ప్రభాస్, మహేష్ విషయంలో మనసులో మాట బయటపెట్టిన హీరో..జేబులో గన్ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి

First Published | Aug 18, 2024, 7:08 AM IST

ఆ చిత్రం తర్వాత చాలా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను భయపడలేదు కానీ.. సేఫ్ గా జేబులో గన్ పట్టుకుని తిరిగేవాడిని.

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. హీరో శ్రీకాంత్ కి ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది.  ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. 

శ్రీకాంత్ టాలీవుడ్ లో దాదాపు చాలా మంది స్టార్ హీరోలతో కలసి నటించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో కలసి అద్భుతమైన చిత్రాలు చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కూడా నటించారు. మహేష్ బాబు, ప్రభాస్ తో ఇంకా నటించలేదు. సమయం ఉంది.. తప్పకుండా వాళ్ళతో కూడా సినిమా చేస్తానని శ్రీకాంత్ తెలిపారు. 


తాను ఎక్కువగా సౌందర్య, రాసి లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసినట్లు శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. నా కెరీర్ లో ఎప్పుడూ ఏ చిత్రం కూడా కాంట్రవర్సీ కాలేదు. ఖడ్గం చిత్రం ఎంత పెద్ద హిట్టో అంత కాంట్రవర్సీ అయింది. ముఖ్యంగా నా పాత్ర వల్ల అని శ్రీకాంత్ అన్నారు. 

ఆ చిత్రంలో ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా కొన్ని డైలాగులు చెబుతాను. అవి కాంట్రవర్సీ అయ్యాయి. ఆ చిత్రం తర్వాత చాలా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను భయపడలేదు కానీ.. సేఫ్ గా జేబులో గన్ పట్టుకుని తిరిగేవాడిని. క్రికెట్ ఆడుతున్నా జేబులో గన్ ఉండేది అని శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Actor Chinna

ఖడ్గం చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో శ్రీకాంత్ తో పాటు రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం శ్రీకాంత్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో రాంచరణ్ గేమ్ ఛేంజర్ కూడా ఉంది. 

Latest Videos

click me!