క్యాబరే డాన్స్ తో ఊపేసిన డిస్కో శాంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Disco Shanti : దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో 1980, 90 దశకాల్లో తన నృత్యాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన డిస్కో శాంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?  

Disco Shanti South Indian Cabaret Dancer Career and Current Life in telugu arj
Disco Shanti

Disco Shanti : కోలీవుడ్‌లో క్యాబరే డాన్స్ తో ఉర్రూతలూగించిన డిస్కో శాంతి తెలుగులో అడపాదడపా సినిమాలు చేసింది.  కానీ తమిళంలో `అంజద గండు` సినిమాలో విలన్ వజ్రముని ఎదురుగా డిస్కో శాంతి చేసిన క్యాబరే డ్యాన్స్ ఆ ఆడియెన్స్ కి ఇప్పటికీ గుర్తిండిపోతుంది. 

Disco Shanti South Indian Cabaret Dancer Career and Current Life in telugu arj

తెలుగులోనూ చిరంజీవి నటించిన `రౌడీ అల్లుడు`, `మెకానిక్‌ అల్లుడు`లో డిస్కో శాంతి డాన్సులతో అదరగొట్టింది. ఇక్కడ పాపులర్‌ అయ్యింది.  అప్పట్లో స్టార్‌గానూ రాణించింది. నటుడు శ్రీహరిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. సినిమాలు తగ్గించింది. మరి దాదాపు 60 ఏళ్ల వయసున్న ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. 


డిస్కో శాంతి అసలు పేరు శాంత కుమారి. కానీ ఆ పేరు అంటే ఎవరికీ అర్థం కాదు. అదే 'డిస్కో శాంతి' అంటే ఒక వయసు వాళ్ల గుండె వేగం పెరుగుతుంది. ఆమె 900 సినిమాల్లో నటించింది. ఆమె తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడే పాపులర్‌

1996లో డిస్కో శాంతి తెలుగు నటుడు శ్రీహరిని పెళ్లి చేసుకుంది. కూతురు జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్ స్థాపించారు. వీరికి ఇద్దరు కుమారులు శశాంక్‌ శ్రీహరి, మేగాన్ష్‌ శ్రీహరి ఉన్నారు. కూతురు జన్మించి మరణించింది. ఆమె పేరుతోనే అక్షర ఫౌండేషన్‌ స్థాపించారు.

శ్రీహరి చనిపోయాక శాంతి బాగా డిప్రెషన్‌లోకి వెళ్లింది. కొంత తాగుడుకు బానిసైంది. ఆ తర్వాత పిల్లల కోసం తాగడం మానేసింది. ఫ్యామిలీని సెట్‌ చేసేపనిలో పడింది. అదే సమయంలో కొంత సేవా కార్యక్రమాలు చేసింది. ఆమె కుటుంబం చాలా ఊర్లను దత్తత తీసుకుంది.

క్యాబరే నర్తకిలను సమాజం చూసే దృష్టి వేరుగా ఉంటుంది. కానీ డిస్కో శాంతి లాంటి వాళ్లు దాన్ని ఒక కళగా భావించారు. దానికో గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చారు. 

డిస్కో శాంతి కొన్ని ముఖ్యమైన పాత్రలు చేసినా, నటిగా సక్సెస్ కాలేదు. కానీ, క్యాబరే ప్రదర్శనలో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాన్సర్‌గా అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలను ఊపేసింది. 

సమస్యల నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్న శాంతి, తన వల్ల అయినంత సహాయం సమాజానికి చేస్తోంది. పిల్లలను చూసుకుంటూ పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. కొడుకు మేగాన్ష్‌ శ్రీహరి హీరోగా సినిమాలు చేశారు. కానీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు సినిమాలకు దూరమయ్యారు. 

read  more: రష్మిక మందన్న కన్నడలోనే కాదు, ఆ తెలుగు హీరోని కూడా పట్టించుకోలేదా? టాలీవుడ్‌లోనూ రచ్చ

also read: అలాంటి వాళ్లంటే ప్రభాస్‌కి నచ్చదు, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే?.. పెద్దమ్మ చెప్పిన లక్షణాలు

Latest Videos

vuukle one pixel image
click me!