సినిమా బ్లాక్‌బస్టర్ హిట్..! కానీ ముందుగా క్లైమాక్స్ విని నవ్వుకున్నారు.. నిజాలు చెప్పిన డైరెక్టర్

Published : Jan 20, 2026, 06:31 PM IST

Preyasi Raave: ప్రేయసి రావే సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో దర్శకుడు చంద్ర మహేష్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారట. మొదటిగా అనుకున్న క్లైమాక్స్‌ను మార్చమని రామానాయుడు, ఆర్‌.బి. చౌదరి లాంటివారు సూచించారట.  

PREV
15
కీలక వ్యాఖ్యలు..

ప్రేయసి రావే సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో దర్శకుడు చంద్ర మహేష్ తీవ్ర ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా జర్నీలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా, క్లైమాక్స్ చిత్రీకరణనే అతిపెద్ద సవాలుగా నిలిచిందని వివరించారు.

25
మొదట కథ చెప్పినప్పుడు..

నిర్మాత రామానాయుడికి మొదట కథ చెప్పినప్పుడు.. ఆయనకు తెగ నచ్చేసిందని.. వచ్చిన ప్రతీ ఒక్కరికి ముఖ్యంగా క్లైమాక్స్ గురించి వివరించేవారని మహేష్ తెలిపారు. ఈ క్రమంలో ఒకసారి కేర్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ రాజు కథ విని క్లైమాక్స్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే, వాడి హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా? హార్ట్ ఆపరేషన్‌కు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, బ్లడ్ గ్రూప్ ఉండాలి" అంటూ వైద్యపరమైన డౌట్స్ ఎత్తిచూపారు.

35
రెండు రోజుల తర్వాత

ఆ తర్వాత రెండు రోజులకు ఆర్‌.బి. చౌదరి.. రామానాయుడిని కలవడానికి వచ్చారు. ఆయనకు కూడా కథ చెప్పగా, "కథ బాగుంది రామానాయుడు, క్లైమాక్స్ మార్చండి" అని సూచించారు. శ్రీకాంత్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారని, అతడు చనిపోతే ప్రేక్షకులు పట్టించుకోరని, వెంకటేష్ లాంటి హీరో నాలుక కోసుకుంటేనే జనం పట్టించుకోలేదని, శ్రీకాంత్ గుండె ఆపరేషన్ గురించి ఆలోచించరని ఆయన అన్నారు.

45
క్లైమాక్స్ మార్చమన్నారు..

ఆర్‌.బి. చౌదరి మాటలకు రామానాయుడు మరింతగా ఆలోచన చేశారు. "మహేష్ మనం అనుకున్న క్లైమాక్స్ కరెక్ట్ కాదు, అందరూ నెగెటివ్‌గా చెబుతున్నారు, క్లైమాక్స్ మార్చండి" అని డైరెక్టర్‌ను కోరారట. అయితే, చంద్ర మహేష్ తాను ముందుగా అనుకున్న మొదటి క్లైమాక్స్ ఆలోచనను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడే "సార్, క్లైమాక్స్ లాస్ట్‌లో పెడదాం. ఇప్పుడే క్లైమాక్స్ గురించి ఆలోచిస్తే షూటింగ్ డేట్స్ అన్నీ పోతాయి. కథ అదే ఉంటుంది, క్లైమాక్స్ ఒక్కటే కదా మార్చాలి. శ్రీకాంత్ చనిపోకూడదు, బతకాలి. నేను దీనిపై కొత్తగా ఆలోచిస్తాను" అని చెప్పి, చివరి రెండు రోజుల పనిని పెండింగ్ పెట్టారు.

55
కాళ్ళ మీద పడిపోయా..

ఎంత తట్టినా.. రెండో క్లైమాక్స్ కోసం ఎలాంటి ఆలోచన రాలేదు. వెంటనే రామానాయుడు దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లపై పడిపోయాను. "సార్, నేను ఎవరో మీకు తెలియదు. మీ సంస్థలో అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు, ప్రోత్సాహం ఇచ్చారు, డైరెక్టర్‌గా అనౌన్స్ చేశారు. మొదట చెప్పిన కథకు మీరు ఎంతో ఫీల్ అయ్యారు. మధ్యలో ఎవరెవరో ఏదేదో అన్నారు అని చెప్పి మీరు అది మార్చమన్నారు. దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు. పాసాని మురళి ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నేను మీరు అనుకున్న దానికన్నా నాలుగైదు రోజులు ముందే సినిమా తీశాను. ఒక్క రోజు నాకు కేటాయించండి, రెండు రోజులు కూడా వద్దు, ఒకే ఒక్క రోజు ఇవ్వండి సార్. నేను తీసి పెడతాను ఈ క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్, మీరు చెప్పింది వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. ఒక్క అవకాశం సార్ ఇది" అని కన్నీళ్లతో అడిగా.. ఆయన ఒప్పుకున్నారు. ఆ తర్వాత సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Read more Photos on
click me!

Recommended Stories