Balakrishna: తండ్రి స్థాపించిన పార్టీ చంద్రబాబు చేతిలో ఎందుకు పెట్టావ్... బాలయ్య సమాధానం

First Published | Oct 31, 2021, 5:10 PM IST


నటసింహం బాలయ్య వ్యాఖ్యాతగా వస్తుంది 'అన్ స్టాపబుల్' టాక్. మొదటిసారి Balakrishna హోస్ట్ గా మారడంతో ఈ టాక్ షోపై విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. 

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఏదో ఆషామాషీగా సాగే షో ఐతే ఇది కాదని, మొదటి ఎపిసోడ్ ద్వారానే అర్థం అవుతుంది. అల్లు అరవింద్ కి చెందిన తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారం కానున్న ఈ టాక్ సరికొత్త రికార్డ్స్ నెలకొల్పేలా కనిపిస్తుంది.

Unstoppable ఫస్ట్ ఎపిసోడ్ కి బాలయ్య గెస్ట్ గా మంచు మోహన్ బాబు రావడం జరిగింది. వీరిద్దరి మధ్య సంభాషణలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు చోటు చేసుకున్నాయి. చిరంజీవిగారిపై మీ నిజమైన అభిప్రాయం చెప్పాలని బాలకృష్ణ అడిగారు. దేవుడు సాక్షిగా తనపై మంచి ఉద్దేశమే ఉందని మోహన్ బాబు తెలియజేశారు.


అనంతరం మీరు విలన్ నుండి హీరోగా మారే క్రమంలో చేసిన రిస్క్ గురించి చెప్పండని బాలయ్య మోహన్ బాబును అడిగారు. ఆ సమయంలో పిల్లలకు అన్యాయం చేస్తున్నానేమో అనిపించింది. ఇల్లు కూడా అమ్మేశాను, అంటూ ఆనాటి కఠిన పరిస్థితులు Mohan babu గుర్తు చేసుకున్నారు. 

ఈ క్రమంలో మోహన్ బాబు ఓ షాకింగ్ క్వచ్చన్ ని బాలయ్యపై సంధించారు. అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు, ఆయన అనంతరం మీరు తీసుకోకుండా, చంద్రబాబు చేతిలో ఎందుకు పెట్టావు? అని అడిగారు. దీనికి ప్రతిగా బాలయ్య మోహన్ బాబును... మీరు అన్న పెట్టిన TDP పార్టీని వదిలి ప్రత్యర్థి పార్టీలోకి ఎందుకు వెళ్లారని అడగడం జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. 

తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య, మోహన్ బాబు మధ్య పొలిటికల్ వాగ్వాదం నడిచింది. 1995లో ఎన్టీఆర్ నుండి పార్టీని హస్తగతం చేసుకున్న Chandrababu naidu సీఎం కావడం జరిగింది. అదే సమయంలో మోహన్ బాబు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్ కి వెళ్లారు. ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడ్ని చేయడంలో బాలయ్యతో పాటు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది. ఇక ఎన్టీఆర్ మరణించే సమయానికి సీఎం గా ఉన్న చంద్రబాబు, ఆ పార్టీలో నందమూరి కుటుంబ సభ్యులకు పెద్దగా ప్రాతినిధ్యం ఇవ్వలేదు.

 
ఏది ఏమైనా, బావ చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై బాలకృష్ణ ఎటువంటి సమాధానం చెబుతాడు, అలాగే మోహన్ బాబు టీడీపీ నుండి ఎందుకు బయటుకు వచ్చారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. అన్ స్టాపబుల్ టాక్ షో ప్రతి ఎపిసోడ్ కి బాలకృష్ణ రూ. 40లక్షలు ఛార్జ్ చేస్తున్నారట. మొత్తం 12ఎపిసోడ్స్ కలిగిన ఫస్ట్ సీజన్ కి ఆయన రూ. 5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని బాలయ్య ఛారిటీ కోసం వినియోగిస్తారని వినికిడి. 

Also read మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ వంటి స్టార్స్ విషయంలో ఆ క్రెడిట్ పూరీదే... రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Also read అయ్యో.. తప్పు పవన్ కళ్యాణ్ వైపే.. మహాభారతంలో కర్ణుడి పాత్ర ఫిక్స్, రాజమౌళి వైరల్ కామెంట్స్

Latest Videos

click me!