ఠాగూర్ తరహాలో డాక్టర్ల మోసం వల్లే శ్రీహరి చనిపోయారు, ఆర్థిక సమస్యలతో అన్నీ అమ్మేశా..డిస్కో శాంతి ఆవేదన

Published : Aug 18, 2023, 01:14 PM IST

90వ దశకంలో డిస్కో శాంతి పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మెరిసింది. అనంతరం హీరో శ్రీహరిని వివాహం చేసుకుంది. 2013లో శ్రీహరి అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

PREV
16
ఠాగూర్ తరహాలో డాక్టర్ల మోసం వల్లే శ్రీహరి చనిపోయారు, ఆర్థిక సమస్యలతో అన్నీ అమ్మేశా..డిస్కో శాంతి ఆవేదన

తెలుగు నటి, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన డిస్కో శాంతి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో డిస్కో శాంతి పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మెరిసింది. అనంతరం హీరో శ్రీహరిని వివాహం చేసుకుంది. 2013లో శ్రీహరి అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డిస్కో శాంతి ఫ్యామిలీ, పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు. 

26

శ్రీహరి మరణం తర్వాత తమ కుటుంబ పరిస్థితి బాగా దిగజారిపోయింది అని డిస్కో శాంతి ఆవేదన వ్యక్తం చేసింది. తాజా ఇంటర్వ్యూలో శ్రీహరి మరణం గురించి, తమ ఆర్థిక పరిస్థితి గురించి డిస్కో శాంతి ఊహించని కామెంట్స్ చేసింది. ముంబైలో ఓ చిత్ర షూటింగ్ లో ఉన్న శ్రీహరి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీనితో చిత్ర యూనిట్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో శ్రీహరిని జాయిన్ చేశారు. 

36

డిస్కో శాంతి మాట్లాడుతూ శ్రీహరి మరణించే కొన్ని గంటల ముందు వైద్యులు వచ్చి చెకప్ చేశారు. శ్రీహరిని చూడడానికి కూడా నన్ను అనుమతించలేదు. అయితే వైద్యులు కొన్ని మెడిసిన్స్, ఇంజక్షన్స్ సూచించారు. ఓ నర్సు వచ్చి ఇంజక్షన్ ఇచ్చింది. కొంతసేపటికే శ్రీహరి కళ్ళు, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చింది. నాకు హిందీ రాదు కాబట్టి వాళ్ళతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే శ్రీహరిని మరో గదికి తీసుకువెళ్లారు. నేను ఆయన్ని చూడాలి అని ఎంత బతిమాలినా అనుమతించలేదు. 

46

ఆ తర్వాత శ్రీహరి మరణించినప్పటికీ కొన్ని గంటల వరకు నాకు చెప్పలేదు. అంతా ఠాగూర్ చిత్రంలో జరిగినట్లు అనిపించింది. డబ్బు మొత్తం కట్టాక మరణించిన విషయం చెప్పారు. ఖచ్చితంగా శ్రీహరి డాక్టర్ల రాంగ్ ట్రీట్మెంట్ వల్లే మరణించారు అని సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ లో అయి ఉంటే శ్రీహరి తప్పకుండా బతికేవారు అని డిస్కో శాంతి అన్నారు. 

56

శ్రీహరి మరణం తర్వాత తమ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించినట్లు డిస్కో శాంతి పేర్కొంది. అప్పు ఇచ్చినవాళ్లు ఇంటిని చుట్టుముట్టారు కానీ మా నుంచి డబ్బు తీసుకున్న వాళ్ళు మాత్రం మేము ఎలా ఉన్నాం అని కూడా పట్టించుకోలేదు. చాలా మంది డబ్బు తీసుకుని మోసం చేశారు. కానీ ఉన్న అప్పులు తీర్చేందుకు కారు, భూమి అమ్మేయాల్సి వచ్చింది. నగలు కూడా తాకట్టు పెట్టేశాను. మా ఆర్థిక పరిస్థితి బాగుండి ఉంటే.. చదువుల కోసం నా కొడుకు ఫారెన్ వెళ్ళేవాడు అని వాపోయింది. 

66
actress disco shanti

తాము నివాసం ఉంటుంది ఇల్లు కూడా రోడ్డు విస్తీరణలో కొంత పోయింది. పరిహారంగా వచ్చిన డబ్బుని బ్యాంక్ లో డిపాజిట్ చేశా. ఇక ప్రస్తుతం తమకి జీవనోపాధి కేవలం రెండు ఇళ్ల నుంచి వస్తున్న అద్దె మాత్రమే అని డిస్కో శాంతి పేర్కొంది. అమ్మేయగా మిగిలిన ఒక్క కారుని కూడా ఈఎంఐ కట్టకపోవడంతో బ్యాంక్ వారు తీసుకువెళ్లారు. తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు డిస్కో శాంతి ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని డిస్కోశాంతి అన్నారు. 

click me!

Recommended Stories