షాకింగ్: డిజాస్టర్ ‘డబుల్ ఇస్మార్ట్’ అక్కడ పెద్ద హిట్

Published : Jan 28, 2025, 08:57 AM IST

రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ, ఇప్పుడు మరోసారి ఈ చిత్రం వార్తల్లో నిలిచింది.  తెలుగులో పూరి జగన్నాథ్ మార్క్ కనిపించకపోవడం, అలీ కామెడీ ట్రాక్ పెద్ద మైనస్.

PREV
14
 షాకింగ్: డిజాస్టర్  ‘డబుల్ ఇస్మార్ట్’ అక్కడ పెద్ద హిట్

పూరి జగన్నాథ్ లైగర్‌తో పూర్తిగా దెబ్బ తిన్నాడు.  దాంతో హీరో రామ్, పూరి కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ అని తీశారు. ఇస్మార్ట్ శంకర్ అయితే మాస్ ఆడియెన్స్‌కు బాగానే ఎక్కేసింది.  అయితే ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా అలానే హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

అయితే ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.  కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్  (Sanjay Dutt) విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ (Mani Sharma) సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి.  కానీ సినిమా మార్నింగ్ షోకే మేటర్ లేదని తేలిపోయింది. 

24
Double iSmart


 ‘ఇస్మార్ట్ శంకర్’ తో పోల్చి  ఈ సినిమాని చూసారు ప్రేక్షకులు.దీంతో ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించినా తర్వాత బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.11.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.38.58 కోట్ల దూరంలో ఆగిపోయి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఈ మూవీ. ఓటిటిలోనూ వర్కవుట్ కాలేదు. 

34
Double Ismart Ram Pothinenis film


అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో హిందీ వెర్షన్‌లో రిలీజ్ చేయగా, దీనికి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్‌తో యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది.  తెలుగునాట ఫ్లాప్ మూవీ గా నిలిచిన డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి యూట్యూబ్ హిందీ వెర్షన్‌కు ఇలాంటి రెస్పాన్స్ రావడంతో మేకర్స్, రామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

44
Ram Pothineni Double ISMART


 ఈ డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఏ కోణంలోనూ పూరి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. మరీ ముఖ్యంగా అలీ చేత చేయించిన బోకా అనే కామెడీ ట్రాక్ చెత్తగా అనిపిస్తుంది. అలీని అలా ప్రేక్షకుడు చూడలేకపోతాడు. ఒకటి, రెండు సార్లు అంటే బాగుంటుందేమో కానీ పదే పదే తెరపై కనిపించడంతో విసుగు వస్తుంది. ఆ ట్రాక్ ఏ ఒక్క చోట కూడా నవ్వించదు. తన రైటింగ్ ఎంతగా పడిపోయింది.. ఎంత సిల్లీగా ఉంటుందని చెప్పడానికి ఆ ట్రాక్ ఒక్కటి చాలనిపిస్తుంది.

click me!

Recommended Stories