ఆలియా భట్ - రణ్ బీర్ కపూర్ మధ్య లిఫ్టిక్ లొల్లి.. రణ్ బీర్ ను దులిపేస్తోన్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే..?

Published : Aug 18, 2023, 01:08 PM ISTUpdated : Aug 18, 2023, 01:09 PM IST

చిన్న లిప్ స్టిక్.. బాలీవుడ్ లో వివాదం రేపింది. స్టార్ కపుల్ ను విమర్షలకు దారితీసేలా చేసింది. చివరకు ఆలియ భట్ వివరణ కూడా ఇచ్చింది.  ఇంతకీ ఈ లిప్ స్టిక్ వివాదం ఏంటీ..? అసలు సంగతి ఏంటి..? 

PREV
18
ఆలియా భట్ - రణ్ బీర్ కపూర్ మధ్య లిఫ్టిక్ లొల్లి.. రణ్ బీర్ ను దులిపేస్తోన్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే..?

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్స్ లో  రణబీర్ కపూర్  ఆలియా భట్‌  ముందు వరసలో ఉంటారు. ఇక ఈకపుల్ మీద ఎప్పుడూ.. సోషల్ మీడియా కన్ను.. బయట జనాల కన్ను ఉంటుంది. అభిమానుల ఫోకస్ వీరిపై ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరు కలిసి బయటికొచ్చినా లేదా ఒకరి గురించి ఒకరు మాట్లాడినా అది సెన్సేషనే అవుతోంది. 

28

తాజాగా వీరిద్దరికి సబంధించిన ఓ వివాదం వైరల్ అవుతోంది.  హార్ట్ ఆఫ్ స్టోన్  ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆలియా  భట్ ఓ విషయాన్ని వెల్లడించింది.  తన భర్త రణబీర్ కపూర్ ఒకసారి తన లిప్‌స్టిక్‌ను పూర్తిగా తుడిచేయమన్నాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఒక భార్యగా తను ఈవిషయాన్ని సరదాగానే అందరితో షేర్ చేసుకుంది. కానీ కొంతమంది మాత్రం రణబీర్ చాలా కంట్రోలింగ్ అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.ఈ వ్యాఖ్యలు తప్పుగా వెళ్ళడం వల్ల.. రణ్ బీర్ కు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి.  

38

ఆలియా భట్ చేసిన  కామెంట్స్ వల్ల రణబీర్ కపూర్  చాలా నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తోంది. అసలే రణ్ బీర్ కపూర్ అంటే బాలీవుడ్ తో పాటు.. ఆడియన్స్ లో డిఫరెంట్ ఇమేజ్ ఉంది. రణ్ బీర్ ప్లే బాయ్ అని.. డేటింగ్ ప్లాగ్ అంటూ... విమర్షలు ఉన్నాయి. ఆలియాతో పెళ్లి కంటే ముందు చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు చాలా మందితో రణ్ బీర్ డేటింగ్ చేశాడు. 

48

అయితే డేటింగ్ చేసిన ప్రతీ వారితో వివాదం.. బ్రేకప్ లతో హాట్ టాపిక్ అవుతూ వచ్చాడు. అయితే ఈ బ్రేకప్ లతో రణ్ బీర్ పై చాలా వ్యాతిరేకత వచ్చింది. అసలు వారితో రణబీర్ ఎందుకు విడిపోయాడో పూర్తిగా క్లారిటీ లేకపోయినా.. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం.. ఈ బ్రేకప్ ల విషయంలో  ఇప్పటికీ రణబీర్‌దే తప్పు అన్నట్టుగా విమర్శిస్తుంటారు.

58
Alia Bhatt, Ranbir Kapoor

ఇక ఆలియా వ్యాఖ్యలతో.. రణ్ బీర్ కపూర్ ను విమర్షించడం మొదలు పెట్టారు నెటిజన్లు. దాంతో ఇక ఆలియా భట్ రంగంలోకి దిగింది. ఈ కామెంట్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. రణబీర్ ఒక రెడ్ ఫ్లాగ్ అని ముద్ర వేసిన వారికి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పింది. తన భర్త రణబీర్‌ ఒకసారి తన లిప్‌స్టిక్‌ను తుడిచేసుకోమన్నాడని, ఎందుకంటే తనకు ఆలియా నేచురల్ లిప్ కలర్ ఇష్టమని చెప్పాడని ఆలియా తెలిపింది. 
 

68

రణబీర్‌పై తను చేసిన సరదా కామెంట్స్ సీరియస్‌గా మారిన విషయం ఆలియా వరకు వెళ్లింది. అందుకే నెటిజన్లు చేస్తున్న కాంట్రవర్సీలకు బ్రేక్ వెయ్యాలని డిసైడ్ అయ్యింది.  హ్యాపీ ఫేస్‌తో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్‌గా ‘మాటల్లేవ్.. వైబ్స్ మాత్రమే’ అంటూ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 

78

ఇది చూసిన రణబీర్, ఆలియా ఫ్యాన్స్.. ఒక్కమాటతో కాంట్రవర్సీకి ఎండ్ చెప్పాలని చూసింది అని అంటున్నారు. ఈ ఫోటోల్లో ఆలియా చాలా క్యూట్‌గా కనిపిస్తుంది అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లో ఆలియాతో జతకట్టిన రణవీర్ సింగ్ సైతం ఈ పోస్ట్‌కు ‘వైబ్స్’ అని కామెంట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం ఆలియా.. తనపై, తన భర్తపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. 

88

ఎందుకంటే తను నటించిన సినిమా ప్రమోషన్స్, నటించబోతున్న మూవీలతోనే తను చాలా బిజీగా ఉంది. తాజాగా విడుదలయిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ కూడా కలెక్షన్స్ విషయంలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories