Kajal aggarwal: పబ్లిక్ గా ఆయనతో పెగ్గేస్తూ పేకాడుతున్న చందమామ... డబ్బుల కోసం ఏమైనా చేస్తావా కాజల్!?

Published : Oct 31, 2021, 06:49 PM ISTUpdated : Oct 31, 2021, 06:50 PM IST

సొసైటీ ఓ ఇమేజ్ ఉన్న తారలు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా తినే తిండి, కట్టే బట్ట, అలవాట్ల విషయంలో ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళను చూసి ప్రభావితం అయ్యేవారు, అనుకరించేవారు అనేక మంది ఉంటారు.

PREV
16
Kajal aggarwal: పబ్లిక్ గా ఆయనతో పెగ్గేస్తూ పేకాడుతున్న చందమామ... డబ్బుల కోసం ఏమైనా చేస్తావా కాజల్!?

అలాగే ఇమేజ్ ఉంది కదా అని, హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయకూడదు. సిగరెట్, ఆల్కహాల్, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తుల ప్రమోషన్స్ ని భారత ప్రభుత్వం నిషేధించింది. ప్రింట్. ఎలక్ట్రానిక్ మీడియాలో వీటి ప్రచారంపై నిషేధం ఉంది. ఇక వెండితెరపై సైతం పాత్రలు ఎవరైనా ఆ తరహా ఉత్పత్తులు వాడితే, ఆరోగ్యానికి హానికరం అంటూ, హెచ్చరిక నోట్ ప్రదర్శించడం జరుగుతుంది. 

26
kajal aggarwal

అయితే సామాజిక మాధ్యమాల్లో వీటి ప్రమోషన్స్ పై పరిమితులు లేవు. అత్యంత ప్రాచుర్యం కలిగిన ఇంస్టాగ్రామ్ లో హానికరమైన ఉత్పత్తులను  ప్రమోట్ చేయవచ్చు ముఖ్యంగా ఆల్కహాల్. ఈ లూప్ ని ఆదాయమార్గంగా సెలెబ్రిటీలు ఉపయోగించుకుంటున్నారు. 
 

 

36

తాజాగా కాజల్ ఆల్కహాల్ బ్రాండ్స్ లో ఒకటైన టీచర్స్ ఫిఫ్టీని ప్రోమోట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. టీచర్స్ ఫిఫ్టీ అత్యుత్తమమైన స్కాచ్ విస్కీ, మీ పండుగను టీచర్స్ ఫిఫ్టీ విస్కీతో జరుపుకోండి, అంటూ కామెంట్ చేశారు. భర్తతో పాటు ఈ బ్రాండ్ ని ప్రోమోట్ చేసిన కాజల్, గుడ్డిలో మెల్లలా, పరిమితిగా తాగండి, అది కూడా 25ఏళ్ల వయసు పై పడినవారు మాత్రమే, అని చిన్న సలహా పడేసింది.

46

 
మరి Kajal aggarwal లాంటి లక్షల మంది అభిమానులున్న స్టార్ ఒక ఆల్కహాల్ బ్రాండ్ ని పబ్లిక్ గా ప్రమోట్ చేయడం చింతించాల్సిన విషయమే. డబ్బుల కోసం ఇటువంటి చర్యలకు పాల్పడడం నిజంగా ఖండించాల్సిన విషయమే. 
 

56

 ఇటీవలే కాజల్ తన మొదటి యానివర్సరీ జరుపుకుంది. 2020 అక్టోబర్ 30న తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. కిచ్లు ఓ ఫర్నిచర్ సంస్థకు యజమాని కాగా, చాలా కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రస్తుతం కిచ్లు వ్యాపార ఉత్పత్తులకు కాజల్ ప్రచార కర్తగా ఉన్నారు. 


 

66

ఇక కాజల్ చిరంజీవికి జంటగా నటించిన ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది.  Acharyaచిత్రంలో Ram charan మరో హీరోగా నటిస్తుండగా, ఆయనకు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. 

Also read Balakrishna: తండ్రి స్థాపించిన పార్టీ చంద్రబాబు చేతిలో ఎందుకు పెట్టావ్... బాలయ్య సమాధానం

Also read అవుట్ డోర్ షూటింగ్, ఆ ఇద్దరూ పడుకోవాలని అడిగారు.. ఇషా గుప్తాకు లైంగిక వేధింపులు, చాలా డర్టీగా..


 

Read more Photos on
click me!

Recommended Stories