Bigg Boss Telugu5: రెచ్చిపోయి డాన్స్ చేసిన దివి, మోనాల్.. హాట్ హాట్ గా అదరగొట్టేశారు

First Published | Oct 31, 2021, 8:05 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 దివాళి స్పెషల్ ఎపిసోడ్ తో ముస్తాబై వచ్చింది. అలరించే గేమ్స్, ఆటపాటలతో షో వినోదాత్మకంగా సాగుతోంది. ఉత్కంఠ పెంచడానికి నామినేషన్స్ ఎలాగూ ఉన్నాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 దివాళి స్పెషల్ ఎపిసోడ్ తో ముస్తాబై వచ్చింది. అలరించే గేమ్స్, ఆటపాటలతో షో వినోదాత్మకంగా సాగుతోంది. ఉత్కంఠ పెంచడానికి నామినేషన్స్ ఎలాగూ ఉన్నాయి. తాజాగా అందాల భామలు దివి, మోనాల్ గజ్జర్ అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో కనువిందు చేశారు. 

స్టన్నింగ్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ అందాలతో ఇద్దరూ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. మొదటగా మోనాల్ ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత దివి వేదికపైకి వచ్చింది. మోనాల్ గజ్జర్.. హిట్ ఐటెం నంబర్ 'రంభ ఊర్వశి మేనక' సాంగ్ కు మోనాల్ డాన్స్ పెర్ఫామెన్స్ అందించింది. 


మోనాల్ బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే డాన్స్ అందించింది. ఇక దివి సిల్వర్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. బ్యాచిలర్ బాబు అనే ఐటెం సాంగ్, పంజా చిత్రంలోని వెయ్ రా చెయ్ వెయ్ రా సాంగ్ తో ఇద్దరూ డాన్స్ అదరగొట్టేశారు. ఇద్దరూ స్టన్నింగ్ హాట్ లుక్ లో మతిపోగొట్టారు. 

డాన్స్ పెర్ఫామెన్స్ ముగిసిన అనంతరం నాగార్జున హౌస్ మేట్స్ కి చిన్న గేమ్ పెట్టారు. దివాళి దియాలు గెలుచుకునే గేమ్ అది. బిగ్ బాస్ ఇచ్చిన పెద్ద డైస్ ని హౌస్ మేట్స్ కింద వేయాలి. అందులో ఎంత నంబర్ వస్తే.. అన్ని దియాలని పక్కన వాళ్లకు ఇచ్చేయాలి. ఈ గేమ్ సరదాగా సాగుతుంది. 

అనంతరం నామినేషన్స్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఎవరి ఇంటి సభ్యుల నుంచి మాటలు వినిపిస్తాయి వారు సేఫ్. షణ్ముఖ్ తల్లి హ్యాపీ దివాళి షన్ను బాబు అంటూ వాయిస్ వినిపిస్తుంది. దీనితో షణ్ముఖ్ సేవ్ అవుతాడు. 

మొత్తంగా మోనాల్ గజ్జర్, దివి తన డాన్స్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు జోష్ ఇచ్చారు. వీరిద్దరి డాన్స్ పెర్ఫామెన్స్ ఈ ఎపిసోడ్ కే హైలైట్ గా నిలిచింది. 

Latest Videos

click me!