చెన్నైలోనే అత్యంత సంపన్న ఫ్యామిలీ, కట్‌ చేస్తే ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డుమీదకు, తేజ లైఫ్‌లో జరిగిన దారుణం

First Published | Oct 7, 2024, 1:56 PM IST

దర్శకుడు తేజ ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసా? చెన్నైలోనే అత్యంత సంపన్న ఫ్యామిలీ అయిన వాళ్లు, ఎందుకు రోడ్డుమీదకు వచ్చారు. వేల కోట్లు ఎలా పోయాయి. 
 

దర్శకుడు తేజ.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సెపరేట్‌ పేజీని క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు. సరికొత్త ట్రెండ్‌ని సృష్టించిన దర్శకుడు. లవ్‌ స్టోరీస్‌తో తేజ మార్క్ ఎవరూ మర్చిపోలేరు. `చిత్రం`, `జయం`, `నువ్వు నేను`, `జై`, `ఔనన్నా కాదన్నా` వంటి సినిమాలు లవ్‌ స్టోరీస్‌లో ఒక స్టయిల్‌ మూవీస్‌ అని చెప్పొచ్చు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్, వీళ్లే ఎందుకు?

గ్రామీణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే లవ్‌ స్టోరీలు. అందుకే ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. వీటికి బ్రహ్మారథం పట్టారు. అప్పట్లో తేజ సినిమాలను యూత్‌ ఎగబడి చూసేవాళ్లు. ఈ క్రమంలో ఆయన సినిమాలు నిరాశ పరుస్తూ వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత `నేను రాజు నేనే మంత్రి` సినిమాతో హిట్‌ అందుకున్నాడు. మళ్లీ డీలా పడ్డాడు. 
 

తేజ ఇప్పుడు మళ్లీ దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. రానాతో `నేనే రాజు నేనే మంత్రి`కి సీక్వెల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనిలో ఉన్న తేజకి సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. తేజ బ్యాక్‌ గ్రౌండ్‌ వింటే షాకిచ్చేలా ఉంది. ప్రస్తుతం తెలుగులో అందరు దర్శకుల మాదిరిగానే ఉన్నా ఆయనది ఒకప్పుడు బాగా రిచెస్ట్ ఫ్యామిలీ కావడం విశేషం.

అది ఎంత రిచెస్ట్ అంటే యాభై ఏళ్ల క్రితం చెన్నైలోనే రిచెస్ట్ ఫ్యామిలీలో ఆయన ఫ్యామిలీ ఒకటిగా ఉండటం మరో విశేషం. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు సాధారణ దర్శకుడిగా ఎందుకు ఉండిపోయాడు? ఆయన జీవితంలో ఏం జరిగింది? అంతటి ఆస్తిపరుడు రోడ్డుమీదకు ఎందుకొచ్చారనేది చూస్తే. 
 

Latest Videos


దర్శకుడు తేజ తండ్రి జేబీకే చౌదరీ చెన్నైలో రిచెస్ట్ బిజినెస్‌ మేన్‌. ఎక్స్ పోర్ట్ వ్యాపారం చేసేవాళ్లు. జపాన్‌ కేంద్రంగా తమ ఎక్స్ పోర్ట్ వ్యాపారం నడిచేది. ఇండస్ట్రియలిస్ట్ గానూ ఆయనకు పేరుంది. కానీ తేజ మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. దీంతో ఒక్కసారిగా కుటుంబం ఒంటరైపోయింది. తేజ మదర్‌ బాగా చదువుకుంది. వ్యాపారాలన్నీ ఆమెనే లీడ్‌ చేసేది. వాళ్ల బిజినెస్‌ ది బెస్ట్ గా నడవడంలో ఆమె పాత్రనే కీలకం. చెన్నైలో ఎన్నో ఆస్తులు కొన్నది. వేల కోట్ల విలువైన ఆస్తులు ఆమె కొనుగోలు చేసింది.

కానీ ఆమె మరణంతో అవన్నీ చూసుకోవడం తేజ తండ్రికి సాధ్యం కాలేదు. పైగా ఆయనకు చదువులో వీక్‌. దీంతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. ఆస్తులన్నీ పోయాయి. చాలా మంది మోసం చేశారట. ఈ క్రమంలో అవన్నీ తట్టుకోలేక తండ్రి కూడా మరణించాడు. తన పదవ ఏటకు వచ్చేసరికి తేజ అనాథ అయిపోయాడు. తనకు అక్క, చెల్లి కూడా ఉంది. ఈ ముగ్గురు రోడ్డుమీదకు వచ్చేశారు. ఆస్తులు కాదు కదా, చిల్లి గవ్వ కూడా లేదు. 
 

గోల్డెన్‌ స్ఫూన్‌తో పెరిగిన తేజ జీవితం పదేళ్లలోనే తలక్రిందులైపోయింది. దీంతో తమ ముగ్గురుని బందువులు దత్తత తీసుకున్నారు. తేజ చిన్నాన్నల వద్ద తాను, చెల్లి పెరిగారు. మేనత్త వద్ద అక్కని పెంచారట. ఎన్నో ఆస్తులుండేవట, అవన్నీ ఏమయ్యాయో తెలియదని తెలిపారు తేజ. ఓపెన్‌ హార్ట్ వీత్‌ ఆర్కే టాక్‌ షోలో ఈ విషయాన్ని తెలిపారు తేజ. ఆ తర్వాత తన సొంత తెలివితో బాగా చదువుకుని ఎదిగి సినిమాల్లోకి వచ్చాడు తేజ. సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేసి దర్శకుడు అయ్యారు. ఆర్జీవి వద్ద కూడా పని చేశాడు.

`చిత్రం` సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఉదయ్‌ కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన ఈ లవ్‌ స్టోరీ సంచలనం సృష్టించింది. ఇదొక బోల్డ్ అటెంప్ట్ గా నిలచింది. ఇలా కూడా సినిమాలు తీస్తారా? ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా? అని ఇండస్ట్రీ మొత్తం షాక్‌ అయ్యేలా చేసిందీ మూవీ. ఓ రకంగా `చిత్రం` టాలీవుడ్‌లో ఒక సంచలనం. లవ్‌ స్టోరీస్‌లో పాత్‌ బ్రేకర్‌. హద్దులు చెరిపేసిన మూవీగా నిలిచింది. ఇప్పుడు కల్ట్ మూవీ అయిపోయింది. 
 

ఆ తర్వాత వరుసగా లవ్‌ స్టోరీస్‌తో విజయాలు అందుకున్నారు, స్టార్‌ డైరెక్టర్‌ అయ్యారు తేజ. రోడ్డుమీద ఏం లేని పరిస్థితి నుంచి టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగారు. ఆ తర్వాత కూడా కొన్ని ఫైనాన్షియల్‌ ఇబ్బందులు చవిచూశారు. కానీ ఇప్పుడు మంచి స్థానంలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇలా తేజ జీవితంలో చాలా హైట్స్ ఉన్నాయి, జీరో అయిన పరిస్థితి ఉంది, సక్సెస్‌ ఉంది, ఫెయిల్యూర్‌ ఉంది.

జీవితాన్ని మరెవ్వరూ చూడలేని యాంగిల్స్ ని ఆయన చూసేశారు. అందుకే ఆయన డబ్బుకి విలువివ్వరు. కులాలు, మతాలు అనేదాన్ని పట్టించుకోరు. కంప్లీట్‌ ఒక విభిన్నమైన దారితో వెళ్తున్నారు. తన పిల్లలను కూడా అలానే పెంచుతున్నారు తేజ. 
 

click me!