పవన్ తన కొడుక్కి కూడా జపనీస్ పేరే పెట్టారు, మొదట అనుకున్నది తేరి రీమేక్.. ఓజీలో జపాన్ గుట్టు విప్పిన సుజీత్

Published : Sep 26, 2025, 07:40 AM IST

డైరెక్టర్ సుజీత్ ముందుగా పవన్ కళ్యాణ్ తో తేరి రీమేక్ ప్రారంభించారట. కానీ చివరికి ఓజీ మూవీ ఎలా లైన్ లోకి వచ్చింది, జపాన్ కనెక్షన్ ఏంటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
త్రివిక్రమ్ వల్లే ఓజీ మూవీ ఛాన్స్ 

భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఓజీ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా బీస్ట్ మోడ్ లో ఈ మూవీలో కనిపించారు. ఒక రకంగా చెప్పాలంటే యాక్షన్ విధ్వంసం సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా చూస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కి ఇంతటి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ సుజీత్ ఓ ఇంటర్వ్యూలో ఓజీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం త్రివిక్రమ్ గారి వల్లే వచ్చింది అని సుజీత్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తే బావుంటుంది అని త్రివిక్రమ్ భావించారు. 

25
పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనగానే టెన్షన్ పడ్డా 

ముందుగా నాకు దానయ్య నుంచి కాల్ వచ్చింది. ఆ టైంలో నేను ముంబైలో ఉన్నాను. సాహో కొంత మందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు. దీనితో గ్యాప్ తీసుకున్నా. ముంబైలో ఒక స్టార్ హీరోతో సినిమా కూడా సెట్ అయింది. ఆ టైంలో దానయ్య, త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అని చెప్పగానే కొంచెం టెన్షన్ పడ్డాను. ఆల్రెడీ ప్రభాస్ గారితో చేసిన సాహో అంతగా వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇక్కడ టాలీవుడ్ లో స్టార్ హీరోతో మూవీ అంటే చాలా ప్రెజర్ ఉంటుంది. కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఏదైతే అది అయింది అని బాలీవుడ్ హీరో సినిమా వదిలేసి వచ్చేశాను. 

35
ముందుగా తేరి రీమేక్ అనుకున్నాం 

ముందుగా కళ్యాణ్ గారితో అనుకున్నది ఓజీ కాదు. తేరి రీమేక్ చేయాలని అనుకున్నాం. మూడు నెలలు వర్క్ చేసి బౌండ్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశా. ఎందుకో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారే రీమేక్ వద్దులే.. కొత్త కథ ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు అనిపించింది.. ఇదే మంచి ఛాన్స్ అని. ఆ టైంలోనే ఓజీ స్టోరీ లైన్ చెప్పాను. ముందుగా జపనీస్ బ్యాక్డ్రాప్ చెప్పలేదు. అంత కాంప్లికేటెడ్ బ్యాక్డ్రాప్ వద్దని అనుకున్నా. ముందుగా కళ్యాణ్ గారికి చెప్పింది మహాభారతంతో లింక్ చేస్తూ కథ చెప్పా. 

45
ఓజీకి ప్రీక్వెల్, జపాన్ ఫ్లాష్ బ్యాక్ తో.. 

కౌరవులు, పాండవులు ఇలా రెండు మాఫియా గ్రూపులు ఉంటే కర్ణుడు లాంటి వ్యక్తి.. పాండవుల వైపు వస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ ని చెప్పా. అది కళ్యాణ్ గారికి బాగా నచ్చింది. కళ్యాణ్ గారు నన్ను పూర్తిగా నమ్మారు. కథని డెవలప్ చేసే క్రమంలో జపాన్ బ్యాక్ డ్రాప్ వచ్చింది. ఓజీ చిత్ర ప్రీక్వెల్ కి సరిపడా కథ కూడా ఉంది. దాదాపు 1 గంట కథ జపాన్ లోనే ఉంటుంది. ఓజీకి తండ్రి ఉంటే ఆయన జపాన్ లో ఏం చేశారు, సుభాష్ చంద్రబోస్ తో లింక్ ఏంటి ? అనే అంశాలు ఆ కథలో ఉంటాయి అని సుజీత్ తెలిపారు. జపాన్ బ్యాక్ డ్రాప్ అనగానే పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చింది. ఆయనకి జపాన్ కల్చర్ అంటే ఇష్టం. అక్కడ మార్షల్ ఆర్ట్స్ పై ఆయనకి అవగాహన ఉంది. తన కొడుకు అకీరాకి కూడా జపనీస్ పేరే పెట్టారు. అకీరా పేరుని అకీరా కురుసోవా అనే డైరెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టారు అని సుజీత్ తెలిపారు. 

55
హమ్మయ్య అనుకుంటున్న ఫ్యాన్స్ 

రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ అంతగా చేయలేదు. దీనిపై కూడా సుజీత్ క్లారిటీ ఇచ్చారు. సినిమాకి కావలసిన హైప్ ఉంది. వాంటెడ్ గానే మూవీ గురించి ఇక ఎవరూ ఎక్కువగా మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యాం. అనవసరమైన అంచనాలు పెంచి గందరగోళం సృష్టించాలని అనుకోలేదు. ఉన్న కంటెంట్ ని ఇప్పుడున్న అంచనాలతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అని అనిపించినట్లు సుజీత్ తెలిపారు. ఓజీతో సాహో కనెక్షన్ గురించి మాట్లాడుతూ.. సాహో కి సంబంధించిన సన్నివేశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని.. కానీ అనవసరమైన గందరగోళం వద్దని వాటిని తొలగించినట్లు తెలిపారు. సుజీత్ తేరి రీమేక్ గురించి చెప్పగానే ఫ్యాన్స్ హమ్మయ్య అని ఫీల్ అవుతున్నారు. పొరపాటున సుజీత్ తేరి రీమేక్ చేసి ఉంటే ఓజీ లాంటి అద్భుతమైన చిత్రాన్ని మిస్ అయ్యేవాళ్ళం అని కామెంట్స్ పెడుతున్నారు. తన తదుపరి చిత్రం నేచురల్ స్టార్ నానితో ఉంటుందని సుజీత్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories