Nandamuri Balakrishna, Daaku Maharaaj,OTT Release Date
సంక్రాంతికి బాలయ్య ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి దుమ్ము దులిపారు. మాస్ సినిమాలకి పెట్టింది పేరైన యువ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించారు. కలెక్షన్స్ వైజ్ ఈ సినిమా నిర్మాతకు, కొనుక్కున్న వారికి ఆనందం కలిగించింది. అలాగే ఈ సినిమా థియేటర్ రన్ దాదాపు పూర్తైంది. ఈ నేపధ్యంలో ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది
24
Nandamuri Balakrishna Daaku Maharaaj
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘డాకు మహారాజ్’ చిత్రం నెట్ ప్లిక్స్ లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఇది అఫీషియల్ గా ఇంకా ప్రకటన రాలేదు. థియేటర్ లో మిస్సైన వారు ‘డాకు మహారాజ్’ని ఓటిటిలో చూపటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
34
స్టోరీ లైన్
సివిల్ ఇంజీనీర్ సీతారం(బాలయ్య)..చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని పోతూంటాడు. ఎన్నో గ్రామాలకు అతను దేవుడుగా మారతాడు. అలాంటి సీతారాం జీవితంలో జరిగిన ఓ సంఘటనతో డాకూ మహారాజ్ గా టర్న్ అవుతాడు. జీపు దిగి గుర్రం ఎక్కి డాకూగా తిరుగుతూంటాడు. ఆ పరిస్దితులు ఏమిటి, అతనికి చిన్న పాప వైష్ణవికి ఉన్న కనెక్షన్ ఏమిటి, ఆమెను రక్షించాలనుకోవటానికి కారణం ఏమిటి, ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితాన్ని సమూలంగా మార్చిన సంఘటన ఏమిటి వంటి విషయాలుకు సమాధానమే ఈ సినిమా కథ.
44
బాలయ్య ఎప్పటిలాగే తన మాస్ విశ్వరూపం చూపెట్టారు కొన్ని సీన్స్ లో. అలాగే రెగ్యులర్ మాస్ మాసాలా సినిమానే అయినా స్టైలిష్ గా సినిమా సాగుతుంది. కమల్ హాసన్ విక్రమ్, రజనీకాంత్ జైలర్ లను గుర్తు చేసే ఎపిసోడ్స్ సినిమాలో ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాలు డిఫరెంట్ స్క్రీన్ ప్లేలతో చేసి హిట్ కొట్టిన మ్యాజిక్ లు . ఆ సినిమా సక్సెస్ చూసి అందులోని ఎలివేషన్స్, పాప సెంటిమెంట్ వంటివి మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిన సినిమా ఇది. అయితే కేవలం ఎలివేషన్స్, స్టైలిష్ విజువల్స్ ఆ చిత్రాల సూపర్ హిట్ కు కారణం కాదు అనే విషయం మర్చిపోయారు. అవన్నీ కేవలం సక్సెస్ స్దాయిని మరో స్దాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడినవి మాత్రమే.