అని, తానేంటో చూపిస్తానని బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన దివ్వెల మాధురి, ఇతర కంటెస్టెంట్లపై అరవడం తప్ప ఏం చేయడం లేదు. ప్రారంభంలో వివాదాలకు కేరాఫ్‌గా నిలచింది. ఏదో ఒకటి కామెంట్ చేస్తూ కెమెరాల్లో హైలైట్ అయ్యింది. మొత్తానికి బిగ్ బాస్ షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది. కానీ నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో కాస్త తగ్గింది. ఆచితూచి మాట్లాడుతోంది. అయితే తనపై బయట ఉన్న బ్యాడ్ ఇమేజ్‌ని పోగొట్టేందుకు షోకి వచ్చినట్టు చెప్పింది. అదే సమయంలో హౌజ్‌లో ఎవరూ సరిగ్గా ఆడటం లేదని, తాను రచ్చ చేస్తానని చెబుతూ వచ్చిన ఆమె ఇప్పుడు ఆ స్థాయిలో తన ప్రదర్శన ఇవ్వడం లేదు. పైగా అనవసరమైన గొడవలకు కారణమవుతుందనే కామెంట్ కూడా ఉంది. దీంతో అది ఆమెకి నెగటివిటీగా మారింది. అది ఓటింగ్‌పై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. అయితే దివ్వెల మాధురి మొదటిసారి నామినేషన్‌లోకి వచ్చింది. మరి ఫస్ట్ టైమే ఆమె డేంజర్ జోన్‌లో ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. ఎలిమినేట్ అవుతుందా? లేదా అనేది చూడాలి.
55
శ్రీజ ఎలిమినేట్
ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు భరణి, శ్రీజలకు బిగ్ బాస్ మరో అవకాశం కల్పించారు. మరోసారి హౌజ్‌లో ఉండిపోయే ఛాన్స్ ఇచ్చారు. అయితే వీరిలో ఒక్కరికే ఆ అవకాశం దక్కుతుంది. ఆడియెన్స్ పోల్, టాస్క్ లను బట్టి ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఫైనల్ చేస్తారు. ఇందులో శ్రీజ ఎలిమినేట్ అయినట్టు సమాచారం.